Maa Inti Bangaram: ఇటీవల కాలంలో ఒక సినిమా విడుదల తేదీని ప్రకటించిన తర్వాత అదే తేదీన విడుదలకు నోచుకోలేక పోతుంది. పలు కారణాల వల్ల ప్రతి ఒక్క సినిమా ఇటీవల కాలంలో వరుస వాయిదాలు పడుతున్న సంగతి తెలిసిందే. చిన్న సినిమాల నుంచి మొదలుకొని పెద్ద సినిమాల వరకు సరైన విడుదల తేదీని ఏ ఒక్క సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం లేదు. ఇలా వరుస వాయిదాలు వేసుకుంటున్న నేపథ్యంలో ఈ ఏడాది వేసవిలో ఒక్క స్టార్ హీరో సినిమా కూడా లేకపోవడంతో ప్రేక్షకులు కూడా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే తాజాగా సమంత నటించిన మా ఇంటి బంగారం సినిమా కూడా విడుదల వాయిదా పడిందని తెలుస్తుంది. సమంత ప్రధాన పాత్రలో నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మా ఇంటి బంగారం.
సమంత నిర్మాణ సంస్థలో తెరకెక్కిన ఈ సినిమా లేడీ ఓరియంటెడ్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ మంచి అంచనాలను పెంచేసాయి. అయితే ఈ సినిమా మే 15వ తేదీ విడుదల కాబోతోందని చిత్ర బృందం అందుకు అనుగుణంగా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహించారు. అయితే ఉన్నఫలంగా ఈ సినిమా వాయిదా పడుతోంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా వాయిదా గురించి ఇప్పటివరకు చిత్ర బృందం ఎక్కడ అధికారకంగా ప్రకటించకపోయిన ఈ సినిమా వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
ఇలా మే 15వ తేదీ విడుదల కావాల్సిన ఈ సినిమా తిరిగి జూన్ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని సమాచారం. జూన్ నెలలో కిరణ్ అబ్బవరం చెన్నై లవ్ స్టోరీతో పాటు ఆనంద్ దేవరకొండ ఎపిక్ సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాల విడుదల తేదీకి సంబంధించి అధికారక ప్రకటన రాబోతోంది. ఇలా ఈ సినిమాలతో పోటీగా సమంత మా ఇంటి బంగారం కూడా జూన్ లోనే విడుదల కాబోతున్నట్టు సమాచారం. ఇలా జూన్ నెల నుంచి సినిమాలు వరుసగా విడుదలకు సిద్ధమవుతున్నాయి అయితే చిన్న సినిమాలన్నీ జూన్ నుంచి విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పట్లో స్టార్ హీరోల సినిమాలు ఏవి విడుదలకు నోచుకోలేకపోతున్నాయి.
కళ తప్పిన థియేటర్లు..
ఇలా మే నెలలో విడుదల కావాల్సిన సమంత మా ఇంటి బంగారం సినిమా కూడా వాయిదా పడటంతో మే నెల మొత్తం ఒక సినిమా కూడా థియేటర్లలో విడుదలకు నోచుకోలేకపోయింది. సాధారణంగా వేసవి సెలవులు అంటేనే స్టార్ హీరోల సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ బరిలో పోటీ దిగుతుంటాయి కానీ ఈ ఏడాది వేసవి సెలవులలో థియేటర్లు మొత్తం సినిమాలు లేక కళ తప్పుతున్నాయి. కేవలం రీ రిలీజ్ సినిమాలతో మాత్రమే ప్రేక్షకులు సరి పెట్టుకుంటున్నారు. సమంత విషయానికి వస్తే మే 15వ తేదీ విడుదల కావలసిన మా ఇంటి బంగారం వాయిదా వేస్తూ జూన్ నెలలో ఎప్పుడు విడుదల కాబోతుందనే విషయాలు తెలియాల్సి ఉంది.
Also Read: విజయ్ విజయం..స్పందించిన టాలీవుడ్..మౌనం వహిస్తున్న ఆ పాన్ ఇండియా స్టార్స్?