E-Paper
Advertisement

Samantha Ruth Prabhu: కంఫర్ట్ డ్రెస్సింగ్…అమ్మాయిల బట్టలపైన సమంత వెర్షన్ ఇదే… పోస్ట్ వైరల్

Samantha Ruth Prabhu: కంఫర్ట్ డ్రెస్సింగ్…అమ్మాయిల బట్టలపైన సమంత వెర్షన్ ఇదే… పోస్ట్ వైరల్
Advertisement

Samantha Ruth Prabhu: సమంత.. తాజాగా సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. సమంత డ్రెస్సులకు పెద్ద అభిమానులు ఉన్నారు అంతంలో సందేహం లేదు. ఆమె ఫ్యాషన్ అంటే ఎంతో మందికి చాలా ఇష్టం. అందుకే ఆమె ఇంస్టాగ్రామ్ అకౌంట్ ని కూడా ఆమె ఫ్యాషన్ కోసమే ఎంతో మంది ఫాలో అవుతూ ఉంటారు అనడంలో సందేహం లేదు. ఈ క్రమంలో తాజాగా సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఫోటోలో లైట్ బ్లూ రంగు వర్కౌట్ డ్రెస్సులో కనిపించింది. ఆకాశం కింద ఎక్సర్సైజ్ చేస్తూ ఆమె చాలా సింపుల్ గా కనిపించింది. ఆ ఫోటోతో పాటు ఆమె తన ఫిట్‌నెస్‌కు సంబంధించిన మరికొన్ని చిత్రాలను కూడా షేర్ చేసింది.

అయితే ఈ ఫోటోల కన్నా కూడా ఈ ఫోటోలకు సమంత పెట్టిన క్యాప్షన్ వైరల్ అవుతుంది “నా జీవితంలో ఏ రెండు రోజులు ఒకేలా ఉండవు” అని ఆమె చెప్పింది. ప్రతి రోజు తన జీవితం కొత్తగా ఉంటుందని.. పనులు కూడా భిన్నంగా ఉంటాయని వివరించింది. అందుకే రోజువారీ అవసరాలకు సరిపోయే..సౌకర్యంగా ఉండే డ్రెస్సులు కావాలని అనిపిస్తుందని సమంత తెలిపింది. ఈ ఆలోచన నుంచే తన క్లాతింగ్ బ్రాండ్ “మైల్” మొదలైందని చెప్పింది.

Advertisement

ఈ బ్రాండ్ ద్వారా తక్కువ ధరలో..ఎక్కువ కంఫర్ట్ ఇచ్చే డ్రెస్సులు అందించాలనేది తన ఆశయమని సమంత వివరించింది. రోజు ఎలా గడిచినా కానీ.. ఆ డ్రెస్సులు వేసుకుంటే.. మంచి అనుభూతి రావాలన్నదే తన ప్రయత్నమని చెప్పింది. ఈ ప్రయాణం కేవలం ఒక్క సంవత్సరం.. క్రితం ప్రారంభమైందని కూడా ఆమె వెల్లడించింది. ఈ ఒక సంవత్సరంలో ప్రతి డిజైన్‌ను తానే వేసుకుని చూసి, అవసరమైన మార్పులు చేసిన తర్వాతే మార్కెట్‌కు తీసుకువచ్చినట్లు తెలిపింది. ప్రజల వరకు చేరే ప్రతి దుస్తు తాను నిజంగా ఉపయోగించినదేనని స్పష్టంగా చెప్పింది.

సమంత ఇప్పటికే పలు బ్రాండ్లకు అంబాసిడర్‌గా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తన స్వంత డ్రెస్సెస్ బ్రాండ్ గురించి ఎమోషనల్‌గా మాట్లాడడంతో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. ఫ్యాషన్‌తో పాటు ఫిట్‌నెస్ విషయంలో కూడా సమంత ఎప్పటికప్పుడు వార్తల్లో ఉంటుంది. ఇక ప్రస్తుతం సమంత షేర్ చేసినవన్నీ కూడా.. ఫిట్నెస్ ఫోటోలే కావడం విశేషం.

Advertisement

సినిమాల విషయానికి వస్తే సమంత త్వరలోనే.. మా ఇంటి బంగారం సినిమాలో కనిపించనుంది. ఈమధ్య విడుదలైన ఈ సినిమా టీజర్ అందరిని ఆకట్టుకుంది. ఈ టీజర్ లో.. సమంత యాక్షన్ సీన్స్ లో కూడా కనిపించడంతో అభిమానులు ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకో ఉన్నారు.

ALSO READ: Chinmayi Sripada: ఆ గౌరవనీయులందరూ జైల్లో ఉండాల్సిందే.. మరోసారి చిన్మయి ఘాటైన వ్యాఖ్యలు..!

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×