R.K.Roja: సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు రాజకీయాలలోకి వచ్చి ఉన్నత పదవులలో ఉన్న సంగతి మనకు తెలిసినదే. ఇప్పటికే ఎంతో మంది సినీ సెలబ్రిటీలు రాజకీయాలలో కొనసాగుతున్నారు. అయితే తాజాగా నటుడు విజయ్(Vijay) సైతం ఏకంగా తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇలా విజయ్ సీఎం కావడంతో మరొక నటి , మాజీ మంత్రి ఆర్కే రోజా(R.K.Roja) సైతం ఆంధ్ర రాజకీయాలకు గుడ్ బై చెబుతూ తమిళనాడులో స్థిరపడబోతున్నారు అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వచ్చాయి. ఈమె విజయ్ టీవీకే పార్టీలో(TVK Party)కి చేరబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేయడంతో ఈ వార్తలపై రోజా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమెకు పార్టీ మారడంపై ప్రశ్నలు ఎదురయ్యాయి మీరు ఆంధ్ర పాలిటిక్స్ గుడ్ బై చెబుతూ తమిళనాడులోనే స్థిరపడబోతున్నారని, టీవీకే పార్టీలో చేరబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి ఇది ఎంతవరకు నిజం అంటూ ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు రోజా సమాధానం చెబుతూ.. రాజకీయాల పరంగా నా ఎదుగుదలను చూసి తట్టుకోలేని వారు ఇలాంటి వార్తలను ప్రచారం చేస్తున్నారు. నేను ప్రస్తుతం పదవిలో లేకపోయినా ప్రజలలో ఉన్న ఆదరణను చూసి ఓర్వలేకపోతున్నారని రోజా తెలిపారు. నేను పుట్టి పెరిగింది మొత్తం ఆంధ్రలోనే అలాంటిది నా సొంత గడ్డను వదిలి తమిళనాడు ఎందుకు వెళ్తానని ఈమె తెలిపారు.
గతంలో తమిళనాడు రాజకీయ నాయకులు నన్ను వారి పార్టీలలో చేరమని ఆహ్వానాలు పంపించారు మాజీ దివంగత ముఖ్యమంత్రి జయలలిత కూడా తనని తన రాజకీయ పార్టీలోకి ఆహ్వానించగా తాను వెళ్ళనని చెప్పాను. మరొక పార్టీ కూడా ప్రచార కార్యక్రమాల ఖర్చులన్నీ మేమే చూసుకుంటాం ఎన్నికలలో పోటీ చేయమని కోరినప్పటికీ నేను అందుకు ఒప్పుకోలేదని రోజా తెలిపారు. నాకు నా సొంత గ్రామ ప్రజలు అంటే ఇష్టం నేను ఈ స్థాయికి రావడానికి కారణమైన వారి కోసం ఏదైనా చేయాలనే తపన ఉంది అందుకోసమే తాను ఎమ్మెల్యేగా పోటీ చేశానని తెలిపారు.
ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేశారు..
గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పినా తాను వెళ్లలేదని నాకు ప్రజలలో కలిసి ఉండటం ప్రజలతో ముందుకు వెళ్ళటం ఇష్టం అందుకే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని తెలిపారు. ఇక విజయ్ నుంచి రాజకీయాల పరంగా మీకు ఎలాంటి ఫోన్ కాల్ రాలేదా? అనే ప్రశ్న ఎదురవడంతో తనకు ఎలాంటి ఫోన్ కాల్స్ రాలేదని, విజయ్ తో మాత్రం మంచి పరిచయం ఉందని రోజా ఈ సందర్భంగా తెలియజేశారు. ఇలా రోజా తమిళ రాజకీయాలలో స్థిరపడబోతున్నారు అంటూ వస్తున్న వార్తలకు ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. ఇక ఈమె గతంలో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తే ఇటీవల మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా కొనసాగిన సంగతి తెలిసిందే..ఈమె నగరి నియోజకవర్గంలో నుంచి పోటీ చేసి ఓటమిపాలు అయ్యారు.
Also Roja: పెద్ది ఒక్క టికెట్ ధర 40 డాలర్లు..ఏమైనా రాజమౌళి సినిమానా బ్రో?