E-Paper
Advertisement

Sai Durga Tej: మెగా మేనల్లుడు పెళ్లి వచ్చే ఏడాదే.. కన్ఫర్మ్ చేసిన తేజ్

Sai Durga Tej: మెగా మేనల్లుడు పెళ్లి వచ్చే ఏడాదే.. కన్ఫర్మ్ చేసిన తేజ్
Advertisement

Sai Durga Tej:ఈ ఏడాది టాలీవుడ్ కుర్ర హీరోలు చాలామంది పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెల్సిందే.  టాలీవుడ్ లో  ప్రతి ఏడాది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ తగ్గుతూ వస్తుంది. ఇక ఆ లిస్ట్ లో ఎప్పటినుంచో ఉన్నాడు మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్. పిల్లా నువ్వు లేని జీవితం అంటూ కెరీర్ ను మొదలుపెట్టిన తేజ్.. విజయాపజయాలను పట్టించుకోకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకోవడానికి కష్టపడుతూనే ఉన్నాడు.

మెగాఫ్యామిలీలో అందరూ ఒక ఇంటి వారయ్యారు. చివరికి అల్లు శిరీష్ కూడా ఈ మధ్యనే నయనికాతో నిశ్చితార్థం జరుపుకున్నాడు. ప్రస్తుతం మెగా కుటుంబంలో మిగిలింది పంజా బ్రదర్స్ మాత్రమే.. అదేనండీ సాయి దుర్గా తేజ్..  అతని తమ్ముడు వైష్ణవ్ తేజ్. పెళ్లి అన్న మాట వచ్చిన ప్రతిసారి తేజ్.. ఆ హీరోయిన్ తో లవ్ ఎఫైర్ ఉంది.. ఈ హీరోయిన్ తో బ్రేకప్ అయ్యింది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు.. ఈ అమ్మాయితో రిలేషన్ లో ఉన్నాడు అంటూ పుకార్లు షికార్లు చేస్తూనే వచ్చాయి. వాటిని తేజ్ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే వచ్చాడు.

Advertisement

అయితే ఈ మధ్యనే పంజా బ్రదర్స్ కూడా పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు వార్తలు వినిపించాయి. మేనమామ చిరంజీవి.. మేనల్లుళ్ల పెళ్లి బాధ్యతను స్వీకరించినట్లు సమాచారం. విదేశాల్లో చదువుకొని సెటిల్ అయిన ఇద్దరు అమ్మాయిలను.. పంజా బ్రదర్స్ కోసం చూసారని, వారు కూడా పెళ్ళికి ఓకే అనడంతో మాటలు కూడా అయ్యిపోయాయని వార్తలు వచ్చాయి. తాజాగా తన పెళ్లి వార్తలపై తేజ్ స్పందించాడు. నేటి ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తేజ్.. స్వామివారి దర్శనానంతరం మీడియాతో మాట్లాడాడు. మీ పెళ్లి ఎప్పుడు అని  విలేఖరి అడిగిన ప్రశ్నకు.. వచ్చే ఏడాది ఉంటుంది అని తేజ్ చెప్పడంతో..  పంజా బ్రదర్స్ పెళ్లి వార్త నిజమే అని కన్ఫర్మ్ అయ్యింది. దీంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే తేజ్ జీవితంలో కుదుపు. రోడ్డు యాక్సిడెంట్. చావు బతుకుల మధ్య ఏడాది పాటు పోరాడి కోలుకున్నాడు. ఇక ఆ ప్రమాదం తరువాత నుంచే జీవితం అంటే తెలిసిందని చెప్పుకొచ్చే తేజ్ విరూపాక్షతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం సంబరాల ఏటిగట్టు సినిమాతో బిజీగా ఉన్నాడు.  ఈ సినిమా కూడా వచ్చే ఏడాది రిలీజ్ అవుతుంది. అయితే అది పెళ్ళికి ముందా.. ? తరువాత అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×