E-Paper
Advertisement

Rashmika: మరోసారి అడ్డంగా దొరికిపోయిన రష్మిక..ఇదిగో సాక్ష్యం!

Rashmika: మరోసారి అడ్డంగా దొరికిపోయిన రష్మిక..ఇదిగో సాక్ష్యం!
Advertisement

Rashmika:ప్రముఖ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఈ ఏడాది ఏకంగా ఐదు చిత్రాలలో నటించడమే కాకుండా ఆ చిత్రాలతో భారీ బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ముఖ్యంగా తెలుగు, హిందీ, తమిళ్ అంటూ భాషతో సంబంధం లేకుండా వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిపోయింది రష్మిక మందన్న. ప్రస్తుతం మైసా అనే సినిమాలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఈమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా మేకర్స్ విడుదల చేశారు.

ఇన్నేళ్లయినా బయటపడని బంధం..

ఇదిలా ఉండగా రష్మిక కెరియర్ పరంగా దూసుకుపోతుండగా మరొకవైపు వ్యక్తిగతంగా ఎప్పటికప్పుడు రూమర్స్ ఎదుర్కొంటూనే ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) తో ఈమె ప్రేమలో ఉన్నట్లు రూమర్స్ బాగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. దీనికి తోడు రహస్యంగా వీరు నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అయితే ఈ విషయాన్ని బయట పెట్టలేదు. కానీ నిశ్చితార్థం తర్వాత తొలిసారి పుట్టపర్తి సాయిబాబాను ఫ్యామిలీతో కలిసి సందర్శించుకోవడానికి వెళ్లిన విజయ్ దేవరకొండను అక్కడి అధికారులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో విజయ్ దేవరకొండ చేతి వేలికి ఉన్న ఎంగేజ్మెంట్ రింగ్ వైరల్ అయింది. ఆ తర్వాత కొన్ని రోజులకు రష్మిక మందన్న షేర్ చేసిన ఫోటోలలో కూడా ఆమె చేతి వేలికి ఉన్న డైమండ్ రింగు హైలెట్గా నిలిచింది. అలా ఉంగరాలే వీరికి ఎంగేజ్మెంట్ అయింది అనే విషయాన్ని బయటపెట్టాయి.

మళ్లీ అడ్డంగా దొరికిపోయిందిగా..

Advertisement

ఇకపోతే వీరి రిలేషన్ గురించి ఎప్పటికప్పుడు వార్తలు వస్తున్నా.. సైలెంట్ గా ఉన్న ఈ జంట ఇప్పుడు మరొకసారి అడ్డంగా దొరికిపోయారు. ముఖ్యంగా రష్మిక మందన్న మళ్లీ దొరికిపోయి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అసలు విషయంలోకి వెళ్తే తాజాగా ఫ్రెండ్స్ తో కలిసి వెకేషన్ కోసం రోమ్ నగరానికి వెళ్లిన ఈమె అక్కడికి వీధుల్లో తిరుగుతూ అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. అంతేకాదు అక్కడి వంటకాలను రుచి చూస్తూ ఎంజాయ్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక అలా షేర్ చేసుకున్న ఈ ఫోటోలలో ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) కూడా ఉండడంతో అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇన్ని రోజులు విజయ్ దేవరకొండ తో రహస్యంగా వెకేషన్ కి వెళ్ళిన ఈమె.. ఈసారి ఏకంగా ఆయన ఫ్యామిలీతోనే వెకేషన్ కి వెళ్ళిందా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అయితే రష్మిక షేర్ చేసిన ఫోటోలలో విజయ్ దేవరకొండ తమ్ముడు హీరో ఆనంద్ దేవరకొండ కనిపించేసరికి అభిమానులు పలు రకాల కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

also read:Bandla Ganesh: రెండో బ్యానర్ స్టార్ట్ చేసిన బండ్లన్న.. ఇకపై ఫుల్ టైం ప్రొడ్యూసరా?

రష్మిక మందన్న కెరియర్..

Advertisement

రష్మిక మందన్న కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం మైసా సినిమాలు నటిస్తోంది. ఈ సినిమా తర్వాత రెయిన్బో అనే చిత్రంలో కూడా నటిస్తోంది రష్మిక మందన్న. అంతేకాదు ప్రముఖ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక సినిమా.. అలాగే అట్లీ , అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో కూడా ఈమె అవకాశం దక్కించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Related News

ఇరుముడి సినిమాకు భారీ షాక్…ప్రొజెక్టర్ ద్వారా వీధుల్లో ప్రదర్శనలు!

భార్యను కలవబోతున్న సీఎం విజయ్…త్రిష సైడ్ అవ్వాల్సిందేనా?

రజినీ జైలర్ 2 కథ ఇదేనా? ఈసారి టార్గెట్ ఎవరో తెలిస్తే షాక్!

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Big Stories

Advertisement
×