E-Paper
Advertisement

BMW: భర్త మహాశయులకు విజ్ఞప్తి బిజినెస్.. వర్కౌట్ అవ్వక ఆ పని చేస్తున్న రవితేజ

BMW: భర్త మహాశయులకు విజ్ఞప్తి బిజినెస్.. వర్కౌట్ అవ్వక ఆ పని చేస్తున్న రవితేజ
Advertisement

BMW:2026 సంక్రాంతికి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి టాలీవుడ్లో బడా హీరోలు తమ చిత్రాలతో సిద్ధమవుతున్నారు. అలాంటి హీరోలలో రవితేజ (Raviteja) కూడా ఒకరు. తాజాగా ఆయన నటిస్తున్న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతోంది. ఇందులో రవితేజకు జోడిగా ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్ లకు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.

కొత్త సినిమాపై భారీ ఎఫెక్ట్..

అయితే రవితేజ నటించిన గత చిత్రాలు పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేకపోవడంతో ఆ ఎఫెక్ట్ ఇప్పుడు ఈ సినిమా మీద పడినట్లు కనిపిస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. భర్త మహాశయులకు విజ్ఞప్తి బిజినెస్ డీటెయిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. ఇది నెటిజన్స్.. వర్కౌట్ కాక రవితేజ అలాంటి పని చేస్తున్నారా? అనే కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి.

భర్త మహాశయులకు విజ్ఞప్తి బిజినెస్ డీటెయిల్స్..

Advertisement

మరి భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా బిజినెస్ డీటెయిల్స్ విషయానికి వస్తే.. ఆంధ్రాలో ఈ సినిమా థియేట్రికల్ హక్కులు 8 కోట్ల రూపాయలకు అమ్మగా.. రాయలసీమలో ఒక్కటే రూ. 2.5 కోట్ల రూపాయల వరకు బిజినెస్ జరిగిందట. అలాగే నైజాంలో డైరెక్ట్ గా రవితేజనే ఓన్ గా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే రవితేజ సినిమాల వల్ల బిజినెస్ వర్కౌట్ కాలేదని డిస్ట్రిబ్యూటర్ లు సైతం భావించడంతోనే ఎవరు కూడా ఈ సినిమాను కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదని ఈ క్రమంలోనే రవితేజ ఈ ఈ పని చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమాతోనైనా రవితేజ సక్సెస్ కొట్టాలని అభిమానులు భావిస్తున్నారు.

ALSO READ:Nayanthara Toxic Look: టాక్సిక్ నుండి నయనతార ఫస్ట్ లుక్.. అటు గ్లామర్ ఇటు యాక్షన్

ఫ్లాప్ ల నుండి ఈసారైనా గట్టెక్కుతారా?

Advertisement

మాస్ మహారాజా రవితేజ సాధారణంగా వినూత్నమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. అలాంటి ఈయన గత కొంతకాలంగా కథల ఎంపిక విషయంలో కాస్త తడబడుతున్నట్టు ఆయన గత చిత్రాలను పరిశీలిస్తే అర్థమవుతుంది ఈ క్రమంలోనే ఈగల్, మిస్టర్ బచ్చన్, మాస్ మహారాజా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన ఈ సినిమాలతో కచ్చితంగా సక్సెస్ అందుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ ఈ సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి..

అలా ఎన్నో ఆశలతో వచ్చిన మాస్ జాతర సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఇప్పుడు భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయితే ఈ చిత్రానికి పోటీగా ప్రభాస్ ది రాజా సాబ్, మెగాస్టార్ చిరంజీవి మన శంకర్ వరప్రసాద్ గారు, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు, విజయ్ దళపతి డబ్బింగ్ మూవీ జననాయకుడు ఇలా చాలా చిత్రాలు సంక్రాంతి బరిలో పోటీకి దిగుతున్నాయి మరి ఇన్ని చిత్రాల మధ్య తన సినిమాతో సక్సెస్ సాధించి ఈసారైనా గట్టెక్కుతారేమో చూడాలి.

ALSO READ:Naa Anveshana: 2025లో అన్వేష్ అంత సంపాదించాడా? ఆ లెక్కలు బయట పెట్టేశాడు!

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×