E-Paper
Advertisement

Edge 70 Fusion+: 144Hz డిస్‌ప్లే, 12GB ర్యామ్‌తో మోటోరోలా కొత్త ఫోన్ లాంచ్.. ఫుల్ ఫీచర్స్, ధర వివరాలు ఇవిగో

Edge 70 Fusion+: 144Hz డిస్‌ప్లే, 12GB ర్యామ్‌తో మోటోరోలా కొత్త ఫోన్ లాంచ్.. ఫుల్ ఫీచర్స్, ధర వివరాలు ఇవిగో
Advertisement

Motorola Edge 70 Fusion+| మోటోరోలా తన లేటెస్ట్ ఫోన్ మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ ప్లస్ (Motorola Edge 70 Fusion+)ని బ్రెజిల్ మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఇటీవల విడుదల అయిన Edge 70 సిరీస్‌లో కొత్త మోడల్. ఈ ఫోన్ పోలికలు.. Edge 70 Fusion మోడల్‌తో చాలా దగ్గరగా ఉన్నాయి. కానీ ఈ ఫోన్.. కెమెరా సిస్టమ్‌లో పెద్ద అప్‌గ్రేడ్ ఉంది. ప్రీమియం డిజైన్, బలమైన పర్‌ఫామెన్స్, మంచి డిస్‌ప్లే క్వాలిటీతో ఈ ఫోన్ వచ్చింది. భారత్‌లో ఇంకా లాంచ్ గురించి అధికారిక ప్రకటన రాలేదు.

Motorola Edge 70 Fusion+ ధర

ఈ ఫోన్ బ్రెజిల్‌లో ముందుగా లాంచ్ అయింది. 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర BRL 2,969 (అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.52,600)
ఫోన్ Pantone Orient Blue, Pantone Blue Surf కలర్లలో దొరుకుతుంది. భారత్‌లో లేదా ఇతర మార్కెట్లలో లాంచ్ గురించి ఇంకా సమాచారం లేదు.

పెద్ద AMOLED డిస్‌ప్లే, స్మూత్ పర్‌ఫామెన్స్

Advertisement

ఈ ఫోన్‌లో 6.8 ఇంచ్ సూపర్ HD ఆమోలెడ్ డిస్‌ప్లే ఉంది. రిజల్యూషన్ 1272 × 2772 పిక్సెల్స్ (1.5K). HDR10+ సపోర్ట్ ఉంది. 144Hz రిఫ్రెష్ రేట్‌తో స్క్రోలింగ్, గేమింగ్ స్మూత్‌గా ఉంటాయి. వైబ్రెంట్ కలర్స్, షార్ప్ విజువల్స్ ఇస్తుంది. స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 ప్రాసెసర్, Adreno 810 GPUతో గేమింగ్, మల్టీటాస్కింగ్ సులభంగా నడుస్తాయి. Android 16 ఆధారంగా Hello UI ఇంటర్‌ఫేస్ ఉంది.

అడ్వాన్స్‌డ్ ట్రిపుల్ కెమెరా సిస్టమ్

ఎడ్జ్ 70 ఫ్యూజన్ ప్లస్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 50MP Sony LYTIA 710 మెయిన్ సెన్సార్ (OIS సపోర్ట్, f/1.8 అపర్చర్) – లో-లైట్‌లో కూడా మంచి ఫోటోలు తీస్తుంది. 50MP అల్ట్రా-వైడ్ లెన్స్‌తో వైడ్ ల్యాండ్‌స్కేప్స్, గ్రూప్ ఫోటోలు తీయడానికి బాగుంటుంది. 10MP టెలిఫోటో లెన్స్.. 3x ఆప్టికల్ జూమ్ తో దూరంగా ఉన్న ఫొటోలు కూడా క్లియర్గా వస్తాయి. ఫ్రంట్‌లో 50MP సెల్ఫీ కెమెరా ఉంది. 8K 30fps వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఉంది.

Advertisement

Also Read: మనుషులపై జోకులు వేసే ఏఐలు.. మానవులకు నో ఎంట్రీ ప్లాట్‌ఫామ్.. చాలా ప్రమాదకరం

బ్యాటరీ, కనెక్టివిటీ ఫీచర్లు

5200mAh పెద్ద బ్యాటరీ ఉంది. 68W TurboPower ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. త్వరగా ఛార్జ్ అవుతుంది. 5G, 4G LTE, Wi-Fi, Bluetooth, NFC సపోర్ట్ ఉన్నాయి. GPS, USB Type-C పోర్ట్ ఉన్నాయి. గ్లాస్ ఫైబర్ రీన్‌ఫోర్స్డ్ పాలిమర్ మెటీరియల్‌తో తేలికగా, డ్యూరబుల్‌గా ఉంటుంది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. ఫోన్ బరువు 177 గ్రాములు, మందం 7.21mm మాత్రమే.

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×