BigTV English

Sai Pallavi: బికినీలో సాయి పల్లవి.. ఇలా ఎప్పుడైనా చూశారా.. మెంటలెక్కిపోతుంది మావా

Sai Pallavi: బికినీలో సాయి పల్లవి.. ఇలా ఎప్పుడైనా చూశారా.. మెంటలెక్కిపోతుంది మావా

Sai Pallavi: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పద్ధతికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన వారిలో మొదట సీనియర్ హీరోయిన్, దివంగత నటిమని సావిత్రి (Savitri ) గుర్తుకొస్తారు. ఆమె తర్వాత సౌందర్య(Soundarya) అంతటి ఇమేజ్ దక్కించుకున్నారు. ఇక సౌందర్య తర్వాత ఆ రేంజ్ లో ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక సాయి పల్లవి (Sai Pallavi)మాత్రమే.. మధ్యలో కీర్తి సురేష్ (Keerthi Suresh) లాంటి హీరోయిన్లు వచ్చినా ఆ తర్వాత కాలంలో వారు కూడా గ్లామర్ డోస్ పెంచేసి అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.. కానీ సాయి పల్లవి మాత్రం గ్లామర్ డోస్ కి దూరంగా.. పద్ధతిగా సినిమాలు చేస్తూ సెలెక్టెడ్ గా పాత్రలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.


గ్లామర్ లుక్ లో సాయి పల్లవి..

అలా పద్ధతికి కేరాఫ్ అడ్రస్ గా మారి అందరి దృష్టిని ఆకర్షించింది సాయి పల్లవి. అలాంటి ఈమె ప్రస్తుతం ఆ గౌరవంతోనే బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ‘రామాయణం’ సినిమాలో సీత పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టిన ఈమె సడన్గా బికినీలో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులే కాదు సినీ ప్రేక్షకులు, ఆఖరికి సెలబ్రిటీలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పద్ధతిగా ఉంటూ నటనకు ఆస్కారం ఉండే పాత్రలను ఎంచుకుంటూ అందర్నీ ఆకట్టుకునే సాయి పల్లవి ఏంటి సడన్గా ఇలాంటి ఫోజులో కనిపించింది అంటూ తెగ చర్చించుకుంటున్నారు.

బీచ్ లో బోల్డ్ లుక్ లో సాయి పల్లవి..


అసలు విషయంలోకెళితే.. ఇటీవల తన చెల్లెలు పూజా కన్నన్ తో కలిసి విదేశాలలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగానే బీచ్ లో జల క్రీడల్లో పాల్గొన్న సందర్భంగా అందుకు సంబంధించిన ఫోటోలు ఇలా పూజా కన్నన్ తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. అయితే పూజా కన్నన్ షేర్ చేసిన ఫోటోలలో ఇప్పటివరకు సాయి పల్లవిని ఇలా ఏ రోజు చూడకపోవడంతో చూడకూడని గెటప్లో చూసేసామా అంటూ అభిమానులు, నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు. మరి కొంతమంది బికినీలో అమ్మడి అందాలు చూసేసరికి సాయి పల్లవిని ఇలా ఎప్పుడు చూడలేదు మామ.. చూస్తే మాత్రం మెంటలెక్కిపోతుంది అంటూ కామెంట్లో చేస్తున్నారు.

also read:Big Breaking: సీనియర్ హీరోయిన్ రాధికా తల్లి మృతి!

చెడగొట్టేశారు కదరా..

ఇప్పటివరకు ఏ ఒక్కరోజు కూడా ఇలాంటి అవతారంలో సాయి పల్లవిని చూడలేదు. ఇలా చూసేసరికి ఇదేంటి పద్ధతిగా కనిపించిన సాయి పల్లవి ఇలా మారిపోయింది.. అసలు ఊహించలేదు. బాలీవుడ్ కి వెళ్ళిన తర్వాత అక్కడ నీళ్లు వంటపట్టాయా ఏంటి? మొత్తానికి చెడగొట్టారు కదరా.. బాలీవుడ్ కి వెళ్ళాక హద్దులు కూడా చెరిపేసింది అంటూ ఇలా ఎవరికి వారు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా గ్లామర్ కి దూరంగా.. అభినయమే ఆయుధంగా మార్చుకున్న సాయి పల్లవి సడన్గా ఇలా కనిపించేసరికి అభిమానులు తట్టుకోలేకపోతున్నారని చెప్పవచ్చు.

భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న నెటిజన్స్..

ఇకపోతే సాయి పల్లవి దగ్గరుండి మరీ తన చెల్లెలు పూజా కన్నన్ కు గత ఏడాది పెళ్లి చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు పూజా కన్నన్ విదేశాలలో సెటిలైపోయింది. చెల్లి దగ్గరికి వెళ్ళిన సాయి పల్లవి అందులో భాగంగానే అక్కడ బీచ్ కి వెళ్ళగా ఇలా బికినీలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ఫోటోలు వైరల్ అవ్వడంతో కొంతమంది సాయి పల్లవికి మద్దతుగా నిలుస్తున్నారు. ఎంతకాలం అలాగే ఉంటారు ట్రెండుకు తగ్గట్టుగా ఫాలో అవ్వాలి కదా.. ఏమైనా ఇలా బికినీలో మతులు పోగొడుతోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొంతమంది ఉన్నది ఇండస్ట్రీలో పద్ధతిగా ఈమె ఒక్కతే.. ఇప్పుడు ఈమెను కూడా చెడగొట్టారు అంటూ రకరకాల కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

Related News

Pawan Kalyan : ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ జంధ్యం చూశారా… దేంతో చేశారంటే ?

Pawan Kalyan: పవన్.. కొద్దిగా ఓవర్ అనిపించలేదు

Adira Movie : ప్రశాంత్ వర్మ సెకండ్ సూపర్ హీరో వచ్చేశాడు… కానీ, డైరెక్టరే మారిపోయాడు

Big Breaking: సీనియర్ హీరోయిన్ రాధికా తల్లి మృతి!

Rithu Chowdhary: హీరో బెడ్ రూంలో రీతు చౌదరి.. వీడియోతో బట్టబయలైన ఎఫైర్

OG Trailer: ఓజీ ట్రైలర్ రిలీజ్.. హీరో కంటే ఆయనకే ఎక్కువ హైప్ ఇచ్చినట్టున్నారే?

Pawan Kalyan: అప్పట్లో ఇలాంటి టీమ్ ఉంటే రాజకీయాల్లోకి వచ్చేవాన్ని కాదు!

Big Stories

×