Trump Tariff: ట్రంప్ బ్లైండ్‌గా ఒకటి ఫిక్సైనట్లు కనిపిస్తోంది. అమెరికాను నష్టం చేస్తున్నారు.. ఇప్పుడు అది కుదరదు.. టారిఫ్ లు బాదేస్తామంటూ రోజుకో బాంబు వేస్తున్నాడు. ఇప్పుడు ఫార్మా సహా ఇతర ప్రొడక్ట్స్ ను టార్గెట్ చేశాడు. బ్రాండెడ్, పేటెంట్ మెడిసిన్స్ పై అక్టోబర్ 1 నుంచి వంద శాతం టారిఫ్ లు వేస్తానని ప్రకటించారు. జాతీయ భద్రత పేరు చెప్పి కథ మార్చేస్తున్నారు.
ఫార్మా ఉత్పత్తులపై 100 శాతం టారిఫ్‌లు
ఇన్నాళ్లూ ఒకెత్తు అయితే ఈసారి ఫార్మా దిగుమతులపై భారీగా టారిఫ్‌లు విధించడం మరో ఎత్తుగా మారింది. వీటితో పాటే ఫర్నిచర్, ట్రక్కులు, కిచెన్ ఉపకరణాలపైనా బాదేశారు. బ్రాండెడ్, పేటెంటెడ్ మెడిసిన్స్ పై ఏకంగా 100 శాతం దిగుమతి సుంకాలు వేసేశారు. కిచెన్ క్యాబినెట్, బాత్‌రూమ్ పరికరాలపై 50శాతం, ఫర్నిచర్‌పై 30శాతం, భారీ ట్రక్కులపై 25శాతం టారిఫ్‌లు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సుంకాలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయన్నాడు. జాతీయ భద్రతతో పాటు ఇతర కారణాల పేరు చెప్పి ఈ టారిఫ్‌లు విధిస్తున్నట్లు ట్రంప్ అన్నారు. అయితే అమెరికాలో ప్లాంట్‌లను నిర్మిస్తున్న విదేశీ ఫార్మా కంపెనీలకు ఈ సుంకాలు వర్తించవన్నారు. అంటే ఫైనల్ గా అమెరికాలోనే తయారు చేయాలి. అక్కడే అమ్ముకోవాలి. ఇదీ ట్రంప్ టార్గెట్. కానీ అన్నిటికీ అదే వర్కవుట్ అవుతుందా. ఒక దేశం అవసరాలు మరొకరికి ఉంటాయి. ఈ లాజిక్ మర్చిపోతున్నారెందుకు?
అమెరికాలో డబుల్ ఛార్జ్ చేస్తున్నారన్న ట్రంప్
అమెరికాలో మెడిసిన్స్ రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి.. డ్రగ్ కంపెనీలు విదేశాలలో తక్కువ ధరలకు అమ్ముతున్నాయి, కానీ అమెరికాలో డబుల్ ఛార్జ్ చేస్తున్నారన్నది ట్రంప్ మాట. అమెరికాలో తాము ఖరీదైన మెడిసిన్స్ కొంటున్నామని, ఇండియా, చైనా వంటి దేశాల నుండి వచ్చే డ్రగ్స్ మా పొరుగు దేశాల్లో 50% లేదా 60% తక్కువ ధరకే అమ్ముతున్నారంటున్నారు ట్రంప్. ఇది అన్యాయమని వాదిస్తున్నారు. ఫార్మాస్యూటికల్ ఇంపోర్ట్‌లపై 100% టారిఫ్‌లు వేస్తే.. కంపెనీలన్నీ అమెరికాలోనే ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసుకునేలా ఒత్తిడి పెరుగుతుంది. అది అమెరికాకే మేలు చేస్తుందన్న లెక్కల్ని ట్రంప్ వేసుకుంటున్నారు. ట్రంప్ చేసిన టారిఫ్ బాంబ్ తో ప్రపంచవ్యాప్తంగా ఫార్మా కంపెనీల స్టాక్స్ షేక్ అయ్యాయి.
