BigTV English

Big Breaking: సీనియర్ హీరోయిన్ రాధికా తల్లి మృతి!

Big Breaking: సీనియర్ హీరోయిన్ రాధికా తల్లి మృతి!

Big Breaking:సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ హీరోయిన్ రాధికా శరత్ కుమార్ (Radhika Sarath Kumar) తల్లి గీత స్వర్గస్తులయ్యారు. ప్రస్తుతం ఆమె వయసు 86 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న గీత.. ఆదివారం రాత్రి 9:30 గంటలకు తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు. గీత మృతి పట్ల ఆమె కుటుంబ సభ్యులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.


తల్లి మరణంతో శోకసంద్రంలో మునిగిపోయిన రాధిక..

సీనియర్ హీరోయిన్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకొని ఇప్పటికీ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న రాధిక.. తల్లి మరణంతో శోకసంద్రంలో మునిగిపోయారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులు ఆమెను మరింతగా ఓదార్చే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. రాధిక తల్లి గీత మరణంతో చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనవుతోంది. గీతా మరణానికి పలువురు సెలబ్రిటీలు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.


గీత ఎవరంటే?

గీత ఎవరో కాదు దివంగత సీనియర్ నటుడు ఎం.ఆర్ రాధ భార్య. ఈమె తమిళ చిత్ర పరిశ్రమకు అలాగే సామాజిక వర్గాలకు ఎంతో కృషి చేసింది. గీత విషయానికి వస్తే.. తన జీవితాన్ని కుటుంబానికే అంకితం చేసిన ఈమె.. వెనుకబడిన ప్రాంతాలలో అనేక సామాజిక సేవ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ముఖ్యంగా ఈమె భర్త ఎంఆర్ రాధా వారసత్వాన్ని కొనసాగించడంతోపాటు కుటుంబాన్ని నడిపించడంలో అలాగే సామాజిక సేవ చేయడంలో కూడా భర్త వెంటే నిలుస్తూ అందరి మన్ననలు దక్కించుకున్నారు. ఈమె మరణం పట్ల రాజకీయ నాయకులు కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

అంత్యక్రియలు నేడే:

2025 సెప్టెంబర్ 22న సోమవారం సాయంత్రం 4:30 గంటలకు బెసెంట్ నగర్ లోని స్మశాన వాటికలో గీత అంత్యక్రియలను కుటుంబ సభ్యులు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

ALSO READ:Rithu Chowdhary: హీరో బెడ్ రూంలో రీతు చౌదరి.. వీడియోతో బట్టబయలైన ఎఫైర్

?utm_source=ig_web_copy_link

Related News

Rithu Chowdhary: హీరో బెడ్ రూంలో రీతు చౌదరి.. వీడియోతో బట్టబయలైన ఎఫైర్

OG Trailer: ఓజీ ట్రైలర్ రిలీజ్.. హీరో కంటే ఆయనకే ఎక్కువ హైప్ ఇచ్చినట్టున్నారే?

Pawan Kalyan: అప్పట్లో ఇలాంటి టీమ్ ఉంటే రాజకీయాల్లోకి వచ్చేవాన్ని కాదు!

OG Concert: పవన్ కళ్యాణ్ కు ఏది ఊరికే రాదు… మనల్ని ఆపేది ఎవరు..జోష్ నింపిన పవన్!

Pawan Kalyan: సుజీత్ కు పిచ్చి పట్టుకుంది, పవన్ కళ్యాణ్ అవకాశం ఇవ్వడానికి అదే కారణం

OG concert: ఓజీ రివ్యూ ఇదే..మీసం మెలేసిన తమన్…అంత కాన్ఫిడెంట్ ఏంటీ భయ్యా!

OG Movie : చంపేస్తే చంపేయండి రా… ఇలా మెంటల్ టార్చర్ పెట్టకండి, ఓజి సినిమా చిక్కులు

Big Stories

×