UP Crime: ఉత్తర్ ప్రదేశ్ లోని సుమేర్ పూర్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు భార్యలు, 18 మంది సంతానం ఉన్న గ్రామ మాజీ సర్పంచ్ ముస్తకా గుల్షన్ అలియాస్ మున్నా హత్యకు గురయ్యాడు. పోలీసులు ఓ కాలువలో అతడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. హత్యకు కారణమైన ఇద్దరు వ్యక్తును అరెస్టు సైతం చేశారు. మరో మహిళతో ఉన్న వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసులు వెల్లడించారు.
మున్నాకు ఇద్దరు భార్యలు ఉన్నప్పటికీ గ్రామానికే చెందిన సుమన్ దేవి అనే మహిళతో వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నాడు. అయితే సుమన్ దేవికి అప్పటికే వివాహం జరిగి ఉండగా.. ఆమె భర్త ఉద్యోగ నిమిత్తం గ్రామానికి దూరంగా ఉంటున్నాడు. అయితే ఆర్థిక సాయం పేరుతో మున్నా తొలుత ఆమెకు దగ్గరయ్యాడు. తనతో సంబంధం పెట్టుకోవాలని బెదిరించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మున్నాతో దేవి బంధాన్ని ఏర్పరుచుకోవాల్సి వచ్చింది.
అయితే మున్నా ఆగడాలు రోజు రోజుకు మితిమీరడం, తనను కలవమని బ్లాక్ మెయిల్ చేయడంతో సుమన్ దేవీలో సహనం నశించిపోయింది. మున్నా సమస్యకు చెక్ పెట్టాలన్న ఉద్దేశ్యంతో తన సోదరుడికి చెప్పుకొని వాపోయింది. అంతేకాకుండా సోదరుడి సాయంతో మున్నా హత్యకు ప్లాన్ చేసింది.
కుట్రలో భాగంగా మార్చి 18న మున్నాను తన పుట్టింటికి సుమన్ దేవి ఆహ్వానించింది. మరోవైపు సుమన్ దేవి సోదరుడు సైతం తన అనుచరులతో కలిసి కర్రలు, రాడ్లతో ఇంటి వద్ద సిద్ధంగా ఉన్నాడు. ఇది తెలియని మున్నా.. నేరుగా ఇంట్లోకి వచ్చేయడంతో అప్పటికే రెడీ ఉన్న వారంతా ఒక్కసారిగా అతడిపై దాడికి తెగబడ్డారు. విచక్షణారహితంగా కొట్టి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని సంచిలో కుక్కి.. గ్రామ శివార్లలో ఉన్న కాలువలో పడేశారు.
Also Read: LPG Gas: గంటపాటు వంట చేస్తే.. ఖర్చయ్యే LPG ఎంత? గ్యాస్ ఆదాకు ఏ బర్నర్ బెస్ట్!
అయితే మున్నా కనిపించకపోవడంతో అతడి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. తొలుత మున్నా మోటర్ సైకిల్ ను గుర్తించారు. అనంతరం ఫోన్ రికార్డులను పరిశీలించగా.. అది ఆఖరిసారి కాలువ దగ్గర సిగ్నల్ చూపించింది. దీంతో అక్కడికి వెళ్లి తనిఖీ చేయగా సంచిలో మున్నా డెడ్ బాడీ కనిపించింది. దీంతో సుమన్ దేవీ, ఆమె సోదరుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. హత్యలో ప్రమేయమున్న మిగతవారి కోసం గాలిస్తున్నారు. కాగా మున్నాకు ఇద్దరు భార్యలు ఉండగా ఒక్కో భార్యకు ఆరుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెల చొప్పున మెుత్తం 18 మంది సంతానం ఉన్నారు.
Also Read: Induction Stove Tips: వంట అవ్వగానే.. ఇండక్షన్ స్టవ్ ఆఫ్ చేస్తున్నారా? అయితే చిక్కుల్లో పడ్డట్లే!