80% జెనరిక్ డ్రగ్స్ ఇండియా, చైనా నుంచే
ప్రస్తుతం అమెరికా మార్కెట్‌లో 80% జెనరిక్ డ్రగ్స్ ఇండియా, చైనా నుండి వస్తున్నాయి. 100% టారిఫ్ అంటే, ఇంపోర్ట్ ధర డబుల్ అవుతుంది. కానీ దీర్ఘకాలంలో అమెరికాలో ఉద్యోగాలు పెరుగుతాయి, ధరలు అదుపులోకి వస్తాయని ట్రంప్ అనుకుంటున్నారు. ఇది మాత్రమే కాదు, తాము ఇన్సూరెన్స్ కంపెనీలు, ఫార్మా లాబీల పని కూడా చూస్తామని, వారు తమ ప్రజలను దోచుకుంటున్నారన్నారు ట్రంప్. ఇదంతా ట్రేడ్ వార్ లో భాగమని, అయితే తామే గెలుస్తాం.. అమెరికా ఫస్ట్ అంటున్నారు. ట్రంప్ వాదన ఏంటంటే.. అమెరికాలో ఒక మందు 100 డాలర్లైతే, కెనడా లేదా ఇండియాలో 40-50 డాలర్లు మాత్రమే ఉంటోందన్నాడు. 100% టారిఫ్ అంటే, ఇంపోర్టెడ్ డ్రగ్స్ ధర డబుల్ అవుతుంది. దీనివల్ల ఫార్మా కంపెనీలు ప్రత్యేకించి ఇండియన్ జెనరిక్ మేకర్స్ లాంటివిఅమెరికాలో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయాల్సి వస్తుంది.
అమెరికాకు 40% జెనరిక్ డ్రగ్స్ ఇండియా సప్లై
ఇది ట్రంప్ 2016-2020 టర్మ్‌లో చైనా స్టీల్ అల్యూమినియంపై విధించిన 25-50% టారిఫ్‌లకు సమానం. ట్రంప్ ప్రస్తుత చర్యతో అమెరికన్ కన్జ్యూమర్లకు వెంటనే ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే ఇంపోర్ట్ డ్యూటీ పెరిగితే ఆ డబ్బులు చెల్లించి కంపెనీలు కొనాలి. కానీ లాంగ్-టర్మ్‌లో USలో 1-2 లక్షల ఉద్యోగాలు సృష్టించవచ్చంటున్నారు. ఇండియా అమెరికాకు 40% జెనరిక్ డ్రగ్స్ సరఫరా చేస్తుంది. 100% టారిఫ్ వల్ల ఇండియన్ ఎక్స్‌పోర్ట్‌లకు 10-15 బిలియన్ డాలర్లు ఎఫెక్ట్ అవుతాయంటున్నారు. నిజానికి ఇది అన్యాయమే. ఎందుకంటే అమెరికాతో గతంలో ఉన్న వాణిజ్యాల ప్రకారమే ఇలా ఎగుమతులు దిగుమతులు జరుగుతున్నాయి. ఇవాళ కొత్తగా వచ్చినవి కావు. అయితే ట్రంప్ నేషనల్ సెక్యూరిటీ క్లాజ్ అస్త్రాన్నే ప్రతిసారి వాడుతూ కోర్టుల్లో నిలబడకుండా చేసుకుంటున్నారు. ఈ ఎఫెక్ట్ తో అంటే ఎక్స్‌పోర్ట్ డిమాండ్ తగ్గడం వల్ల ఇండియన్ మార్కెట్‌లో మెడిసిన్స్ ధరలు తగ్గే అవకాశం ఉంది.
