E-Paper
Advertisement

మెగా ఫ్యామిలీ ఫంక్షన్లకు వెళ్లేముందు పిల్లలకి రేణు దేశాయ్ ఏం చెబుతుందో తెలుసా ?

మెగా ఫ్యామిలీ ఫంక్షన్లకు వెళ్లేముందు పిల్లలకి రేణు దేశాయ్ ఏం చెబుతుందో తెలుసా ?
Advertisement

Renu Parenting : రేణు దేశాయ్ ..సినిమాలు చేయడం తగ్గించినా సోషల్ మీడియాలో మాత్రం పెట్టే పోస్టులు, విసిరే కామెంట్స్‌తో రోజూ వైరల్ అవుతూనే ఉంది. 2000లో పూరి దర్శకత్వంలో వచ్చిన బద్రి సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రేణు, 2003లో వచ్చిన ‘జానీ’తో మంచి మార్కులే కొట్టేసింది. ఇక ఆ తర్వాత పవన్‌ని పెళ్లి చేసుకొని విడిపోయాక అకీరా, ఆద్యల బాధ్యతని రేణు తీసుకున్న సంగతి తెలిసిందే.

ఎవరితో ఎలా ప్రవర్తించాలి

Advertisement

అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె వారిని ఎలా పెంచుతున్న తీరును చెప్పుకొచ్చింది. అందులో మెగా ఫ్యామిలీ ఫంక్షన్‌లకి అకీరా, ఆద్యలు అటెండ్ అయినప్పుడు ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి అన్న విషయాలను వారికి అర్థమయ్యేలా వివరిస్తానని తెలిపింది.

రేణు మాట్లాడుతూ “మీరు మెగా ఫ్యామిలీ ఇంటికి వెళ్లినప్పుడు అక్కడ ఎలా మాట్లాడుతున్నారు? ఎలా ప్రవర్తిస్తున్నారు? అన్నదే ముఖ్యం. అక్కడ మీరు గనుక ఏ చిన్న పొరపాటు చేసినా సరే.. అది నా పెంపకాన్నే వేలెత్తి చూపిస్తుంది. ఒక తల్లిగా నేను మిమ్మల్ని సరిగ్గా పెంచానా లేదా అనేది మీ ప్రవర్తనే డిసైడ్ చేస్తుంది” అని కరాఖండిగా చెబుతానని తేల్చి చెప్పేసింది.

Advertisement

పిల్లలు ఎక్కడైనా తప్పు చేస్తే

సింగిల్ మదర్‌గా ఈ సొసైటీలో పిల్లలను పెంచడం ఎంత కష్టమో తనకి బాగా తెలుసని, అందుకే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటానని తెలిపింది. ఇక ఎదుటివారికి గౌరవం ఇవ్వడం తన పిల్లలకు వెన్నతో పెట్టిన విద్య అని, అది ఒక తల్లిగా తన బాధ్యత అని ఆమె గర్వంగా చెప్పుకొచ్చింది. పిల్లలు ఎక్కడైనా తప్పు చేస్తే వెంటనే “తల్లి సరిగ్గా పెంచలేదు” అనే మాట వస్తుందని, అలాంటి మాట రాకుండా ఉండటమే తన లక్ష్యమని క్లారిటీ ఇచ్చింది.

ఎప్పుడూ విలువలతో కూడిన పాఠాలు

ఇక స్టార్ కిడ్స్ అనే గర్వం అకీరా, ఆద్యల దగ్గరకు రాకుండా ఉండటానికి రేణు ఎప్పుడూ విలువలతో కూడిన పాఠాలు చెబుతానని అసలు విషయం పంచుకుంది. ఇలా రేణు చాలా రోజులకి మెగా ఫ్యామిలీ అనే టాపిక్ తెవడంతో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయాయి.

అకీరా ఎప్పుడు గుడ్ న్యూస్ చెబుతాడో

ఇక రేణు దేశాయ్ అక్టోబర్ 2023లో రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలో హేమలత లవణం అనే పవర్‌ఫుల్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆధ్యాత్మికత, మూగజీవాల సేవ అంటూ బిజీగా గడిపేస్తున్న రేణును పిల్లలకు ఇంత మంచి సంస్కారం నేర్పిస్తున్నందుకు మెచ్చుకోవాల్సిందే అంటూ నెటిజన్లు ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

చూడాలి మరి పవర్ స్టార్ వారసుడు ఎప్పుడెప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడా అని కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న అభిమానులకు అకీరా ఎప్పుడు గుడ్ న్యూస్ చెబుతాడో!

also read :బాస్ ఈజ్ బ్యాక్.. ‘మెగా 158’ నుంచి ఊరమాస్ అప్‌డేట్!

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×