Aadarsha Kutumbham Run Time: విక్టరీ వెంకటేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తాజా చిత్రం ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47(Aadarsha Kutumbham House No 47). కుటుంబ కథ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 30 వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కారణంగా ఆలస్యం అవుతూ వస్తుంది. ఇలా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నింటినీ పూర్తి చేసుకుని అక్టోబర్ 30 వ తేదీ విడుదలకు సిద్ధమైంది. ఇక విడుదలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి.
ఆదర్శ కుటుంబం సినిమా రన్ టైం కూడ లాక్ చేశారని తెలుస్తోంది. ముందుగా ఈ సినిమాకు 2:37 నిమిషాల రన్ టైం(Run Time) లాక్ చేశారు కానీ ఈ సినిమా రీ ఎడిట్ చేసి రన్ టైం తగ్గించారని తెలుస్తోంది. దాదాపు 22 నిమిషాల రీ ఎడిట్ చేసిన అనంతరం బెటర్ ఔట్పుట్ తీసుకువచ్చారని తెలుస్తోంది. అదే విధంగా ఈ సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ కి సంబంధించి సుమారు 12 నిమిషాలు డిలీట్ చేశారట . ఇలా ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను కూడా డిలీట్ చేస్తూ ఈ సినిమా రన్ టైమ్ 2:22 నిమిషాలు లాక్ చేశారని తెలుస్తోంది.
ఇలా ఈ సినిమా రన్ టైం కి సంబంధించిన ఈ న్యూస్ వైరల్ గా మారడంతో 2:22 నిమిషాలు అంటే మంచిగనే ఈ సినిమా నిడివి ఉందంటూ అభిమానులు కూడా భావిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా విడుదలకు కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది కానీ సినిమాపై ఏమాత్రం బజ్ లేదని చెప్పాలి. వెంకటేష్ లాంటి స్టార్ హీరో సినిమా అయినప్పటికీ ఏమాత్రం బజ్ లేకపోతే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం కష్టమని చెప్పాలి. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రెండు పాటలను విడుదల చేశారు కానీ ఈ పాటలు మాత్రం అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఇక నేడు సినిమా నుంచిట్రైలర్ వీడియో విడుదల కానుంది.
ఈ ట్రైలర్ వీడియో పైనే అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ట్రైలర్ వీడియో సరైన విధంగా కట్ చేసి సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేయాలని కోరుకుంటున్నారు. ఈ ట్రైలర్ వీడియో కోసం అభిమానులు కూడా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక వెంకటేష్ ఇటీవల కాలంలో నటిస్తున్న సినిమాలన్నీ కూడా ప్రేక్షకులను మంచిగా ఆకట్టుకోవడంతో మంచి సక్సెస్ అందుకుంటున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు ఉన్నాయి కానీ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ మాత్రం ప్రేక్షకులను నిరాశకు గురి చేస్తున్నాయి. మొదటిసారి గురూజీ డైరెక్షన్లో వెంకీ మామ నటించిన ఈ సినిమా ఏ విధమైనటువంటి సక్సెస్ అందుకుంటుందనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో వెంకటేష్ జోడిగా శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) హీరోయిన్ గా నటించారు.
Also Read: ప్రభాస్ కు బర్త్ డే విషెస్ చెప్పిన మారుతి.. వార్నింగ్లు ఇస్తున్న ఫ్యాన్స్