E-Paper
Advertisement

Vijay Rashmika sangeet: విజయ్ రష్మిక సంగీత్..ఫోటో గ్యాలరీతో లవ్ స్టోరీని బయటపెట్టారుగా?

Vijay Rashmika sangeet: విజయ్ రష్మిక సంగీత్..ఫోటో గ్యాలరీతో లవ్ స్టోరీని బయటపెట్టారుగా?
Advertisement

Rashmika -Vijay Sangeet: రష్మిక మందన్న విజయ్ దేవరకొండ ఫిబ్రవరి 26వ తేదీ పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే వీరు హల్దీ సంగీత్, మెహందీ వేడుకలను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోబోతున్నారు. గత రాత్రి సంగీత్ ఎంతో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సంగీత్ వేడుకకు సంబంధించిన కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి ఇందులో భాగంగా రష్మిక మందన్న(Rashmika) విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) గ్యాలరీల రూపంలో తమ లవ్ స్టోరీని బయట పెట్టారని తెలుస్తోంది. ఈ సంగీత్ వేడుకలో భాగంగా రష్మిక విజయ్ దేవరకొండ క్యూట్ ఫోటోలతో ఎంతో అందంగా అలంకరించారు.

లవ్ స్టోరీ రివీల్ చేసిన విరోష్..

విజయ్ దేవరకొండ రష్మిక వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో రష్మిక తన లవ్ స్టోరీని ఈ విధంగా అందరికీ తెలియజేశారు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. రష్మిక విజయ్ దేవరకొండ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ గీతగోవిందం డియర్ కామ్రేడ్ వంటి సినిమాలలో నటించారు. ఈ సినిమాల సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని తెలుస్తోంది.

వెకేషన్ ఫోటోలతో గ్యాలరీ..

Advertisement

ఇలా గత కొంతకాలంగా రిలేషన్ లో ఉన్న విజయ్ రష్మిక తమ రిలేషన్ గురించి బయట పెట్టకపోయినా నిత్యం వీరిద్దరూ కలిసి వెకేషన్ లకు వెళ్లడం ఒకే చోటే ఫోటోలకు ఫోజులిస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని స్పష్టమైనది. అయితే ఇప్పటివరకు కూడా వీరిద్దరూ తమ రిలేషన్ గురించి బయట పెట్టలేదు కానీ ఏకంగా పెళ్లి గురించి అధికారకంగా ప్రకటన వెల్లడించారు. రిలేషన్ రూమర్లను నిజం చేస్తూ ఈ జంట ఏడడుగులు వేయబోతున్న నేపథ్యంలో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

విజయ్ రష్మిక వివాహం ఉదయపూర్ లోని ఐటీసీ మెమోంటోస్ రిసార్ట్ లో ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. 24వ తేదీ నుంచి 26వ తేదీ వరకు వీరి పెళ్లి వేడుకలు జరగబోతున్నాయి. ఇప్పటికే ఈ పెళ్లి వేడుకలలో భాగంగా పలువురు సెలబ్రిటీలు ఉదయ్ పూర్ చేరుకున్నారు. ఇక ఈ పెళ్లి వేడుకల్లో భాగంగా అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. ఇలా పెళ్లి సన్నిహితుల సమక్షంలో జరిగిన వీరి వివాహ రిసెప్షన్ మాత్రం సినీ రాజకీయ సెలబ్రిటీల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఇక ఈ జంట ఫిబ్రవరి 26వ తేదీ పెళ్లి చేసుకోబోతున్న నేపథ్యంలో ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఈ జంటకు అభినందనలు తెలియజేసిన సంగతి తెలిసిందే.

AAlso Read: Rishab sheety: రష్మిక పెళ్లిపై రిషబ్ శెట్టి షాకింగ్ కామెంట్స్…ఇంకా విభేదాలు తొలగలేదా?

Related News

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

Big Stories

Advertisement
×