E-Paper
Advertisement

Renu Desai : పవన్ కళ్యాణ్ పై రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్.. అకీరా చెయ్యి విరిగింది..

Renu Desai : పవన్ కళ్యాణ్ పై రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్.. అకీరా చెయ్యి విరిగింది..
Advertisement

Renu Desai : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య, రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఈమధ్య సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతుంది. అంతేకాదు తనపై తన కుటుంబం పై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాళ్ళకి సోషల్ మీడియా వేదికగా దిమ్మతిరిగి పోయేలా సమాధానం చెబుతుంది.. అంతేకాదు పలు సామాజిక కార్యక్రమాలను కూడా చేపడుతూ అందరి దృష్టిని ఆకర్షస్తుంది.. ఈ క్రమంలో రెగ్యులర్ గా మీడియా ముందుకు రావడం, ఇంటర్వ్యూలు ఇవ్వడం చేస్తుంది.. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించింది. ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

రోడ్ల సమస్యల పై రేణు కామెంట్స్..

రేణు దేశాయ్ ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో గవర్నమెంట్ తీరు పై తీవ్ర అసహనం వ్యక్తం చెయ్యడంతో పాటుగా మండిపడ్డారు. ఆమె మాట్లాడుతూ.. గవర్నమెంట్స్ సరిగ్గా వర్క్ చేయకపోవడం వల్ల, రోడ్లు బాగోకపోవడం వల్ల అకీరాకు దెబ్బలు తగిలి గాయాలు అయ్యాయి అంటూ గతంలో జరిగిన ఇన్సిడెంట్ ను గుర్తు చేసుకున్నారు. అకీరా ఆదివారం కావడంతో తన ఫ్రెండ్స్ తో బయటికి వెళ్లాలని సైకిల్ వేసుకొని వెళ్ళాడు. అక్కడ రోడ్లన్నీ సరిగా లేకపోవడంతో ఒక గుంతలో సైకిల్ పడిపోవడంతో కిందపడి చెయ్యి విరగగొట్టుకున్నాడు అని రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది. అక్కడ రోడ్లు తవ్వేసి ఉన్నాయి. మన గవర్నెన్స్ బాగోదు రోడ్ల విషయంలో. ఎప్పుడూ ఇష్టమొచ్చినట్టు తవ్వుతూ ఏదోకటి చేస్తూనే ఉంటారు. ఎంతోమంది రోడ్ల కారణంగా ప్రమాదాల బారిన పడుతూ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు అంటూ రేణు దేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Also Read :Gundeninda GudiGantalu Today episode: బాలు దెబ్బకు ప్రభావతి అవుట్.. రోహిణికి మైండ్ బ్లాక్.. ప్రభావతికి మీనా వార్నింగ్..

పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు.. 

రోడ్ల సమస్య వల్ల చాలామంది జనాలు ఇబ్బందులు పడుతున్నారని అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఏ ఒక్కరు కూడా రోడ్ల గురించి పెద్దగా పోరాడినట్లు ఎక్కడా కనిపించలేదు అని ఆమె అన్నారు. అంతే కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రోడ్ల సమస్యల గురించి పోరాడుతూనే ఉన్నారు.. ఏపీ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ సమస్యను పరిష్కరించేందుకు ముందున్నారు. చాలా వరకు రోడ్లు వేయిస్తున్న సంఘటనలు, అసలు రోడ్లే లేని మారుమూల గ్రామాలకు కూడా ఆయన రోడ్లు వేసే పనులను వేగవంతం చేసేలా దగ్గరుండి చూసుకుంటున్నారు అంటూ రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించింది. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో రేణు దేశాయ్ మాటలకు పవన్ కళ్యాణ్ అభిమానులు ఫీదా అవుతున్నారు.. ఇక రేణు దేశాయ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. తన వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ బిజీ అవ్వాలని అనుకుంటుంది.. అంతే కాదు అకీరా కూడా త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.. పవన్ వారసుడు రాక కోసం అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు..

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×