E-Paper
Advertisement

Kalki 2: దీపికా స్థానంలో సాయి పల్లవి.. నిర్మాతలకు అన్ని కోట్లు లాభమా..వామ్మో?

Kalki 2: దీపికా స్థానంలో సాయి పల్లవి.. నిర్మాతలకు అన్ని కోట్లు లాభమా..వామ్మో?
Advertisement

Kalki 2: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన కల్కి సినిమా ఎలాంటి సక్సెస్ అందుకున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాన్ ఇండియా స్థాయిలో మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రాన్ని కూడా ప్రకటించారు. త్వరలోనే ఈ సినిమా సీక్వెల్ కూడా షూటింగ్ పనులను జరుపుకోబోతుందని తెలుస్తోంది. కల్కి సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకొనే(Deepika Padukone) నటించిన విషయం తెలిసిందే అయితే కొన్ని కారణాలవల్ల ఈమెను సీక్వెల్ సినిమా నుంచి తప్పించడంతో సీక్వెల్ సినిమాలో హీరోయిన్ ఎవరు అని అంశంపై ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

దీపికా బదులుగా సాయి పల్లవి..

ఈ సినిమాలో హీరోయిన్ సాయి పల్లవి సుమతి పాత్రలో కనిపించబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం కూడా ఈ అంశంపై స్పందించారు. కల్కి2(Kalki 2) నిర్మాతలు సాయి పల్లవిని సంప్రదించిన మాట వాస్తవమే కానీ ఇంకా సాయి పల్లవి ఫైనల్ కాలేదని తెలియచేయడంతో త్వరలోనే సాయి పల్లవి గురించి అధికారక ప్రకటన రాబోతుందని అభిమానులు కూడా భావిస్తున్నారు . ఇలా సాయి పల్లవి కల్కి సీక్వెల్ సినిమాలో భాగం కాబోతున్నారనే విషయం తెలియడంతో ఎన్నో రకాల వార్తలు బయటకు వచ్చాయి.

రూ. 30 కోట్లు ఆదాయం..

Advertisement

సాయి పల్లవిని కల్కి సినిమాలో దీపికాకు బదులుగా తీసుకుంటే నిర్మాతలకు కోట్లలో లాభాలు ఉంటాయని తెలుస్తోంది. దీపికా బదులు సాయి పల్లవిని తీసుకుంటే చిత్ర నిర్మాతలకు సుమారు 30 కోట్ల రూపాయలు ఆదా అవుతుందని సమాచారం. దీపిక ఒక్కో సినిమాకు 15 నుంచి 20 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అలాగే దీపిక స్టాఫ్ ఖర్చులు కలిపి సుమారు 30 కోట్లకు పైగా నిర్మాతలు రెమ్యూనరేషన్ ఇవ్వాల్సి ఉండేదని తెలుస్తోంది. అయితే ఈ సినిమా నుంచి దీపిక బదులు సాయి పల్లవిని తీసుకుంటే ఈమెకు రెమ్యూనరేషన్ మాత్రమే నిర్మాతలు చెల్లిస్తారని తద్వారా 30 కోట్ల రూపాయల వరకు లాభం పొందుతారని తెలుస్తోంది.

పాన్ ఇండియా సినిమాలలో సాయి పల్లవి..

Advertisement

ఇక సాయి పల్లవి ప్రస్తుతం ఒక్కో సినిమాకు ఆరు నుంచి ఏడు కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. ఇటీవల ఈమె పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవ్వడంతో ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. సాయి పల్లవి ప్రస్తుతం రామాయణ సినిమాతో పాటు ధనుష్ సినిమాలో కూడా నటిస్తున్నారు. అలాగే ఎమ్మెస్ సుబ్బలక్ష్మి బయోపిక్ సినిమాలో కూడా ఈమె ఎంపిక అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో సాయి పల్లవి కెరియర్ పరంగా తీరిక లేకుండా గడుపుతున్నారు. మరి కల్కి సినిమాలో సాయి పల్లవి దాదాపు కన్ఫామ్ అయ్యారని ఈమె నటించబోతున్నట్లు చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Also Read; Divi vadthya: ఆ హీరో అంటే పెళ్లి చేసుకునే అంత పిచ్చి.. బిగ్ బాస్ దివి హాట్ కామెంట్స్!

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×