E-Paper
Advertisement

Petrol vs Hybrid Mileage: మారుతి సుజుకి విక్టోరిస్- హోండా సిటీ e:HEV.. పెట్రోల్, హైబ్రిడ్ లో ఏది బెస్ట్?

Petrol vs Hybrid Mileage: మారుతి సుజుకి విక్టోరిస్-  హోండా సిటీ e:HEV.. పెట్రోల్, హైబ్రిడ్ లో ఏది బెస్ట్?
Advertisement

Petrol vs Hybrid Comparison: 2025లో లాంచ్ అయిన కొత్త కాంపాక్ట్ SUV మారుతి సుజుకి విక్టోరిస్.  గ్రాండ్ విటారాకు సమానమైన ప్లాట్‌ఫారమ్,  పవర్‌ ట్రెయిన్‌లతో విడుదలైది. మారుతి సుజుకి విక్టోరిస్, హోండా సిటీ e:HEV స్ట్రాంగ్ హైబ్రిడ్ సెడాన్  మధ్య ఎలాంటి పోలికలు ఉన్నాయి? పెట్రోల్,  హైబ్రిడ్ వెర్షన్లలో దేని మైలేజ్ ఎక్కువగా ఉంటుందనేది అధికారిక ARAI సర్టిఫైడ్ మైలేజ్, రియల్ వరల్డ్ యూజర్ టెస్ట్ రిపోర్ట్స్ ఆధారంగా కంప్లీట్ వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

అధికారిక ARAI మైలేజ్ ఎంత?  

⦿ మారుతి విక్టోరిస్ పెట్రోల్ (1.5L మైల్డ్ హైబ్రిడ్): ARAI మైలేజ్ (kmpl) 20.45 – 21.11 ఉంటుంది.  మాన్యువల్, ఆటోమేటిక్ వేరియంట్స్ ను కలిగి ఉంటుంది.

Advertisement

⦿ మారుతి విక్టోరిస్ పెట్రోల్  స్ట్రాంగ్ హైబ్రిడ్ (e-CVT): ARAI మైలేజ్ (kmpl) 27.97 – 28.65 ఉంటుంది. ఈ సెగ్మెంట్‌ లో టాప్ మైలేజ్ ఇస్తుంది.

⦿ హోండా సిటీ e:HEVస్ట్రాంగ్ హైబ్రిడ్ (e-CVT): ARAI మైలేజ్ (kmpl)  27.1 – 27.13 ఉంటుంది. సెడాన్ కావడంతో మైలేజ్ స్వల్పంగా తక్కువగా ఉంటుంది.

Advertisement

⦿ పెట్రోల్ vs హైబ్రిడ్ (విక్టోరిస్‌లో): హైబ్రిడ్ వేరియంట్ పెట్రోల్ కంటే 7-8 kmpl ఎక్కువ మైలేజ్ ఇస్తుంది. ఇది సిటీ డ్రైవింగ్‌లో EV మోడ్‌ లో ఎక్కువగా రన్ అవడం వల్ల ఎక్కువ మైలేజ్ కలిగి ఉంటుంది..

⦿ విక్టోరిస్ హైబ్రిడ్ vs సిటీ e:HEV: విక్టోరిస్ స్వల్పంగా (0.8-1.5 kmpl) ఎక్కువ మైలేజ్ ఇస్తుంది. SUV బాడీ ఉన్నప్పటికీ, మారుతి హైబ్రిడ్ టెక్ మరింత ఎఫిషియెంట్ గా ఉంటుంది.

రియల్ వరల్డ్ మైలేజ్

⦿ విక్టోరిస్ పెట్రోల్: సిటీలో 13-16 కి.మీ, హైవేలో 17-19 కి.మీ, సరాసరి 15-18 మైలేజ్ ఇస్తుంది.

⦿ విక్టోరిస్ హైబ్రిడ్: సిటీలో 20-24 కి.మీ, హైవేలో 23-27 కి.మీ, సరాసరి 22-25 కి.మీ మైలేజ్ ఇస్తుంది.

⦿ హోండా సిటీ e:HEV: సిటీలో 18-22 కి.మీ మైలేజ్ ఇస్తుంది. హైవే డ్రైవింగ్ లో 22-25 కి.మీ ఇస్తుంది. సరాసరి 20-23 కి.మీ ఇస్తుంది. స్మూత్, రిఫైన్డ్, కానీ, SUV కంటే కాస్త తక్కువ మైలేజ్ ఇస్తుంది.

⦿ హైబ్రిడ్ వేరియంట్స్ రియల్ వరల్డ్‌ లో ARAI కంటే 4-6 kmpl తక్కువ మైలేజ్ ఇస్తాయి.  కానీ, పెట్రోల్ కంటే ఎక్కువ (8-10 kmpl డిఫరెన్స్) మైలేజ్ ఇస్తుంది.

⦿ ప్యూయెల్ ఆదా: రోజుకు 50-60 km డ్రైవ్ చేస్తే, హైబ్రిడ్ వేరియంట్ నెలకు రూ.2,000- రూ.4,000 ప్యూయెల్ ఖర్చు ఆదా చేయవచ్చు.

Read Also: ఎలక్ట్రిక్ బైక్ vs పెట్రోల్ బైక్.. ఏది బెస్ట్? ఎందుకంటే?

కీ పాయింట్స్

⦿విక్టోరిస్ అడ్వాంటేజ్: SUV బాడీ, ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్, బూట్ స్పేస్, AWD ఆప్షన్, CNG వేరియంట్ కూడా ఉంది.

⦿ సిటీ e:HEV అడ్వాంటేజ్: సెడాన్ కావడంతో మంచి హ్యాండ్లింగ్, రిఫైన్‌మెంట్, Honda Sensing ADAS.

రెండూ స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీని కలిగి ఉంటాయి. పెట్రోల్ ఇంజన్, ఎలెక్ట్రిక్ మోటార్, సెల్ఫ్ చార్జింగ్ అవకాశం ఉంటుంది.  హైబ్రిడ్ ఎంచుకుంటే లాంగ్ టర్మ్‌ లో ఇంధన ఖర్చు బాగా తగ్గుతుంది!

Read Also: మహీంద్రా XUV 7XO లాంచ్ డేట్ ఫిక్స్, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×