ట్రంప్ చర్యలతో USలో ఫార్మా మాన్యుఫాక్చరింగ్ పెరుగుతుందనుకుంటున్నారు. యాక్టివ్ ఫార్మా ఇన్ గ్రెడియెంట్స్ తో సహా మందులు తయారు చేసే సిచ్యువేషన్ పెరుగుతుందని, పేషెంట్స్‌కు లాంగ్-టర్మ్‌లో చౌక ధరలకే మందులు దొరుకుతాయంటున్నారు. 100 శాతం టారిఫ్ లతో ఔషధ ధరలు 20-30% పెరిగి, లో-ఇన్‌కమ్ అమెరికన్లకు సమస్య అవుతుంది. ఫార్మా ఇంపోర్ట్స్ పై అక్టోబర్ 1 నుంచి ట్రంప్ వేసిన 100 శాతం సుంకాల ఎఫెక్ట్ ఇండిన్య ఫార్మా ఇండస్ట్రీపై ఎంత వరకు ఉండే ఛాన్స్ ఉంది. మన ఫార్మా రంగ నిపుణులు ఏమంటున్నారు? ఎలాంటి మెడిసిన్స్ పై ఎఫెక్ట్ పడొచ్చు. అమెరికాకు షిఫ్ట్ అయితేనే టారిఫ్ లు తప్పించుకోవచ్చా? ఏం జరగబోతోంది?
జెనరిక్ మెడిసిన్స్‌కు మినహాయింపు
ఫార్మా ఇంపోర్ట్స్ పై డొనాల్డ్ ట్రంప్ విధించిన 100 శాతం సుంకాల ఎఫెక్ట్ భారత ఔషధ కంపెనీలపై పెద్దగా ఉండబోదని ఫార్మా ఇండస్ట్రీ వర్గాలు అంటున్నారు. ఇక్కడి కంపెనీలు అమెరికాకు జనరిక్ మెడిసిన్‌ను మాత్రమే ఎగుమతి చేస్తున్నాయని ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ అంటోంది. పేటెంట్, బ్రాండెడ్ మెడిసిన్స్ దిగుమతులకు మాత్రమే టారిఫ్‌లు వర్తిస్తాయని దీంతో పెద్దగా నష్టం లేదంటున్నారు. అమెరికాలో తయారీ ప్లాంట్ పెట్టే వారికి మినహాయింపు ఉంటుందన్నారు ట్రంప్. టారిఫ్ లు తప్పించుకునేందుకు ఇప్పటికిప్పుడు అమెరికాలో ఫార్మా పరిశ్రమలు పెట్టే పరిస్థితి లేదు. పైగా అక్కడ పొల్యూషన్ రూల్స్ బాగా స్ట్రిక్ట్ గా ఉంటాయి. ఆ స్థాయి మెయింటెనెన్స్ వివిధ దేశాల నుంచి తరలి వెళ్లే కంపెనీలు చేస్తాయా అన్న ప్రశ్నలున్నాయి. ఇప్పటికే పరిశ్రమ పనులు మొదలుపెట్టినవారు లేదా పనులు కొనసాగుతున్న కంపెనీలకు మినహాయింపు ఉంటుందని ట్రంప్ అంటున్నారు. భారత్, చైనా, యూరప్ కు చెందిన ఫార్మా స్టాక్స్ పై ట్రంప్ ప్రకటన ప్రభావం పడింది. చాలా ఫార్మా స్టాక్స్ పడిపోయాయి కూడా. నిజానికి అమెరికా మెడిసిన్స్ అవసరాల్లో డాక్టర్ రెడ్డీస్, సన్‌ఫార్మా, లుపిన్, జైడస్ లైఫ్‌సైన్సెస్ వంటి 23 ప్రధాన ఫార్మా కంపెనీలు రియాక్ట్ అయ్యాయి. భారత్ నుంచి ఎగుమతి అయ్యేవాటిలో 80 శాతం, దేశీయంగా 64 శాతం ఔషధ అవసరాలను ఈ సంస్థలే తీరుస్తున్నాయి.
