E-Paper
Advertisement

Rishab sheety: రష్మిక పెళ్లిపై రిషబ్ శెట్టి షాకింగ్ కామెంట్స్…ఇంకా విభేదాలు తొలగలేదా?

Rishab sheety: రష్మిక పెళ్లిపై రిషబ్ శెట్టి షాకింగ్ కామెంట్స్…ఇంకా విభేదాలు తొలగలేదా?
Advertisement

Rishab Shetty: నటి రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ మరికొన్ని గంటలలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంటం పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్న నేపథ్యంలో అభిమానులందరూ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉదయ్ పూర్ ప్యాలెస్ లో వీరి వివాహపు వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇప్పటికే కుటుంబ సభ్యులతో పాటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు అత్యంత సన్నిహితులు కూడా ఉదయ్ పూర్ చేరుకున్న సంగతి తెలిసిందే. గత రాత్రి వీరి సంగీత్ వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఇక 26వ తేదీ ఈ జంట పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు.

రష్మిక పెళ్లికి పిలవలేదా?

ఇలా విరోష్ వెడ్డింగ్(Virosh wedding) కోసం పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే రష్మికను ఇండస్ట్రీకి పరిచయం చేసిన డైరెక్టర్ రిషబ్ శెట్టి(Rishab Shetty)ని మాత్రం ఈ వివాహ వేడుకకు ఆహ్వానించడం లేదని తెలుస్తోంది. తాజాగా నటుడు రిషబ్ శెట్టి నేడు ఉదయం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు. స్వామి దర్శనం అనంతరం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఈయన మీడియాతో మాట్లాడారు. అయితే మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఒక రిపోర్టర్ రష్మిక మిమ్మల్ని పెళ్లికి పిలవలేదా? అంటూ ప్రశ్న వేశారు. ఈ ప్రశ్న వినగానే రిషబ్ శెట్టి థాంక్యూ అని చెబుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో రిషబ్, రష్మిక మధ్య చోటు చేసుకున్న విభేదాలు సద్దుమనగలేదా అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

రష్మికను పరిచయం చేసిన రిషబ్ శెట్టి..

Advertisement

రష్మిక మందన్న రక్షిత్ శెట్టి హీరో హీరోయిన్లుగా రిషబ్ దర్శకత్వంలో కిరిక్ పార్టీ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈమెకు ఇండస్ట్రీలో మరిన్ని అవకాశాలు కూడా వచ్చాయి. ప్రస్తుతం నేషనల్ క్రష్ గా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా ఎంతో బిజీగా ఉన్నారు. రష్మికకు మంచి కెరియర్ ఇచ్చిన రిషబ్ శెట్టి నటించిన కాంతారా సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమా చూశారా అంటూ రష్మికకు ప్రశ్న ఎదురయింది. ఆ సమయంలో రష్మిక స్పందించకపోవడంతో వీరి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయని తెలుస్తోంది.

Advertisement

ఈ వివాదం కారణంగానే రష్మిక తన పెళ్లికి ఆహ్వానం అందించని నేపథ్యంలోనే ఈ విషయం గురించి మాట్లాడటానికి కూడా రిషబ్ ఇష్టపడలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఇప్పటికే రష్మిక పెళ్లి వేడుకలలో భాగంగా పలువురు సినీ సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. తరుణ్ భాస్కర్ ఈషా రెబ్బ ఆశికా రంగనాథ్ సందీప్ రెడ్డి రాహుల్ రవీంద్రన్ వంటి తదితరులు ఉదయ్ పూర్ చేరుకున్న సంగతి తెలిసిందే.

Also Read: Virosh wedding: రష్మికకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన కాబోయే అత్తగారు.. ఏంటో తెలుసా?

Related News

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

‘స్పిరిట్’ వాయిదా.. ఫ్యాన్స్‌కు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

గరివిడి లక్ష్మి సినిమాపై రవితేజ రివ్యూ.. ఏమన్నారంటే?

Big Stories

Advertisement
×