E-Paper
Advertisement

Mahesh Babu: వారణాసి ఈవెంట్ పై మహేష్ ట్వీట్… మళ్ళీ కలుద్దాం అంటూ!

Mahesh Babu: వారణాసి ఈవెంట్ పై మహేష్ ట్వీట్… మళ్ళీ కలుద్దాం అంటూ!
Advertisement

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ప్రస్తుతం రాజమౌళి (Rajamouli)దర్శకత్వంలో వారణాసి(Varanasi) అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. రాజమౌళి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన RRR సినిమా తర్వాత మహేష్ బాబుతో సినిమా చేయబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ విడుదల చేయలేదు కానీ ఇటీవల గ్లోబ్ ట్రాటర్ (Globe Trotter)పేరిట ఈవెంట్ నిర్వహించి సినిమాకు సంబంధించిన వరుస అప్డేట్స్ వెల్లడించారు.

మళ్లీ కలుద్దాం..

ఈ సినిమాలో మహేష్ బాబు రుద్ర పాత్రలో కనిపించబోతున్న విషయాన్ని కూడా తెలియజేశారు. ఇక ఈ వేడుక ఎంతో ఘనంగా జరిగింది. తాజాగా వారణాసి సినిమా వేడుకకు సంబంధించి మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా మహేష్ బాబు స్పందిస్తూ.. “వారణాసి సినిమా వేడుక కోసం ఎంత దూరం నుంచి వచ్చిన అభిమానులకు మీడియాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఇలా మీ ప్రేమతో మమ్మల్ని  ఆదరించినందుకు ధన్యవాదాలు త్వరలోనే మళ్లీ కలుద్దాం” అంటూ ఈయన ప్రతి ఒక్క అభిమానికి స్పెషల్ థాంక్స్ చెబుతూ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

రుద్రగా మహేష్ బాబు..

Advertisement

ఇక ఈ ట్వీట్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఈ సినిమా వేడుకకు సంబంధించిన టైటిల్ గ్లింప్ షేర్ చేశారు. ఈ సినిమా టైటిల్ రివిల్ కోసమే రాజమౌళి ఈ స్థాయిలో ఈవెంట్ ప్లాన్ చేయడంతో త్వరలో ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్, ప్రెస్ మీట్ వంటి ఎన్నో కార్యక్రమాలు మరింత ఘనంగా నిర్వహించబోతున్నారని తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో మహేష్ బాబు రుద్ర పాత్రలో  కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా వంటి తదితరులు కూడా నటించబోతున్న సంగతి తెలిసిందే.

Advertisement

పృధ్విరాజ్ కుంభ పాత్రలో కనిపించగా, ప్రియాంక చోప్రా మందాకిని పాత్రలో కనిపించబోతున్నారు ఇప్పటికే వీరిద్దరి పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా విడుదలయ్యాయి. ఇక ఈ సినిమా ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాని 2027 సమ్మర్లో విడుదల చేయబోతున్నట్లు ఈ ఈవెంట్ లో సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి వెల్లడించిన సంగతి తెలిసిందే. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా 2027 మార్చి 25వ తేదీ విడుదల చేయాలనే ఆలోచనలో రాజమౌళి ఉన్నట్టు తెలుస్తోంది. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో సినిమా చేయాలనే 15 సంవత్సరాల క్రితమే ఫిక్స్ అయ్యారు అంటూ నిర్మాత కేల్ నారాయణ కూడా ఈ కార్యక్రమంలో తెలియజేశారు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు రాముడి పాత్రలో కూడా కనిపించబోతున్నారని స్వయంగా రాజమౌళి వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇలా ఈ ఒక్క కార్యక్రమంతో సినిమాపై భారీగా అంచనాలను పెంచేశారు.

Also Read: Manchu Lakshmi: బొడ్డు కనిపించడం ఆర్ట్.. తప్పేముందన్న మంచు లక్ష్మీ!

Related News

చిరు ‘కాకా’ వాయిదా రూమర్లపై క్లారిటీ .. సంక్రాంతి పోటీకి సై అంటూ!

సౌందర్య మరణంపై స్టార్ హీరో ఎమోషనల్ కామెంట్స్!

రాకాను వెంటాడుతున్న వరుస లీకులు.. కథ మొత్తం లీక్ చేసేస్తారా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘కృష్ణంభజే’ నుండి ఫస్ట్ లుక్ లాంఛ్ !

సంక్రాంతి రేస్ నుంచి చిరంజీవి ‘కాకా’ ఔట్? నిజమేనా?

ఇరుముడి సినిమాకు భారీ షాక్…ప్రొజెక్టర్ ద్వారా వీధుల్లో ప్రదర్శనలు!

భార్యను కలవబోతున్న సీఎం విజయ్…త్రిష సైడ్ అవ్వాల్సిందేనా?

రజినీ జైలర్ 2 కథ ఇదేనా? ఈసారి టార్గెట్ ఎవరో తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×