భారత ఫార్మా ఉత్పత్తులకు US పెద్ద మార్కెట్
భారత ఫార్మా ఉత్పత్తుల ఎక్స్ పోర్ట్స్ కు అమెరికా అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ మొత్తంగా 27.9 బిలియన్ డాలర్ల విలువైన ఫార్మా ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసింది. ఇందులో 31 శాతం అంటే.. దాదాపు 8.7 బిలియన్ డాలర్ల విలువైన మెడిసిన్స్ అమెరికాకే వెళ్లాయి. అమెరికాలో ఉపయోగించే జనరిక్ మెడిసిన్స్ లో 45శాతం, బయోసిమిలర్ ఔషధాల్లో 15శాతం భారత్ సప్లై చేసినవే. డాక్టర్ రెడ్డీస్, అరబిందో ఫార్మా, జైడస్, సన్‌ఫార్మా, గ్లాండ్ ఫార్మా వంటి సంస్థల మొత్తం ఆదాయంలో 30-50శాతం అమెరికా మార్కెట్ నుంచే వస్తున్నాయి. ఇప్పుడు ట్రంప్ విధించిన టారిఫ్‌లతో అమెరికా మార్కెట్‌లో ఈ మెడిసిన్స్ రేట్లు డబుల్ అవుతాయి. మరి వీటిని అమెరికన్లు కొనే పరిస్థితి ఉంటుందా? ఇప్పటికిప్పుడు తక్కువ రేటుకు మందులు ఇచ్చే కంపెనీలు, దేశాలు అమెరికాకు అసలు దొరుకుతాయా.. ఇవన్నీ ట్రంప్ ఆలోచించుకున్నారా అన్న ప్రశ్నలైతే అమెరికన్ల నుంచే వస్తున్నాయి.
అమెరికాలో ఇప్పటికే భారత తయారీ యూనిట్లు
నిజానికి తక్కువ ధరలో క్వాలిటీ మెడిసిన్స్ ను భారత ఫార్మా కంపెనీలు కొన్నేళ్లుగా విదేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. అమెరికాకు అవసరమయ్యే 47 శాతం ఔషధ అవసరాలను భారత కంపెనీలే తీరుస్తున్నాయి. ట్రంప్ ప్రతిపాదించిన 100 సుంకాలు కేవలం బ్రాండెడ్, పేటెంట్ ఉన్న వాటికే వర్తిస్తాయంటున్నా.. ఇప్పటికిప్పుడు భారత ఎగుమతులపై ప్రభావం ఉండబోదంటున్నారు. అమెరికాకు ఎగుమతయ్యేవి జనరిక్ మెడిసిన్సే అని గుర్తు చేస్తున్నారు. ఇప్పటికే భారత కంపెనీలు అమెరికాలో తయారీ యూనిట్లు, రీప్యాకింగ్ యూనిట్లు నెలకొల్పాయి కూడా. అయితే ప్రస్తుతం ప్రతికూల పరిస్థితులకు తగ్గట్లు స్ట్రాటజీస్ రూపొందించుకోవాల్సిన అవసరం ఏర్పడిందని ఫార్మా ఇండస్ట్రీ నిపుణులు అంటున్నారు. విధాన నిర్ణయాల్లో ఏవైనా మార్పులు జరిగితే ఆ తీవ్రత తగ్గించుకునేందుకు రెడీగా ఉండాలంటున్నారు.
Also Read: ఏపీ శాసన మండలిలో వైసీపీ సభ్యుల నిరసన
నిజానికి భారత్ నుంచి దిగుమతయ్యే మెడిసిన్స్ వల్ల అమెరికా వైద్యం రంగానికి పెద్ద మొత్తంలో ఖర్చు తయారీ భారం తగ్గుతోంది. ఒక్క 2022లోనే 219 బిలియన్ డాలర్ల మేర ఆదా చేసుకున్నాయి. 2013 నుంచి 2022 వరకు చూస్తే ఈ మొత్తం 1.3 ట్రిలియన్ డాలర్ల మేర ఉంటుందంటున్నారు. ఇలాంటి బెనిఫిట్ ను పక్కన పెట్టి.. ఇదేదో అమెరికాకు రాత్రికి రాత్రే ఇబ్బంది అని ట్రంప్ సీన్ క్రియేట్ చేయడం ఏంటన్నదే కీలకంగా మారుతోంది. ఇప్పటికే రష్యా ఆయిల్ కొంటున్నామన్న కారణంతో భారత్‌పై ట్రంప్ 50శాతం సుంకాలు విధించారు. ఈ ఇష్యూపై రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయి కూడా. ఇలాంటి టైంలో ట్రంప్ తాజాగా ఫార్మా ఉత్పత్తులపై టారిఫ్‌లు విధించడం మరింత గందరగోళానికి దారితీస్తోంది.
Story By Vidya Sagar, Bigtv