Odyssey Theaters:’ ఒడిస్సీ’..గత మూడు రోజులుగా ప్రపంచం మొత్తాన్ని షేక్ చేస్తున్న సినిమా.ఏకంగా మూడురోజుల్లోనే 2,700 కోట్ల పై చిలుకు కొల్లగొట్టింది.అలాంటి సినిమాని చూడాలనే ఆశ ఎవరికుండదు.అలా అని ఇలాంటి సినిమాలని టికెట్ దొరికిన ప్రతీ థియేటర్ లో చూడలేమండోయ్.పర్టిక్యులర్ గా ఇలాంటి సినిమాలకి థియేటర్ ల ఎంపిక కూడా చాలా ముఖ్యం.ఎందుకంటే ఈ సినిమా షూట్ చేసింది IMAX కెమెరాలతో కాబట్టి.ఇలాంటి హై ఎండ్ అడ్వాన్స్డ్ కెమెరాలతో షూట్ చేసిన సినిమాలని మామూలు థియేటర్ లో చూస్తే దాని తాలూకు మజా మిస్ అయిపోతాం.కాబట్టి ఎదో ఊరికే పెద్ద స్క్రీన్ ఉంటే సరిపోదు, ఆ స్క్రీన్ ‘ఎత్తు’ ఎంత ఉందనేదే ఇక్కడ అసలు ప్రశ్న.
నార్మల్ థియేటర్స్ అయితే మ్యాజిక్ మిస్
మాములుగా మనం థియేటర్ లోకి స్క్రీన్ ఎంత వెడల్పుగా ఉందా అనే చూస్తాం.కానీ IMAX కెమెరాలతో షూట్ చేసిన విజువల్స్ వెడల్పుతో పాటు పొడవుగా అదే రేంజ్ లో ఉంటాయి.అందు చేత ఇలాంటి సినిమాలని మామూలు థియేటర్లో చూస్తే నార్మల్ సినిమాస్కోప్ స్క్రీన్‌పైచూస్తే పైకి,కిందికి నల్లని చారలు పడటమో,లేక పైనా, కిందా ఉన్న విజువల్ కట్ అయి,క్రాప్ అయిన విజువల్ మాత్రమే మనకు కనబడటమో జరుగుతుంది.అంటే ఇలాంటి కెమెరాలతో షూట్ చేసిన డైరెక్టర్ ఏ విజువల్ ని అయితే మనకి అందించాలని అనుకుంటాడో ఆ గ్రాండియర్ ని మనం ఎక్స్పీరియన్స్ చేయలేకపోతామన్న మాట.అందుకే ఇలాంటి సినిమాల్లో ప్రతీ ఫ్రేమ్‌ను మిస్ అవ్వకుండా చూడాలంటే మాత్రం స్క్రీన్ నిలువు ఎత్తు ఎక్కువగా ఉన్న థియేటర్లనే పిక్ చేసుకోవాలి.అప్పుడు కాని మనం ఆ సినిమా అనుభూతిని పొందలేము.మరి హైదరాబాద్‌లో ఇలాంటి సినిమాల్ని చూసేందుకు అనువుగా ఉన్న ఈ థియేటర్లు ఏంటో ఒకసారి చూసేద్దాం.
ఏ ఏ థియేటర్స్ లో చూడొచ్చంటే …
హైదరాబాద్ లో ఉండే సినిమా ప్రేమికులకి ఇలాంటి థియేటర్ లలో బెస్ట్ చాయిస్ గా చెప్పుకోవాలంటే ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లోని ప్రసాద్స్ PCX (స్క్రీన్ 6) నే చెప్పుకోవాలి.ఎందుకంటారా ఈ స్క్రీన్ ఏకంగా 64 అడుగులఎత్తుతో ఉంటుంది మరి.ఇక ఈ స్క్రీన్ పై గనుక నోలన్ మావ తీసిన ‘ ఒడిస్సీ’చూస్తే మాత్రం మనం థియేటర్ లో ఉన్నామా లేక ఆ సీన్ జరుగుతున్న ప్రదేశంలో ఉన్నామా అని డౌట్ రావడం సహజం.ఎందుకంటే ఈ స్క్రీన్ కోసం వాడిన హై ఎండ్ ప్రొజెక్షన్ సిస్టమ్ సినిమాలోని ప్రతీ డీటైల్ ని మన కళ్ళ ముందు పరిచేస్తుంది మరి.
