E-Paper
Advertisement

Abhishek Sharma Health Update: 2 కేజీలు త‌గ్గిన అభిషేక్ శ‌ర్మ..ఆందోళ‌న క‌రంగా ఆరోగ్యం !

Abhishek Sharma Health Update: 2 కేజీలు త‌గ్గిన అభిషేక్ శ‌ర్మ..ఆందోళ‌న క‌రంగా ఆరోగ్యం !

Abhishek Sharma Health Update: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) చాలా రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ టోర్నమెంటులో రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించిన టీమిండియా… ఆదివారం పాకిస్తాన్ జట్టుతో తలపడనుంది. ఇలాంటి నేపథ్యంలో టీమిండియా కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఈ టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్లో ఇరగదీస్తాడు అనుకున్న అభిషేక్ శర్మ ( Abhishek Sharma ) మంచానపడ్డాడు. అంతేకాదు అభిషేక్ శర్మ దాదాపు రెండు కేజీలు ( 2kg Down Abhishek Sharma) తగ్గిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో పాకిస్తాన్ వర్సెస్ ఇండియా ( Pakistan vs India) మధ్య జరిగే మ్యాచ్ కు అభిషేక్ శర్మ దూరమవుతాడని అంటున్నారు. దీంతో ఇండియన్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.

Also Read: T20 World Cup 2026: అరుణ్ జైట్లీ స్టేడియం ద‌గ్గ‌ర దారుణం…మిగిలిపోయిన డ్రింక్స్ రీ-యూజ్?, ఇండియా ప‌రువు తీస్తున్నారు క‌ద‌రా

రెండు కేజీలు తగ్గిపోయిన అభిషేక్ శర్మ.. ఆందోళనకరంగా హెల్త్

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన అభిషేక్ శర్మ, ఆ తర్వాత వైరల్ ఫీవర్ బారిన పడ్డాడు. అనంతరం అభిషేక్ శర్మ తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నారట. అంతేకాదు ఢిల్లీలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో అభిషేక్ శర్మ ( Abhishek Sharma Health Update) జాయిన్ అయ్యారట. నిన్న ఇండియా వర్సెస్ నమీబియా ( India vs Namibia) మధ్య మ్యాచ్ జరిగిన సందర్భంగా తలుక్కున మెరిశారు అభిషేక్ శర్మ. అయితే అతని ఫేస్ లో ఉన్న ఏమాత్రం గ్లో కనిపించలేదు. పూర్తిగా నిరసించిపోయిన వాడిలాగా… ఓ వ్యాధిగ్రస్తుడి లాగా కనిపించాడు అభిషేక్ శర్మ.

ఈ నేపథ్యంలోనే నమిబియాతో మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత టీమిండియా ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ ( Arshdeep Singh) అతడి హెల్త్ అప్డేట్ ఇచ్చాడు. ఈ మేరకు అభిషేక్ శర్మకు సంబంధించిన హెల్త్ అప్డేట్ ను రీల్ ద్వారా రిలీజ్ చేశాడు అర్షదీప్ సింగ్‌. ఇందులో తన ఆరోగ్యం బాగాలేదని అభిషేక్ శర్మ చెప్పడం జరిగింది. అనారోగ్యం కారణంగా తన బరువు పూర్తిగా తగ్గిపోయానని అభిషేక్ శర్మ స్వయంగా చెప్పాడు. ప్రస్తుతానికి అయిత అన్నం తింటున్నానని వివరించారు. అభిషేక్ శర్మ దాదాపు రెండు కేజీలు తగ్గినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీంతో అభిమానులు టెన్షన్ పడుతున్నారు. అంటే ఈ లెక్కన పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ కు అభిషేక్ శర్మ దూరం అవుతాడని అంటున్నారు.

అభిషేక్ శర్మ హెల్త్ పై సూర్య అప్డేట్

టీమిండియా యంగ్ క్రికెటర్ అభిషేక్ శర్మ హెల్త్ పై నిన్న కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ అప్ డేట్ ఇచ్చాడు. అభిషేక్ శర్మ మరో ఒకటి లేదా రెండు మ్యాచ్ ల‌కు దూరమయ్యే ప్రమాదం పొంచి ఉందని నిన్న నమీబియాతో జరిగిన మ్యాచ్ సందర్భంగా వెల్లడించారు. అంటే ఈ లెక్కన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కు అభిషేక్ శర్మ దూరం అవుతాడని చెప్పవచ్చు.

Also Read: Gerhard Erasmus Bowling Action: న‌మీబియాలో మ‌రో ఉస్మాన్ తారిక్‌..ఇండియాతో జ‌రిగిన‌ మ్యాచ్ లో ఎరాస్మ‌స్ త్రో బౌలింగ్

 

Related News

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Big Stories

×