E-Paper
Advertisement

పుట్టినరోజు వేళ సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్.. ఎదుగుదలను అడ్డుకోలేదంటూ!

పుట్టినరోజు వేళ సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్.. ఎదుగుదలను అడ్డుకోలేదంటూ!
Advertisement

Samantha: సమంత ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న సమంత ప్రస్తుతం నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా మారి సినిమాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.. ప్రస్తుతం సమంత తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలలో లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నందిని రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా మే 15వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్లను కూడా నిర్వహిస్తున్నారు. ఇకపోతే ఏప్రిల్ 28వ తేదీ సమంత(Samantha) తన పుట్టినరోజు(Birthday) వేడుకలను జరుపుకుంటున్నారు. సమంత నేడు తన 39వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న నేపథ్యంలో ఈమెకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు.

ఇతరుల ద్వేషం మిమ్మల్ని అడ్డుకోకూడదు..

సమంత రెండో పెళ్లి తర్వాత మొదటి పుట్టిన రోజును జరుపుకోవటం విశేషం. ఈ నేపథ్యంలోనే సమంత ఎంతో సంతోషంగా ఈ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. ఇక సమంత పుట్టినరోజు సందర్భంగా ఈమె సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.”ఇతరుల అజ్ఞానం, ద్వేషం లేదా ప్రతికూలత ఎప్పుడూ కూడా మీ ఎదుగుదలను అడ్డుకొనివ్వకూడదు” అంటూ ఈమె చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. సమంత ఈ విధమైనటువంటి పోస్ట్ చేయడంతో అసలు సమంత పోస్ట్ వెనుక ఉద్దేశం ఏంటి ఈమె ఎదుగుదలను ఎవరైనా అడ్డుకున్నారా? అందుకే ఇలాంటి పోస్ట్ చేశారా అంటూ పలువురు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

మయోసైటిసిస్ వ్యాధితో ఇబ్బందులు..

Advertisement

ఒకానొక సమయంలో సమంత ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈమె నటుడు నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఆయన నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన తరువాత ఈమె ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా మయోసైటిసిస్ అనే అనారోగ్య సమస్యతో సమంత ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అలాంటి సమయంలో ఈమె ఏమాత్రం కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు కొనసాగుతున్నారు. గత 3 సంవత్సరాల పాటు సినిమాలకు కాస్త దూరంగా ఉన్న సమంత ఇప్పుడు తిరిగి కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.

రాజ్ నిడిమోరుతో వివాహం..

Advertisement

ఇక సమంత వ్యక్తిగత విషయానికి వస్తే ఇటీవల ఈమె డైరెక్టర్ రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. రెండో పెళ్లి తర్వాత ఈమె తన వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. గత కొంతకాలంగా వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారు అంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలకు అనుగుణంగానే ఈ జంట పెళ్లి బంధంలోకి అడుగు పెట్టారు. ఇలా వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటూనే సమంత తన వృత్తిపరమైన జీవితంలో కూడా బిజీగా, సంతోషంగా గడుపుతున్నారు.

Also Read: ఎన్టీఆర్ నీల్ డ్రాగన్ సినిమాలో రాజీవ్ కనకాల.. హిట్ కాంబో రిపీట్?

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×