RGV Fight: వర్మకి జాకీచాన్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎంటర్ ది డ్రాగన్, బ్రూస్ లీ వంటి సినిమాలతోనే శివ సినిమా తీశానని చాలా సార్లు చెప్పాడు కూడా. అయితే తాజాగా వర్మనే ఏకంగా జాకీచాన్ లా మారి ప్రొడ్యూసర్ తుమ్మలపల్లి రామ సత్యనారాయణని కొడుతున్న వీడియో ఒకటి తెగ వైరల్ అవుతుంది.
RGV జాకీచాన్ లా రెచ్చిపోయి..
ఇందులో వర్మకి దీటుగా తుమ్మలపల్లి రామ సత్యనారాయణ కూడా ఫైట్ చేయడం విశేషం.అయితే చూడ్డానికి ఆసక్తిగా ఉన్న ఈ వీడియో AI లో క్రియేట్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితేనేం చాలా రియలిస్టిక్ గా ఉందని కొందరంటుంటే,RGV పుట్టినరోజు సందర్భంగా సినిమా తీయమని డేట్స్ అడిగినందుకు ఇలా రామ సత్యనారాయణ పై RGV జాకీచాన్ లా రెచ్చిపోయి ఫైట్ చేశాడంటూ సరదాగా ఫన్నీ కామెంట్స్ తో ఆటపట్టిస్తున్నారు మూవీ లవర్స్.ఇక ఇదే RGV గతంలో జక్కన్న, మహేష్ ల ఫైటింగ్ వీడియో ఒకటి పోస్ట్ చేస్తూ సినిమా ఇలా అయితే చచ్చిపోతుంది అంటూ కామెంట్ చేసిన సంగతి తెల్సిందే. ఏది ఏమైనా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అంటూ దూసుకొస్తున్న ఈ సరికొత్త టెక్నాలజీ కారణంగా ఏది నిజమో, ఏది అబద్దమో తెలీని పరిస్థితి.
ఒకే రోజు 15 సినిమాలను ప్రారంభించి ప్రపంచ రికార్డు
ఇక తుమ్మల పల్లి విషయానికే వస్తే భీమ వరం టాకీస్ బ్యానర్ పై ఈయన దాదాపు వందకు పైగా సినిమాలు నిర్మించడం విశేషం. ఇక ఈ మధ్య ఒకే రోజు 15 సినిమాలను ప్రారంభించి ప్రపంచ రికార్డు సృష్టించడానికి సిద్ధమయ్యారు. అయితే చాలా మంది ఇది పబ్లిసిటీ స్టంట్ అని కొట్టేసినా, కొత్త వాళ్లకి అవకాశాలు ఇవ్వడమే నా టార్గెట్ అంటూ క్లారిటీ ఇచ్చాడు తుమ్మల పల్లి.
ఐస్ క్రీమ్,ఐస్ క్రీమ్2 సినిమాలతోనే గుర్తింపు
అయితే ఎన్ని సినిమాలు తీసినా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఐస్ క్రీమ్,ఐస్ క్రీమ్2 సినిమాలతోనే ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యాడని చెప్పాలి. ముఖ్యంగా వీరి కాంబోలో వచ్చిన ఆర్జీవీ ‘ఫ్లో’ మోడల్ టెక్నాలజీ అప్పట్లో బాగా పాపులర్ అయింది కూడా.అయితే అదే ఐస్ క్రీమ్ సమయంలో పెట్టుబడి పెట్టించి వచ్చిన లాభాలని మాత్రం ఇవ్వకుండా ఎగ్గొట్టాడు ఓపెన్ గానే మీడియా ముందు వాపోయాడు ఈ క్రేజీ ప్రొడ్యూసర్.
also read:హీరో లేడు.. ఐటెం సాంగ్స్ లేవు.. కేవలం ఆమె నటనతోనే 200 కోట్లు! ఆ ‘వేశ్య’ కథకు ఏకంగా 49 అవార్డులు..
వర్మను హీరోగా పెట్టి Showman
ఇక ఒకానొక సమయంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మను హీరోగా పెట్టి Showman అనే సినిమా చేయాలని ప్లాన్ చేశాడు కూడా. అయితే అనుకోని కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేకపోయింది.ఏది ఏమైనా ఇద్దరి మధ్య ఎన్ని గొడవలు వచ్చినా అవి టీ కప్పులో తుఫాన్ లా మారిపోయి మళ్ళీ RGV కి తాను ఏకలవ్య శిష్యుడిని అంటూ తుమ్మల పల్లి సగర్వంగా ప్రకటించుకోవడం విశేషం. మరి RGV తోనే మరిన్ని సినిమాలు తీయాలని ఆశ పడుతున్న ఈ క్రేజీ ఫిలిం మేకర్ ఆశలు నెరవేరుతాయో లేదో చూడాలి.
?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==