E-Paper
Advertisement

Naa Anveshana: 2025లో అన్వేష్ అంత సంపాదించాడా? ఆ లెక్కలు బయట పెట్టేశాడు!

Naa Anveshana: 2025లో అన్వేష్ అంత సంపాదించాడా? ఆ లెక్కలు బయట పెట్టేశాడు!
Advertisement

Naa Anveshana:ప్రముఖ యూట్యూబర్ గా , సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా భారీ పాపులారిటీ సంపాదించిన నా అన్వేషణ అన్వేష్ పేరు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తోంది. నా అన్వేషణ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా భారీగానే సంపాదిస్తున్నట్లు ఎన్నో సందర్భాలలో తెలియజేశారు. కానీ 2025లో ఎంత ఆదాయం వచ్చిందనే విషయం పైన తాజాగా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక వీడియో షేర్ చేస్తూ తన సంపాదన గురించి తెలియజేశారు.

అన్వేష్ ఏడాది సంపాదన అన్ని కోట్లా!

అన్వేష్ మాట్లాడుతూ.. “ఈ 2025లో సుఖాల కంటే కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. అది కూడా నా నోటి దూల వల్లే.. ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు నా జీవితంలో ట్విస్టుల మీద ట్విస్టులు జరిగాయి. అరెస్ట్ వారెంట్లు , రాజకీయాలు ఇలా ఎన్నో జరిగాయి. కష్టాలు ఏ రేంజ్ లో అయితే ఉన్నాయో నా ఆదాయం కూడా అదే రేంజిలో ఉంది. మొదట నా అన్వేషణ ఛానల్ ద్వారా.. 365 రోజులకు గాను 85 వేల డాలర్లు, (ఇండియన్ కరెన్సీ ప్రకారం 80 లక్షలు), ప్రపంచ యాత్రికుడు ఛానల్ విషయానికి వెళ్తే.. 67 వేల డాలర్లు (మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 60 లక్షలు).. ఇలా మొత్తం మీద ఈ రెండు చానల్స్ ద్వారా కోటి 40 లక్షల రూపాయల వరకు నేను ఈ ఏడాది సంపాదించాను” అంటూ తెలియజేశారు అన్వేష్. మొత్తానికైతే రెండు చానల్స్ తో ఏడాదికి కోటిన్నర సంపాదించారని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

సంపాదనే కాదు దానధర్మాలు కూడా..

Advertisement

అయితే ఈ కోటి 40 లక్షల రూపాయలలో తాను దానధర్మాలు కూడా చేశానని తెలిపారు. ఈ రెండు యూట్యూబ్ ఛానల్స్ ద్వారా వచ్చిన డబ్బులో సుమారుగా 40 లక్షల రూపాయల వరకు దానధర్మాల కోసం ఖర్చు చేశానని తెలిపారు. మొత్తానికైతే 2025 సంవత్సరానికి గాను తన సంపాదనతో పాటు ఖర్చుల గురించి చెప్పారు అన్వేష్.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ALSO READ:Nayanthara Toxic Look: టాక్సిక్ నుండి నయనతార ఫస్ట్ లుక్.. అటు గ్లామర్ ఇటు యాక్షన్ 

అన్వేష్ నోటి దూల.. ఇకపై సంపాదన కష్టమేనా?

Advertisement

ఇకపోతే అన్వేష్ నోటి దూల కారణంగా ఇకపై కష్టాలు పడక తప్పదు అని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.. విషయంలోకి వెళ్తే.. శివాజీ ఘటనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఈ విషయంపై స్పందించిన అన్వేష్ అక్కడితో ఆగకుండా ప్రవచనకర్త గరికపాటి పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అక్కడితో ఆగకుండా హిందూ దేవతలైన సీతా, ద్రౌపదీ లపై ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేసిన అన్వేష్.. అటు ఇండియా పై కూడా అసభ్యకర కామెంట్లు చేసి వార్తల్లో నిలిచారు. ముఖ్యంగా ఇండియాను కించపరుస్తూ కామెంట్లు చేయడం సంచలనంగా మారింది. ఇక అలా హిందూ సంఘాలు కూడా మండిపడ్డాయి. ముఖ్యంగా 20 లక్షల మంది ఫాలోవర్స్ అన్ ఫాలో చేయడంతో అన్వేష్ కి గట్టి దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. ఇక దీన్ని బట్టి చూస్తే ఈయన నోటి దూల కారణంగానే ఇకపై ఈ రేంజ్ లో సంపాదన కష్టమే అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×