హైటెక్ సిటీ ఇన్ఆర్బిట్ మాల్ లోని PVR PXL
ఒకవేళ గనుక మీకు ఆ ప్రసాద్స్ PCX లో టికెట్లు దొరకడం కష్టమైతే, మీ నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్స్ హైటెక్ సిటీ ఇన్ఆర్బిట్ మాల్ లోని PVR PXL అని చెప్పాల్సిందే.అయితే ఇది ప్రసాద్స్ PCX కన్నా కాస్త స్పెషల్ అని చెప్పుకోవాలి.ఎందుకంటే PVR PXL స్క్రీన్,నార్మల్ థియేటర్ల కన్నా స్క్రీన్ మరింత హైట్ ఉంటూనే అద్భుతమైన డోల్బీ ఆట్మోస్ సౌండ్ సిస్టమ్ ఉంది మరి.అంటే సినిమాలో కనిపించే మైండ్ బ్లోయింగ్ విజువల్స్ తో పాటుగా సాలిడ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ అయి మనల్ని మరో లోకంలోకి తీసికెళ్ళిపోతుందన్న మాట.
గచ్చిబౌలిలోని AMB సినిమాస్ (స్క్రీన్ 1)
ఇక వీటితో పాటు మరో బెస్ట్ గా చెప్పుకోవాల్సిన థియేటర్ ఏదైనా ఉందంటే అది గచ్చిబౌలిలోని AMB సినిమాస్ (స్క్రీన్ 1). ఈ థియేటర్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇది స్క్రీన్ వెడల్పు మరియు ఎత్తులను చాలా పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేయడమే.అంటే వెడల్పు ఎక్కువగా ఉంది పొడవు తక్కువ ఉండకుండా సరిగ్గా IMAX కెమెరాలతో షూట్ చేసిన సినిమాలకి ఫర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేసి డిజైన్ చేసిన థియేటర్ ఇది.ఇక ఈ థియేటర్ లో డిజైన్ చేసిన లేజర్ ప్రొజెక్షన్ వల్ల రంగులు చాలా బ్రైట్‌గా, క్రిస్ప్‌గా కనిపిస్తాయి కూడా.
ఆంధ్రప్రదేశ్‌లోని సూళ్లూరుపేటలో బెస్ట్ EPIQ స్క్రీన్
అయితే ఇంత వేగంగా ఎదిగిన హైదరాబాద్ లో ‘V EPIQ'(EPIQ Premium Large Format)లేదన్న సంగతి మీకు తెలుసా..అవును..ఇండియాలోనే ది బెస్ట్ EPIQ స్క్రీన్ ఉన్న పట్టణం ఆంధ్రప్రదేశ్‌లోని సూళ్లూరుపేట.2019 ఆగస్టు 29న మొదలైన ఈ థియేటర్ లోని ఏకంగా 100 అడుగుల వెడల్పు, 54 అడుగుల ఎత్తు ఉండటం విశేషం.ఇది కేవలం ఇండియాలోనే కాదండోయ్…దక్షిణాసియాలోనే అతిపెద్ద సినిమా స్క్రీన్ గా గుర్తింపు పొందడం విశేషం.
సో ..హైదరాబాద్ పరిధిలో ఉంటూ అంతటి విజువల్ థ్రిల్ పొందేందుకు ప్రసాద్స్ PCX ని మించిన ప్రత్యామ్నాయం మరొకటి లేదు. కాబట్టి ‘ఒడిస్సీ’ సినిమా కోసం మీ టికెట్స్ ని ప్లాన్స్ ఇప్పటినుంచే ప్లాన్ చేసుకోండి, మీ సినిమా వాచింగ్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లండి!
also read:‘గాడ్ ఆఫ్ వార్’లో ఎన్టీఆర్‌తో నటించే హీరోయిన్ ఎవరో తెలుసా ?