E-Paper
Advertisement

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?
Advertisement

Sumanth Prabhas: రాజు వెడ్స్ రాంబాయ్ ..అఖిల్ రాజ్,తేజస్వి రావ్ జంటగా వచ్చిన ఈ చిన్న సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పక్కర్లేదు.అలాంటి సూపర్ హిట్ సినిమాని అందించిన దర్శకుడు సాయిలు కాంపాటి మరో సినిమాని మొదలెట్టేశాడు.అవును శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి (SVCLLP) బ్యానర్ తమ ప్రొడక్షన్ నెం. 10గా నిర్మిస్తున్న ఈ సినిమా చాలా గ్రాండ్ గా లాంచ్ అయింది.సికింద్రాబాద్ లోని ప్రముఖ గణేష్ టెంపుల్‌లో చిత్ర యూనిట్ మరియు సినీ వర్గాల సమక్షంలో అత్యంత వైభవంగా ఈ ముహుర్త కార్యక్రమాలు
జరిగాయి.

ఇక ఈ సినిమాలో ‘మేమ్ ఫేమస్’సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న సుమంత్ ప్రభాస్ హీరోగా నటిస్తుండం విశేషం. ఇక ఈ ముహూర్తపు వేడుకకి పలువురు సినీ ప్రముఖులు హాజరై చిత్ర బృందానికి తమ శుభాకాంక్షలు తెలియజేశారు. వేడుకలో భాగంగా సదానంద్ దర్శక నిర్మాతలకు స్క్రిప్ట్‌ను అందజేయగా, దర్శకుడు శేఖర్ కమ్ముల కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అటు వర్సటైల్ యంగ్ హీరో అడివి శేష్ ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టడం ఇక్కడ విశేషం.ఇక మొదటి షాట్‌ను దర్శకుడు సాయిలు కాంపాటి స్వయంగా డైరెక్ట్ చేసి సినిమాని అఫీషియల్ గా మొదలెట్టాడు.

Advertisement

టౌన్ బ్యాక్‌డ్రాప్‌లో స్వచ్ఛమైన ప్రేమకథ

ఒక చిన్న టౌన్ బ్యాక్‌డ్రాప్‌లో స్వచ్ఛమైన ప్రేమకథగా దీన్ని తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తుంది .దులో హీరో సుమంత్ ప్రభాస్ పాత్ర చాలా సందడిగా, అల్లరిగా, పూర్తి వినోదాత్మకంగా ఉండబోతోందని ఇన్ సైడ్ టాక్. ‘మేమ్ ఫేమస్’ లో సుమంత్ చూపించిన యూత్‌ఫుల్ ఎనర్జీకి ఈ చిన్న టౌన్ లవ్ స్టోరీ తోడైతే థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయడం ఖాయమనే చెప్పాలి.ఇక ఇదే హీరో సందీప్ రెడ్డి  వంగా ప్రొడక్షన్ లో రోమాంచకం అనే మరో మూవీ చేస్తున్న సంగతి తెల్సిందే.

Advertisement

ఇక ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతుండగా, త్వరలోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని,ఇందులో నటించబోయే నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేస్తామని తెలిపారు మేకర్స్.

ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తాడో !

ఇదిలా ఉంటే, గతంలో ‘లవ్ స్టోరీ’, ధనుష్’కుబేర ‘ వంటి సూపర్ హిట్ సినిమాలని అందించిన శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై ఇలాంటి చిన్న సినిమా రావడం కాస్త ఆసక్తికరమనే చెప్పాలి.ఇక తమ ప్రొడక్షన్ ట్రాక్ రికార్డ్ తగ్గట్టుగానే ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తుందని కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశారు నిర్మాతలు శ్రీ పుష్కూర్ రామ్మోహన్ రావు, శ్రీ భరత్ నారంగ్.

also read:హైదరాబాద్‌లో ‘ఒడిస్సీ’ మూవీని ఎంజాయ్ చేయడానికి పెర్ఫెక్ట్ థియేటర్లు ఇవే, స్క్రీన్.. సౌండ్ అదుర్స్!

చూడాలి మరి రాజు వెడ్స్ రాంబాయ్ అంటూ తొలి సినిమాతోనే సత్తా చాటిన సాయిల్ రెండో సినిమాతో ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తాడో !

Related News

రాకాను వెంటాడుతున్న వరుస లీకులు.. కథ మొత్తం లీక్ చేసేస్తారా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘కృష్ణంభజే’ నుండి ఫస్ట్ లుక్ లాంఛ్ !

సంక్రాంతి రేస్ నుంచి చిరంజీవి ‘కాకా’ ఔట్? నిజమేనా?

ఇరుముడి సినిమాకు భారీ షాక్…ప్రొజెక్టర్ ద్వారా వీధుల్లో ప్రదర్శనలు!

భార్యను కలవబోతున్న సీఎం విజయ్…త్రిష సైడ్ అవ్వాల్సిందేనా?

రజినీ జైలర్ 2 కథ ఇదేనా? ఈసారి టార్గెట్ ఎవరో తెలిస్తే షాక్!

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

Big Stories

Advertisement
×