Garividi Lakshmi Movie: ఇటీవల కాలంలో బయోపిక్ సినిమాలకు చాలా మంచి ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘గరివిడి లక్ష్మి'(Garividi lakshmi)సినిమా కూడా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఒకానొక సమయంలో బుర్రకథలకు చాలా మంచి ప్రాధాన్యత ఉండేది కానీ కాలానికి అనుగుణంగా బుర్రకథలు కూడా కనుమరుగవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖ బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి కథ ఆధారంగా బుర్రకథల ప్రాధాన్యతను తెలియజేస్తూ గరివిడి లక్ష్మి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
ఇలా గరివిడి లక్ష్మి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ బయోపిక్ సినిమాలో సినీనటి ఆనంది (Aanandi) నటించి సందడి చేశారు. గరివిడి లక్ష్మి పాత్రలో ఈమె ఎంతో అద్భుతంగా నటించడమే కాకుండా తన నటనకు పెద్ద ఎత్తున ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ సినిమాకు ఎంతో మంచి ఆదరణ లభించిన నేపథ్యంలో చిత్ర బృందం సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా డైరెక్టర్ గౌరీ నాయుడు జమ్మూ (Gowri Naidu Jammu) ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.
తాము గరివిడి లక్ష్మి బయోపిక్ సినిమా చేయాలనుకున్న సమయంలో ఆనంది కంటే ముందుగా కొంతమంది హీరోయిన్లను సంప్రదించామని అయితే వాళ్లు రిజెక్ట్ చేయడంతోనే ఆనంది ఈ సినిమాకు ఎంపిక అయ్యారని తెలిపారు. ఇక ఆ హీరోయిన్స్ ఎవరనే విషయాన్ని కూడా డైరెక్టర్ గౌరీ నాయుడు తెలిపారు. ఈ సినిమా కథతో ముందుగా సినీనటి సాయి పల్లవి(Sai Pallavi)ని సంప్రదించాము. ఆమె ఈ సినిమాని రిజెక్ట్ చేయడంతో తదుపరి నివేద థామస్(Nevetha Thomas) అలాగే నిత్యామీనన్ (Nithya Menon) కు కూడా ఈ సినిమా కథ వివరించామని తెలిపారు. వీరందరూ కూడా తమ వ్యక్తిగత కారణాలవల్లే ఈ సినిమాని రిజెక్ట్ చేశారని డైరెక్టర్ తెలిపారు.
ఈ ముగ్గురు గరివిడి లక్ష్మి సినిమాని రిజెక్ట్ చేయడంతో తిరిగి తాము నటి ఆనందిని సంప్రదించామని ఈ కథ విన్న వెంటనే ఆమె సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిపారు. ఇకపోతే గరివిడి లక్ష్మి సినిమా చేయడానికి గల కారణాన్ని కూడా ఆనంది ఒక సందర్భంలో తెలియచేశారు. గరివిడి లక్ష్మి లాంటి ఒక గొప్ప కళాకారిణి గురించి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో తాను ఈ బయోపిక్ సినిమాలో నటించానని ఈమె తెలిపారు. ఏది ఏమైనా గరివిడి లక్ష్మి సినిమాకు కమిట్ అయిన ఆనంది సూపర్ సక్సెస్ అందుకోగా ఈ సినిమాలను రిజెక్ట్ చేసిన హీరోయిన్స్ మాత్రం అన్ లక్కీ అని చెప్పాలి. ప్రస్తుతం సాయి పల్లవి వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండటంవల్లే ఈ సినిమాని రిజెక్ట్ చేసి ఉండొచ్చు కానీ నిత్యమీనన్ నివేత థామస్ ఏ కారణాల చేత రిజెక్ట్ చేశారనేది తెలియాల్సి ఉంది.
Also Read: వెంకీ ‘ఆదర్శ కుటుంబం’ రన్ టైం లాక్.. కీలక సన్నివేశాలు డిలీట్ చేసిన గురూజీ!