BigTV English

Sai Pallavi: ఏది ఇప్పుడు చెప్పండ్రా.. సాయిపల్లవి బికినీ వేసుకుందని..

Sai Pallavi: ఏది ఇప్పుడు చెప్పండ్రా.. సాయిపల్లవి బికినీ వేసుకుందని..

Sai Pallavi: టెక్నాలజీ పెరుగుతుంది అని ఆనందపడాలో.. దానివలన చాలామంది పరువు రోడ్డున పడుతుందని బాధపడాలో అర్ధం కానీ స్థితిలో ఉన్నారు చాలామంది. ఈ మధ్యకాలంలో ఏది రియలో.. ఏది ఏఐ నో తెలియడం లేదు. ముఖ్యంగా ఈ ఏఐ టెక్నాలజీ వచ్చాకా.. మనుషులు.. అది మేము కాదు ఏఐ అని చెప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.


ఈ మధ్యనే హీరోయిన్ సాయిపల్లవి బికినీ వేసుకొని బీచ్ లో తిరిగిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. పద్దతిగా కనిపించే సాయిపల్లవి.. సడెన్ గా బికినీలో కనిపించేసరికి ఇండస్ట్రీ మొత్తం షేక్ అయ్యిపోయింది. వామ్మో.. వామ్మో సాయిపల్లవి బికినీలు వేసుకుంటుందా.. సినిమాల్లో ఎంత పద్దతిగా కనిపించేది. ఇదా ఆమె అసలు స్వరూపం. ఇలాంటి ఆమేనా.. సీతగా రామాయణం లో తీసుకున్నారు. సాయిపల్లవిని ఆ సినిమా నుంచి తప్పించాలి. ఆ సినిమాను బ్యాన్ చేయాలి. అసలు సాయిపల్లవినే బ్యాన్ చేయాలి అంటూ ఎన్ని ట్రోల్స్ వచ్చాయో అందరికీ తెల్సిందే.

అసలు బికినీలో ఉన్న సాయిపల్లవి నిజమా.. అబద్దమా..? అనేది ఎవరు కనుక్కోలేదు. ఫోటోలు కనిపించేసరికి నోటికి ఏ మాట వస్తే ఆ మాట అనేశారు. కానీ, వీటిపై సాయిపల్లవి ఒక చిన్న మాట కూడా అనలేదు. కానీ, ఆమె అభిమానులు మాత్రం ఆమెకు సపోర్ట్ గా నిలిచారు. అది సాయిపల్లవి కాదని, అవి ఫేక్ ఫొటోస్ అని తేల్చి చెప్పారు.


ఇక ఎట్టకేలకు సాయిపల్లవి  తన ఫేక్ ఫోటోలపై స్పందించింది. ఆ  వెకేషన్ తాలూకు పూర్తి వీడియోను షేర్ చేస్తూ..అందులో తాను ఎలాంటి బికినీ వేసుకోలేదని రుజువు చేసింది. కుటుంబంతో సహా ఆమె ఆ వెకేషన్ లో పాల్గొనడం ఆ వీడియోలో కనిపిస్తుంది. సాయిపల్లవి, ఆమె చెల్లి పూజా కన్నన్ ఇద్దరూ బీచ్ ఒడ్డున జలకాలాడుతూ కనిపించారు కానీ, ఎక్కడా సాయిపల్లవి బికినీలో కనిపించలేదు.

ఇక ఈ వీడియోకు క్యాప్షన్ గా ఇది రియల్ వీడియో.. ఏఐ జనరేట్ చేసింది కాదు అని చెప్పుకొచ్చింది. ఇక దీంతో బికినీ వేసుకొని తిరుగుతుంది అని ట్రోల్ చేసినవారికి చెప్పు దెబ్బ కొట్టినట్లు అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.  అభిమానులు సైతం.. మేము ఎప్పుడు మీకు సపోర్ట్ గానే ఉంటాం సాయిపల్లవి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సాయిపల్లవి కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం హిందీలో రెండు సినిమాలు చేస్తుంది. ఇవి కాకుండా మరో రెండు సినిమాలు త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్నాయి. మరి ఈ సినిమాలతో సాయిపల్లవి ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

Emraan hashmi: ప్రేమకథతో రాబోతున్న మీ ఓమీ.. రిలీజ్ ఎప్పుడంటే?

Puri – Sethupathi: పూరి – సేతుపతి మూవీకి వెరైటీ టైటిల్… అసలు ఈ థాట్ ఎలా వచ్చిందో ?

Lokah: Chapter 2: ‘లోకా’ పార్ట్‌ 2 అప్‌డేట్‌ వచ్చేసింది.. సూపర్‌ హీరోగా దుల్కర్‌, విలన్‌గా టోవినో థామస్‌!

Devara 2: దేవర 2 వున్నట్టే.. మరి సెట్ పైకి వెళ్ళేదెప్పుడు ?

Allu Arjun: ఏం బన్నీ.. ఓజీ చూడడమేనా.. రివ్యూ ఇచ్చేదేమైనా ఉందా.. ?

OG Child Artist: ఓజీ కూతురు బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా.. ఆదాయం కూడా అదే రేంజ్‌లో!

Ameesha Patel: ఆ హీరో ఒప్పుకుంటే.. ఒక రాత్రి గడపాలని ఉంది

Big Stories

×