E-Paper
Advertisement

Krishnam Raju: ఆ టైంలో ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోవాలనుకున్న కృష్ణంరాజు.. అసలేం జరిగిందంటే?

Krishnam Raju: ఆ టైంలో ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోవాలనుకున్న కృష్ణంరాజు.. అసలేం జరిగిందంటే?

Krishnam Raju:సినీ ఇండస్ట్రీలో దివంగత నటుడిగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న కృష్ణ రాజు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. 1966 లో ‘చిలకా గోరింక’ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈయన ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలాంటి ఈయన ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోదామని అనుకున్నారట.కానీ ఒకరి వల్లే ఆయన ఇండస్ట్రీలో మళ్ళీ కొనసాగారు అని ఆయనే ఒకానొక సందర్భంలో వెల్లడించారు ఇకపోతే ఈరోజు ఆయన జయంతి కావడంతో ఆ విషయాలను అభిమానులు మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు.

ఆయన వల్లే ఇండస్ట్రీలో కొనసాగాను..

అసలు విషయంలోకి వెళ్తే.. కృష్ణంరాజు నటించిన తొలి చిత్రం చిలకా గోరింక. ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఇండస్ట్రీ ని వదిలి వెళ్లిపోదామని అనుకున్నారట కృష్ణంరాజు. అయితే ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవడానికి కారణం సినీ దిగ్గజం ఎల్ వి ప్రసాద్ ను కలవడమే.. ఈ విషయంపై కృష్ణంరాజు మాట్లాడుతూ.. “నేను సినిమా ఇండస్ట్రీలో కొనసాగడానికి కారణం ఎల్.వి.ప్రసాద్. ఆయనతో నాకున్న అనుబంధమే నన్ను ఇండస్ట్రీలో ఉండేలా చేసింది. అప్పట్లో నేను నటించిన చిలకా గోరింక సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత ‘నేనంటే నేనే’ సినిమాలో అవకాశం వచ్చినా విలన్ పాత్ర కావడంతో వద్దనుకున్నాను. అదే సమయంలో ఎల్వీ ప్రసాద్ ను కలిస్తే పాత్ర ఎలాంటిదైనా నువ్వు ప్రేక్షకులకు ఎంత దగ్గరయ్యావనేదే ముఖ్యం అని నాకు గీతా బోధ చేశారు .ఆయన మాటలు విని నేను ఆ సినిమా చేశాను .అది సక్సెస్ అయ్యింది ఇక తర్వాత విభిన్నమైన పాత్రలు చేసే అవకాశం నాకు లభించింది. ఒకవేళ ఆయన గైడెన్స్ లేకపోతే నేను ఇండస్ట్రీలో ఉండేవాడిని కాదు” అంటూ గతంలో కృష్ణంరాజు చెప్పుకొచ్చారు.

విజయాల కంటే పరాజయాలే ఎక్కువ..

అలాగే కృష్ణంరాజు మాట్లాడుతూ.. “నా సుదీర్ఘ సినీ ప్రయాణంలో విజయం కంటే పరాజయాలే ఎక్కువగా ఉన్నాయి. కెరీర్ పరంగా ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొన్నాను. కెరీర్ పరంగా, నిర్మాణం పరంగా కొత్త ట్రెండుకు శ్రీకారం చుడుతూ సినిమాలు చేశాను. నిజానికి పౌరాణిక నేపథ్య కథలు మహిళలకు ,పెద్దవాళ్లకు మాత్రమే పరిమితం అనుకుంటున్న పరిస్థితుల్లో భక్తకన్నప్ప చేశాను. రోజు 5000 మంది ఏనుగులు, గుర్రాలతో షూటింగ్ చేశాము. చిత్ర పరిశ్రమకి మన తోడ్పాటు కూడా ఉండాలని గోపికృష్ణ మూవీ సంస్థని ప్రారంభించాను” అంటూ గతంలో ఆయన చెప్పుకొచ్చారు.

ALSO READ:Fauji: ప్రభాస్ ఫౌజీ నుండి బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ లో పూనకాలు!

అప్పటినుంచే పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి..

పుట్టినరోజు అనగానే నాకు నా స్నేహితులు, అభిమానులే గుర్తుకొస్తారు. అమరదీపం నుంచి పరిశ్రమలో నా జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. దండలు , పుష్పగుచ్చాలతో వచ్చే అభిమానులతో.. ఆ డబ్బును సమాజ సేవకు ఉపయోగించాలని చెప్పేవాడిని.. వాళ్లు కూడా అదే పాటిస్తున్నారు. ముఖ్యంగా ఇతర కథానాయకులు అభిమానులతోనూ చక్కగా మెలిగే వాళ్ళు. ఇక నా గౌరవం కూడా రెట్టింపు అయింది.. అంటూ ఆయన తెలిపారు ఇకపోతే కృష్ణంరాజు నేడు మన మధ్య లేకపోయినా ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకొని.. రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతూ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు వసూలు చేస్తున్న హీరో గానే కాకుండా పాన్ ఇండియా స్టార్ గా పేరు దక్కించుకున్నారు.

Related News

‘డాన్ 3’ వివాదం.. రణ్‌వీర్ సింగ్‌పై ఆర్డర్ ఉపసంహరణ.. ఇంకా ముగియని గొడవ!

మెగా పవర్ స్టార్ బాక్సాఫీస్ జాతర.. ఊళ్లో సంబరాలు మామూలుగా లేవుగా..

దీపికా పదుకొణె డిప్రెషన్‌పై ప్రకాష్ పదుకొణె ఎమోషనల్.. ఏం జరిగిందంటే?

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, సీబీఎఫ్‌సీ మాజీ చీఫ్ కన్నుమూత.. ఏం జరిగిందంటే?

‘పెద్ది’ రిలీజ్ తర్వాత రామ్ చరణ్‌ను చూసి మురిసిపోతున్న మెగాస్టార్.. ఏం అన్నారంటే?

హీరో అర్జున్ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు.. అల్లుడు ఎవరంటే..?

రామ్ చరణ్ ‘పెద్ది’ చూసిన తర్వాత సెలబ్రిటీల రియాక్షన్ ఇదే!..

ప్రకాష్ రాజ్‌కి బండ్ల గణేష్ ఇచ్చిపడేశాడుగా!.. ఏంటి బాసూ అలా అనేశావ్..

Big Stories

×