Sahithi Dasari : ఒక్క సినిమాతో ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ల గా చలామణి అవుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే ఈ మధ్య చిన్న సినిమాలలో నటించే హీరోయిన్లు స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంటున్నారు. అంతేకాదు వరుసగా సినిమాలలో నటించే అవకాశాన్ని కూడా అందుకుంటున్నారు. అలాంటి వారిలో తెలుగు కుర్ర హీరోయిన్లు చాలామంది ఉన్నారు. ఆ లిస్టులోకి చేరిన ఓ ముద్దుగుమ్మ సాహితీ దాసరి. పొలిమేర సినిమాతో బాగా ఫేమస్ అయ్యింది ఈమె.. ఆ సినిమా ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ తర్వాత పలు సినిమాలలో నటిస్తూ వచ్చింది. అయితే ఈమెకు ఎక్కువగా క్రేజ్ ఉన్న పాత్రల కన్నా గ్లామర్ రోల్స్ ఎక్కువగా రావడంతో ఈ మధ్య అలాంటి సినిమాలను ఒప్పుకోవడం లేదని తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.. అంతే కాదు ఆమె తన లవ్ బ్రేకప్స్ గురించి కూడా సంచలన విషయాలను పంచుకుంది. ఇంతకీ ఆమె ఏం చెప్పిందో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..
తెలుగులో మంచి సక్సెస్ ను అందుకున్న పొలిమేర మూవీలో గెటప్ శ్రీను భార్యగా నటించింది సాహితి దాసరి.. డీ గ్లామర్ రోల్స్ సినిమాల్లో ఎక్కువగా కనిపించింది.. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఈమధ్య ఓ సినిమాలో నటించింది. ఈ సందర్భంగా ఆమె ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది. అందులో భాగంగా తన సినిమాల గురించి ఎన్నో కీలక విషయాలను పంచుకుంది.. అలాగే తన పర్సనల్ లైఫ్ గురించి ఎన్నో విషయాలను బయట పెట్టింది.. ఆమె మాట్లాడుతూ.. తన లైఫ్ జరిగిన కొన్ని అనుకోని సంఘటనల గురించి చెప్పింది. ముఖ్యంగా ఐదుగురితో బ్రేకపోవడ విషయాన్ని ఆమె చెప్పడంతో ఒక్కసారిగా యాంకర్ కూడా షాక్ అవుతాడు. అంతేకాదు ఎలాంటి పరిస్థితిలో ఆమె ఆ బ్రేకప్ చెప్పింది అన్న విషయాన్ని కూడా చెప్పడంతో ఆ మేము చేసింది. తప్పేమీ లేదు అని కొందరు అభిప్రాయపడుతున్నారు.. ఆ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవ్వడంతో ఆమెపై నెటిజన్లు షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు..
Also Read : మాధవ్ పై మహా కు అనుమానం.. కొత్త ఫ్యామిలీతో ట్విస్ట్.. చక్రీకి షాక్..
ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది కామన్ గా ఉంటుంది.. ఈమధ్య చాలామంది ముద్దుగుమ్మలు ఇంటర్వ్యూలలో తాము ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి బయట పెడుతుంటారు.. ఇప్పుడు తాజాగా ఆమె కూడా తనకు ఎదురైనా చేదు అనుభవాలను ఇంటర్వ్యూలో పంచుకుంది. దర్శకులు, నిర్మాతలు తనను కమిట్మెంట్స్ అడిగారు అని తెలిపింది సాహితి. అయితే నేరుగా కమిట్మెంట్ అడగరు.. కోఆర్డినేటర్లు, మేనేజర్లు, లేదా అసిస్టెంట్ డైరెక్టర్ల వంటివారు మధ్యవర్తుల ద్వారానే అడుగుతారని తెలిపారు. డైరెక్టర్లతో క్లోజ్ గా ఉండడం మెసేజ్లు చేయడం లాంటివి చేస్తేనే ఆఫర్లు వస్తాయని అంటారు. అలాంటివి నాకు ఎదురైనప్పుడు నేను నో చెప్పాను. అందుకే ఇప్పుడు పెద్దగా సినిమాల్లో కనిపించలేదు అని సాహితి అన్నారు.. కొన్ని పెద్ద ప్రాజెక్టులలో అవకాశాలను కోల్పోయానని చెప్పుకొచ్చింది.. ఎప్పుడు ఫాస్ట్ గా సక్సెస్ అవ్వాలని కోరుకోవద్దు. చిన్నదైనా సరే ఆ హీరోయిన్ సక్సెస్ అయిందంటే కష్టం మీద పైకి వచ్చిందని అంటారు అని ఆమె వివరించారు.. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవ్వడంతో సాహితి గురించి సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి..