E-Paper
Advertisement

‘రాజా శివాజీ’ సక్సెస్ పార్టీలో రచ్చ.. నెటిజన్ల ఫైర్.. చేతులు జోడించి క్షమాపణలు కోరిన స్టార్ హీరో!

‘రాజా శివాజీ’ సక్సెస్ పార్టీలో రచ్చ.. నెటిజన్ల ఫైర్.. చేతులు జోడించి క్షమాపణలు కోరిన స్టార్ హీరో!

Riteish Controversy: బాలీవుడ్ సీనియర్ నటుడు, దర్శకుడు రితేశ్‌ దేశ్‌ముఖ్ తాజాగా ఒక ఊహించని కాంట్రవర్సీలో ఇరుక్కున్నాడు.విషయంలోకి వెళ్తే…రితేశ్‌ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చారిత్రాత్మక చిత్రం ‘రాజా శివాజీ’ బాక్సాఫీస్ వద్ద సాలిడ్ హిట్ కొట్టడమే కాకుండా మరాఠీ సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డులను సృష్టించింది. అయితే, ఈ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకునే క్రమంలో జరిగిన ఒక సంఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపొయింది. సినిమా సక్సెస్ పార్టీకి సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో, కొందరు నెటిజన్లు రితేశ్ ప్రవర్తనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ట్రోలింగ్ మొదలుపెట్టారు.

శివాజీ మహరాజ్ టీషర్ట్ ధరించి డ్యాన్స్

వైరల్ అయిన ఆ వీడియోలో రితేశ్‌ దేశ్‌ముఖ్‌ ఛత్రపతి శివాజీ మహరాజ్ ఫొటో ముద్రించి ఉన్న టీషర్ట్ ధరించి డ్యాన్స్ చేస్తూ కనిపించారు. దీనిపై శివభక్తులు, కొందరు నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాజ అంతటి మహోన్నత వ్యక్తి ఫొటో ఉన్న దుస్తులు ధరించి సక్సెస్ పార్టీల్లో ఎంజాయ్ చేయడం సరికాదని మండిపడ్డారు. దీనికి తోడు, అంతటి గొప్ప వీరుడి చరిత్రను సినిమాగా తీసి, దానికి సంబంధించిన వేడుకలో మద్యం సేవించి డ్యాన్స్ చేశారంటూ మరికొందరు ఆయనపై విమర్శల వర్షం కురిపించారు. గతంలో రితేశ్ నటించిన ‘లాయ్ భారీ’ (2014), ‘మౌళి’ (2018) వంటి మరాఠీ చిత్రాలు భారీ విజయాలు సాధించినప్పటికీ, ఎప్పుడూ లేని విధంగా ఈ ‘రాజా శివాజీ’ వివాదం ఆయనను డిఫెన్స్‌లో పడేసింది.

అవమానించాలనే ఉద్దేశం లేదన్న రితేశ్‌

ఇలా ఈ కాంట్రవర్సీ మరింత ముదరడంతో నటుడు రితేశ్‌ దేశ్‌ముఖ్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా క్లారిటీ ఇచ్చే పనిలో పడ్డాడు ‘రాజా శివాజీ’ సినిమాని ఆడియన్స్ సూపర్ హిట్ చేయడంతో ఈ సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక చిన్న వేడుకను ఏర్పాటుచేసుకున్నామని ఆయన తెలిపారు. ఒక శివ భక్తుడిగా (శివాజీ మహరాజ్ అనుచరుడిగా) ఈ వివాదంపై క్లారిటీ ఇవ్వడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ ఫొటో ఉన్న టీషర్ట్ ధరించి వేడుక చేసుకోవడం వెనుక ఆయనను అవమానించాలనే ఉద్దేశం తనకు అస్సలు లేదన్నారు. సినిమా ప్రమోషన్స్ కోసం తాను ఆ టీషర్ట్‌ను ధరిస్తున్నానని, ఆ రోజు కూడా ప్రమోషన్స్ ముగించుకుని నేరుగా ఈ ఈవెంట్‌కు వెళ్లడం వల్లే డ్రెస్‌ మార్చుకునే సమయం దొరకలేదని వివరించారు.

ఇక మద్యం సేవించారనే ఆరోపణలను రితేశ్ పూర్తిగా ఖండించారు. తన జీవితంలో ఇప్పటివరకు ఎప్పుడూ మద్యం తీసుకోలేదని, భవిష్యత్తులోనూ ఎప్పటికీ ముట్టనని ఈ సందర్భంగా ఆయన ప్రమాణం చేశారు. ఒకవేళ తనవల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించమని కోరుతూ, ఛత్రపతి శివాజీ అంటే తనకు ఎంతో గౌరవమని భావోద్వేగానికి గురయ్యారు.

రితేశ్ కెరీర్‌లో ఒక చేదు జ్ఞాపకం

రొమాంటిక్ కామెడీ చిత్రాల హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రితేశ్ దేశ్‌ముఖ్, గతంలో 2022 డిసెంబర్‌లో వచ్చిన ‘వేద్’ సినిమాతో దర్శకుడిగా మారి సూపర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు ‘రాజా శివాజీ’తో మరాఠీ సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా సరికొత్త రికార్డు సృష్టించారు. రూ. 117.41 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిన ఈ భారీ చిత్రంలో రితేశ్ భార్య జెనీలియా డిసౌజా, సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్, విద్యాబాలన్ తదితరులు కీలక పాత్రలు పోషించగా, సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రత్యేక అతిథి పాత్రలో మెరిశారు.ఏది ఏమైనా ఒకవైపు భారీ కలెక్షన్లతో రికార్డులు తిరగరాస్తున్న ఆనందం ఉన్నప్పటికీ, ఈ టీషర్ట్ వివాదం మాత్రం రితేశ్ కెరీర్‌లో ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయినట్టే కనిపిస్తుంది.

also read :‘పెద్ది’ బాక్సాఫీస్ విధ్వంసం.. అంతలోనే లీక్ చేసిన సైబర్ నేరగాళ్లు!

Related News

‘దూత 2’ షురూ.. కింగ్ నాగార్జున క్లాప్‌తో గ్రాండ్‌గా ప్రారంభమైన నాగచైతన్య మోస్ట్ అవేటెడ్ సీక్వెల్

‘పెద్ది’ బాక్సాఫీస్ విధ్వంసం.. అంతలోనే లీక్ చేసిన సైబర్ నేరగాళ్లు!

బయ్యర్లకు డబ్బులు ఇచ్చేసిన నిర్మాత.. ‘జన నాయగన్ ‘మూవీ రిలీజ్ లేనట్లేనా..?

పాలిటిక్స్ లోకి కోలీవుడ్ హీరో ఎంట్రీ.. ఉపఎన్నికల్లో పోటీ..

ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పిన ‘కరుప్పు’ ఎడిటర్.. హీరో సూర్య షాకింగ్ రియాక్షన్…

Peddi Day1 Collections : బాక్సాఫీస్ వద్ద పెద్ది ఊచకోత.. ఒక్కరోజుకే 100 కోట్లా..?

పవన్‌ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ కామెంట్స్.. నటి హేమ స్ట్రాంగ్ కౌంటర్..

Big Stories

×