E-Paper
Advertisement

చెన్నై కేంద్రంగా ఏపీ రాజకీయాలు.. నిన్న జగన్-నేడు సీఎం విజయ్‌తో టీడీపీ ఎంపీ సమావేశం

చెన్నై కేంద్రంగా ఏపీ రాజకీయాలు.. నిన్న జగన్-నేడు సీఎం విజయ్‌తో టీడీపీ ఎంపీ సమావేశం
Advertisement

Chennai: దక్షిణాది రాజకీయాలు వెరైటీగా ఉంటాయి. తెలుగు రాష్ట్రాల వ్యాపారం కమ్ రాజకీయ నేతలకు అందరితో పరిచయాలు ఉంటాయి. ఫంక్షలు, ఎవరైనా రాజకీయ నాయకుడు ఉన్నత పదవిలో ఉన్నట్లు వారితో సమావేశమవుతుంటారు. తాజాగా సీఎం విజయ్‌తో టీడీపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సమావేశంపై ఏపీలో ఆసక్తికర చర్చ నడుస్తోంది.

చెన్నై కేంద్రంగా ఏపీ రాజకీయాలు

Advertisement

ఏపీలో రాజకీయాలు రోజుకో నేత చుట్టూ తిరుగుతున్నాయి. ఈసారి ఒంగోలు టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల‌రెడ్డి వంతైంది. తాజాగా తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా విజయ్‌తో సినీ, రాజకీయ, వ్యాపారవేత్తలు సమావేశమవుతున్నారు. అలాంటి వారిలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒకరు.

సోమవారం ఆయన తన మేనల్లుడు, పారిశ్రామికవేత్త రామి‌రెడ్డితో కలిసి సీఎం విజయ్‌తో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రిని శాలువాతో వారిద్దరు సత్కరించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎంవిజయ్‌ను టీడీపీ ఎంపీ కలవడం ఆసక్తికరంగా మారింది.

Advertisement

నిన్న జగన్-నేడు సీఎం విజయ్‌తో టీడీపీ ఎంపీ సమావేశం

మర్యాద పూర్వకంగా కలిశారని, ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవన్నది సదరు ఎంపీ వెర్షన్. ఎందుకంటే తమిళనాడు కేంద్రంగా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి వ్యాపారాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త సీఎంతో సమావేశమైనట్టు చెబుతున్నారు. అన్నట్లు.. జోసఫ్ విజయ్‌ని మాగుంట భేటీ కావడం ఇది రెండోసారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

రెండు నెలల కిందట జగన్ పెదనాన్న బంధువుల పెళ్లి చెన్నైలో జరిగింది. ఆ కార్యక్రమానికి ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి హాజరయ్యారు. అప్పుడు మాజీ సీఎం జగన్, అదే సందర్భంలో విజయ్‌ని సదరు టీడీపీ ఎంపీ సమావేశయ్యారు. అప్పుడు నేతలు ఒకరినొకరు పలకరించుకున్నారు. అప్పుడు కూడా మాగుంటపై లేనిపోని గాసిప్స్ వచ్చాయి. ఆ తర్వాత ఢిల్లీలో మంత్రి నారా లోకేష్‌తో సమావేశమై అన్ని విషయాలు షేర్ చేసుకున్నారు.

ALSO READ: శెట్టిపల్లి ప్రజలకు గుడ్ న్యూస్.. జగన్ అరాచకాలపై మంత్రి అనగాని సంచలన వ్యాఖ్యలు!

ఈ విషయాన్ని తనకు అనుకూలంగా మలచుకునే పనిలో వైసీపీ పడింది. కూటమి నుంచి నేతలు ఒకొక్కరుగా తప్పుకుంటున్నారంటూ ప్రచారం చేయడం మొదలుపెట్టింది. దాన్ని పలువురు టీడీపీ నేతలు ఖండించిన సందర్భాలు లేకపోలేదు.  మొత్తానికి ఏదోవిధంగా ఈసారి మాగుంట లైమ్ లైట్‌లోకి వచ్చేశారు.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×