E-Paper
Advertisement

Rudraveena Controversy: వెంకటేష్ టైటిల్ పై కన్నేసిన మెగాస్టార్? ఆ శాపమే సినిమాను ముంచేసిందా?

Rudraveena Controversy: వెంకటేష్ టైటిల్ పై కన్నేసిన మెగాస్టార్? ఆ శాపమే సినిమాను ముంచేసిందా?
Advertisement

Rudraveena Controversy: టాలీవుడ్‌లో ఒక సినిమా టైటిల్ కోసం యుద్ధాలు జరగడం కొత్తేమీ కాదు. కానీ, మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘రుద్రవీణ’ టైటిల్ వెనుక ఒక విషాదకరమైన ‘టైటిల్ హైజాక్’ స్టోరీ ఉందన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. విక్టరీ వెంకటేష్ హీరోగా, మూవీ మొఘల్ రామానాయుడు సమర్పణలో రావాల్సిన సినిమా టైటిల్‌ను చిరంజీవి తన ‘ప్రభావం’తో ఎలా దక్కించుకున్నారో తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే!

వెంకీ బాబును సైడ్ చేసిన మెగా ప్లాన్?
నిర్మాత కె.మురారి అప్పట్లో వెంకటేష్‌తో ఒక క్లాసిక్ సినిమా తీయాలని ప్లాన్ చేశారు. క్రాంతికుమార్ దర్శకత్వంలో ‘రుద్రవీణ’ అనే టైటిల్‌ను ఫిలిం ఛాంబర్‌లో రిజిస్టర్ చేసి, పేపర్లలో భారీగా యాడ్స్ కూడా ఇచ్చారు. అయితే, అదే సమయంలో చిరంజీవి తన సొంత బ్యానర్ ‘అంజన ప్రొడక్షన్స్’లో బాలచందర్ దర్శకత్వంలో సినిమా మొదలుపెట్టారు. షూటింగ్ జరుగుతున్నా టైటిల్ దొరక్క టెన్షన్‌లో ఉన్న చిరంజీవి కన్ను.. మురారి రిజిస్టర్ చేసిన ‘రుద్రవీణ’ మీద పడింది.

Advertisement

మురారిపై ఒత్తిడి.. మెగాస్టార్ కోసం త్యాగం!
వాహిని స్టూడియోలో మురారిని చూసిన చిరంజీవి, ఆ టైటిల్ తనకు కావాలని పరోక్షంగా సిగ్నల్ ఇచ్చారు. మురారి మొదట తిరస్కరించినా, ఆ తర్వాత నిర్మాత కె.ఎస్. రామారావు రంగంలోకి దిగి చిరంజీవి కోసం ‘పైరవీ’ చేశారనే టాక్ ఉంది. మెగాస్టార్ ఇమేజ్ ముందు ఒక చిన్న నిర్మాత ఎంతవరకు నిలబడగలరు? అందుకే, మనసు చంపుకుని మరీ చిరంజీవి ఇంటికి వెళ్లి ‘రుద్రవీణ’ టైటిల్‌ను రాసి ఇచ్చేశారు మురారి. దీంతో వెంకటేష్ – రాజశేఖర్ వంటి భారీ కాంబినేషన్ లో రావాల్సిన సినిమా టైటిల్ లేక అనాథగా మిగిలిపోయింది.

వీణకు అవమానం.. బాక్సాఫీస్ వద్ద భస్మం!
ఇక  వెంకటేష్ సినిమా యాడ్‌లో వీణను హీరో కాళ్ళ దగ్గర పెట్టి ఫోటో షూట్ చేయడం అప్పట్లో పెద్ద వివాదానికి దారితీసింది. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కె.వి. మహదేవన్ ఈ ఫోటో చూసి, “సరస్వతీ దేవికి నిలయమైన వీణను ఇలా అవమానిస్తే ఆ సినిమా సర్వనాశనం అవుతుంది” అని శాపనార్థాలు పెట్టారట. ఆయన అన్నట్టుగానే, ఆ సినిమా పట్టాలెక్కకుండానే ఆగిపోయింది. పోనీ, కష్టపడి లాక్కున్న చిరంజీవికి అయినా ‘రుద్రవీణ’ లాభాలు తెచ్చిందా అంటే అదీ లేదు! కమర్షియల్ గా సినిమా డిజాస్టర్ అయ్యి, నిర్మాతగా చిరంజీవికి భారీ నష్టాలను మిగిల్చింది.

Advertisement

అవార్డులు ఎన్ని వచ్చినా, ‘రుద్రవీణ’ బాక్సాఫీస్ వద్ద చతికిలపడటం వెనుక ఆ ‘టైటిల్ రాజకీయం’ ఉందనేది కొందరి వాదన. ఒకరి నోటి దగ్గర ముద్దను లాక్కుంటే ఇలాగే జరుగుతుందంటూ అప్పట్లో యాంటీ ఫ్యాన్స్ తెగ ట్రోల్ చేశారు. ఏదేమైనా, వెంకటేష్ చేయాల్సిన ‘రుద్రవీణ’ ఆగిపోవడం టాలీవుడ్ చరిత్రలో ఒక తీరని లోటుగానే మిగిలిపోయింది!

also read: Mallareddy Cinema: మల్లారెడ్డి ‘సినిమా’ ప్లాన్..! వెండితెరపై సీఎం డ్రీమ్..?

 

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×