E-Paper
Advertisement

HBD Roshan Meka: చైల్డ్ ఆర్టిస్ట్ టు హ్యాండ్సమ్ హీరో.. రోషన్ ప్రయాణం ఆ స్టార్ తోనే!

HBD Roshan Meka: చైల్డ్ ఆర్టిస్ట్ టు హ్యాండ్సమ్ హీరో.. రోషన్ ప్రయాణం ఆ స్టార్ తోనే!
Advertisement

HBD Roshan Meka:శతాధిక చిత్ర కథానాయకుడు శ్రీకాంత్ (Srikanth), ప్రముఖ సీనియర్ కథానాయిక ఊహ (Uha) దంపతుల తనయుడిగా మంచి పేరు సొంతం చేసుకున్నారు రోషన్ మేక (Roshan Meka). 1999 మార్చి 13న జన్మించిన ఈయన.. తల్లిదండ్రుల అడుగుజాడల్లోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. నటుడిగా తెరపైకి రావడానికి ముందు ముంబై, అమెరికాలోని యాక్టింగ్ స్కూల్స్ లో ట్రైనింగ్ తీసుకున్న రోషన్ మేక.. హీరోగా అవతరించడానికి కంటే ముందే చైల్డ్ ఆర్టిస్ట్ గా అందులోనూ ఆ స్టార్ హీరో సినిమాలో నటించాడని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన ‘రుద్రమదేవి’ సినిమాలో హీరో రానా (Rana) పోషించిన ‘చాళుక్య వీరభద్ర’ చిన్నప్పటి పాత్రలో నటించి అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు.

చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ప్రయాణం..

గుణశేఖర్ దర్శకత్వంలో 2015లో వచ్చిన త్రీడీ చారిత్రాత్మక చిత్రమిది . ఒకేసారి తెలుగు, తమిళ్ , మలయాళం భాషలో రూపొందించారు. అనుష్క శెట్టి , శివకుమార్ శ్రీపాద, ప్రకాష్ రాజ్ , విక్రమ్ జీత్ వర్క్, దగ్గుబాటి రానా, అల్లు అర్జున్, ఆదిత్య మేనన్ , నిత్యామీనన్ , కేథరిన్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదు అనిపించుకుంది. ఇక ఈ సినిమా ద్వారానే తన నటన ప్రయాణాన్ని మొదలుపెట్టారు రోషన్ మేక. అలా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు.

అసిస్టెంట్ డైరెక్టర్గా తొలి అడుగు..

Advertisement

ఇకపోతే చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ని మొదలుపెట్టిన రోషన్ మేక.. సల్మాన్ ఖాన్ నటించిన ‘దబాంగ్ 3’ సినిమాకి ప్రభుదేవా దగ్గర దర్శకత్వ శాఖలో రోషన్ మేక అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు.

హీరోగా తొలి అడుగు ఆ సినిమాతోనే..

ఇకపోతే ‘నిర్మల కాన్వెంట్’లో మెయిన్ లీడ్ రోల్ చేసిన రోషన్ మేక అందులో స్టూడెంట్ గా కనిపించారు. ఇక పూర్తిస్థాయిలో హీరోగా కనిపించింది మాత్రం ‘పెళ్లి సందD’. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రోషన్ మేక హీరోగా నటించి.. తన నటన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఈ చిత్రం ద్వారానే యంగ్ బ్యూటీ శ్రీలీలా కూడా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైంది. ఈ సినిమా తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకున్న రోషన్ మేక ‘ఛాంపియన్’ సినిమాతో మళ్లీ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఒక రకంగా చెప్పాలి అంటే ఛాంపియన్ సినిమా ప్రాపర్ హీరో డెబ్యూ అనే చెప్పాలి. పైగా దీనికోసం భారీగా మేకోవర్ అయ్యారు. అందుకే రోషన్ మేకకు ఇదే డెబ్యూ అనడంలో సందేహం లేదు.

Advertisement

also read:Tamannaah: టాలీవుడ్ కి తమన్నా క్రేజీ కమ్ బ్యాక్.. స్టార్ హీరో సినిమాలో అవకాశం!

మోస్ట్ హ్యాండ్సమ్ హీరోగా గుర్తింపు..

ఇకపోతే టాలీవుడ్ లో మోస్ట్ హ్యాండ్సమ్ యంగ్ స్టార్ లలో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు రోషన్ మేక . తన లుక్స్ చూసే ఫిదా అవుతున్న ప్రేక్షకులు ఎంతోమంది. ఇక తండ్రికి మించిన తనయుడు అవుతాడని, ఇండస్ట్రీలో హ్యాండ్సమ్ హీరోల లిస్టులో కచ్చితంగా చేరుతారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈరోజు రోషన్ పుట్టినరోజు కావడంతో పలువురు సినీ సెలబ్రిటీలు అభిమానులు రోషన్ మేకకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×