E-Paper
Advertisement

Raviteja -Shiva Nirvana: రవితేజ RT 77.. రంగంలోకి స్టార్ హీరోయిన్.. ఇప్పుడైనా కలిసొచ్చేనా?

Raviteja -Shiva Nirvana: రవితేజ RT 77.. రంగంలోకి స్టార్ హీరోయిన్.. ఇప్పుడైనా కలిసొచ్చేనా?
Advertisement

Raviteja -Shiva Nirvana: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న నటుడు రవితేజ (Raviteja)హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈయన డైరెక్టర్ భాను భోగవరపు దర్శకత్వంలో నటించిన మాస్ జాతర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా విడుదలైనప్పటికీ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. వచ్చే సంక్రాంతి పండుగను పురస్కరించుకొని రవితేజ “భర్త మహాశయులకు విజ్ఞప్తి” అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

సంగీత దర్శకుడిగా అజనీష్ లోకనాథ్..

ఇక ఈ సినిమాతో పాటు ఈయన మరికొన్ని సినిమాలకు కూడా కమిట్ అయిన సంగతి తెలిసిందే. రవితేజ 77వ సినిమాని ప్రముఖ దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వంలో చేయబోతున్నట్లు ఇదివరకే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కానున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా అజనీష్ లోకనాథ్ (Ajaneesh Lokanath) వ్యవహరించబోతుండటం విశేషం. ఈయన ఇటీవల పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషనల్ సృష్టించిన కాంతారా సినిమాకు సంగీత దర్శకుడుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. తాజాగా అజనీశ్ రవితేజ సినిమాకు సంగీతం అందించబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై కూడా అంచనాలు ఏర్పడ్డాయి .

రవితేజ సినిమాలో సమంత?

Advertisement

ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరొక బిగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా వచ్చే నెల నుంచి షూటింగ్ పనులను ప్రారంభించబోతున్నారు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రముఖ నటి సమంత(Samantha) నటించబోతున్నారనే వార్త వెలుగులోకి రావడంతో రవితేజ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సమంత తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ఇటీవల వరుస సినిమాలు వెబ్ సిరీస్ లకు కమిట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే రవితేజ శివ నిర్వాణ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా కనిపించబోతున్నారని తెలుస్తోంది.

సమంత అయిన హిట్ ఇచ్చేనా?

Advertisement

ఇదివరకే సమంత డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్లో రెండు సినిమాలలో నటించారు. నాగచైతన్య సమంత హీరో హీరోయిన్లుగా శివ నిర్వాణ దర్శకత్వంలో మజిలీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. అనంతరం విజయ్ దేవరకొండతో కలిసి ఖుషీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా తర్వాత శివ తిరిగి రవితేజతో సినిమాకు కమిట్ అయ్యారు. ఈ సినిమా సక్సెస్ అనేది ఇటు రవితేజకు, డైరెక్టర్ శివకు ఎంతో కీలకంగా మారింది. ఇలా ఈ ఇద్దరికీ సమంత లక్కీ హీరోయిన్ గా మారి సక్సెస్ అందిస్తుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో సమంత నటించబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి కానీ ఇంకా అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.

Also Read: Mahesh Babu: వారణాసి ఈవెంట్ పై మహేష్ ట్వీట్… మళ్ళీ కలుద్దాం అంటూ!

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×