E-Paper
Advertisement

హీరో లేడు.. ఐటెం సాంగ్స్ లేవు.. కేవలం ఆమె నటనతోనే 200 కోట్లు! ఆ ‘వేశ్య’ కథకు ఏకంగా 49 అవార్డులు..

హీరో లేడు.. ఐటెం సాంగ్స్ లేవు.. కేవలం ఆమె నటనతోనే 200 కోట్లు! ఆ ‘వేశ్య’ కథకు ఏకంగా 49 అవార్డులు..

Gangubai Kathiawadi OTT: కొన్ని సినిమాలు క్షణ కాలం గుర్తుంటాయ్,మరి కొన్ని కలకాలం గుర్తుంటాయ్.అలాంటి సినిమాల్లో ఒకటి ‘గంగూబాయ్ కతియావాడి’.సంజయ్ లీలా బన్సాలి డైరెక్షన్ లో 2022, ఫిబ్రవరి 25న వచ్చిన ఈ సినిమాలో కమర్షియల్ సినిమాలకు ఉండాల్సిన భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు లేవు, గ్లామరస్ ఐటెం సాంగ్స్ లేవు, అసలు రొటీన్ ఫార్మాట్‌లో ఉండే హీరోనే లేడు.కేవలం ఒక అభాగ్యురాలి ఆవేదన, ఆమె ఎదిగిన తీరు, ఆత్మగౌరవం కోసం ఆమె చేసిన పోరాటం మాత్రమే ఉంది.ఒక రకంగా వెన్ను చూపని ఆ ధీరత్వమే ఈ సినిమాని గ్లోబల్ రేంజ్ లో నిలబెట్టింది.

సంజయ్ లీలా భన్సాలీ అంటేనే ఒక బ్రాండ్

ఇక ఈ సినిమా రిలీజ్ అయి దాదాపు నాలుగేళ్లయినా ఇంకా  సోషల్ మీడియాలో, ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే ఉందంటే సినిమా ఆడియన్స్ హార్ట్స్ కి ఎంతలా కనెక్ట్ అయ్యిందో అర్థమవుతుంది. డైరెక్షన్ చేసిన సంజయ్ లీలా భన్సాలీ అంటేనే ఒక బ్రాండ్. గతంలో ‘దేవదాస్’, ‘బాజీరావు మస్తానీ’, ‘పద్మావత్’ వంటి విజువల్ వండర్స్‌ ఈయన దర్శకత్వంలో తెరకెక్కినవే.

ఒక్కో  మెట్టు ఎక్కుతూ తిరుగులేని మహా శక్తిగా

ఆలియా భట్ టైటిల్ రోల్ పోషించిన ఈ సినిమా ముంబైలోని రెడ్ లైట్ ఏరియా అయిన కామాటిపుర బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది. సిల్వర్ స్క్రీన్ పై మెరిసిపోవాలని ఆశ పడి, తన ప్రియుడిని నమ్మి ఇంటి నుంచి పారిపోయి వస్తుంది  గంగూబాయ్. అలా ఒంటరిగా వచ్చిన అమ్మాయిని  కేవలం 500 రూపాయలకు ఒక వ్యభిచార గృహానికి అమ్మేస్తాడు ప్రియుడు. ఇక్కడ ప్రియుడు అనేదాని కన్నా మోసగాడు అనడం కరెక్ట్. అలా వ్యభిచార గృహానికి చేరిన ఆ అమ్మాయి లైఫ్ అక్కడితో క్లోజ్ అయిందని అనుకుంటారంతా. కానీ అందరి అంచనాలని తలకిందులు చేస్తూ ఆ నరకం నుంచే ఒక్కో  మెట్టు ఎక్కుతూ తిరుగులేని మహా శక్తిగా ఎదుగుతుంది.

ఏకంగా జాతీయ ఉత్తమ నటి అవార్డు 

బిక్కు బిక్కు మంటూ కామాటిపురలో అడుగు పెట్టిన ఓ నిస్సహాయురాలు అదే కామాటిపురను ఏలే ‘మాఫియా రాణి’గా ఆమె చేసిన ప్రయాణం ప్రతి ఒక్కరినీ మెస్మరైజ్ చేస్తుంది.  భన్సాలీ గతంలో ‘బ్లాక్’ వంటి చిత్రాల్లో చూపించిన ఎమోషనల్ డెప్త్‌ను, ఈ సినిమాలో గంగూబాయ్ పాత్రలో అంతకంటే బలంగా ఆవిష్కరించడం ఇక్కడ విశేషం. ముఖ్యంగా గంగూబాయ్ పాత్రలో అలియా  నటించింది అనడం కంటే జీవించేసింది అని చెప్పడం కరెక్ట్ గా ఉంటుంది.’స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’తో గ్లామరస్ బ్యూటీగా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ‘హైవే’, ‘రాజీ’ వంటి సినిమాలతో ప్రూవ్ చేసుకున్నప్పటికీ ఈ సినిమాతో తన కెరీర్ లోనే పీక్స్ చూసిందని చెప్పాలి. ముఖ్యంగా ఆమె బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, ఆ ఇంటెన్స్ లుక్ థియేటర్లలో ఆడియన్స్ కి పూనకాలు తెప్పించాయి. అందుకే  ఏకంగా జాతీయ ఉత్తమ నటి అవార్డు  వచ్చి ఆమె ఒళ్లో వాలింది. ఇదే కాకుండా మరో 49 అవార్డులను కొల్లగొట్టి ఇండియన్ సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి చూపింది ఈ సినిమా.ఇక  అలియాతో పాటు అజయ్ దేవగన్ తన పవర్‌ఫుల్ నటనతో సినిమాని మరో మెట్టు ఎక్కించాడనే చెప్పాలి.దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 209 కోట్ల వసూళ్లను రాబట్టడం విశేషం.

తెలుగు వెర్షన్ యూట్యూబ్‌లో ఫ్రీగా

ఇక స్ట్రీమింగ్  విషయానికి వస్తే imdb లో 7.8 రేటింగ్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా తెలుగు వెర్షన్ యూట్యూబ్‌లో ఫ్రీగా ఉండటం విశేషం. మరి ఒక మహిళ తలచుకుంటే సొసైటీ  తన స్థానాన్ని ఎలా మార్చుకోగలదో, తనలాంటి వందలాది మంది మహిళల కోసం ఎలా అండగా నిలబడగలదో తెలుసుకోవాలంటే ఈ సినిమాను కచ్చితంగా చూడాల్సిందే. ఇప్పటి దాకా ఎవరైతే ఈ సినిమాని చూడకుండా ఉన్నారో  వెంటనే చూసేయండి.ఎందుకంటే ఇలాంటి క్లాసిక్స్ మళ్లీ మళ్లీ రావు కదా!

Related News

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

Big Stories

×