E-Paper
Advertisement

సమంతాను మెప్పించిన రీల్.. టైలర్ టాలెంట్ కు ప్రశంసల వర్షం!

సమంతాను మెప్పించిన రీల్.. టైలర్ టాలెంట్ కు ప్రశంసల వర్షం!
Advertisement

Samantha:ఇప్పుడున్న రోజుల్లో టాలెంట్ ఉంటే చాలు.. సోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కడున్నా వెలుగులోకి రావచ్చు. తాజాగా ఓ సామాన్య మహిళా టైలర్ చేసిన ఇన్‌స్టా రీల్ ఏకంగా స్టార్ హీరోయిన్ సమంత దృష్టినే ఆకర్షించింది. తన క్రియేటివిటీతో సమంతతో నేరుగా మాట్లాడుతున్నట్లుగా ఆమె చేసిన మ్యాజిక్ నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసి మురిసిపోయిన సమంత, స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ ప్రశంసల వర్షం కురిపించింది. ఆ అదిరిపోయే రీల్ విశేషాలేంటో చూద్దాం.

హీరోయిన్ నేరుగా తనతోనే మాట్లాడుతున్నట్లు:

సోషల్ మీడియాలో నెటిజన్ల క్రియేటివిటీకి అద్దం పట్టేలా ఈ మహిళా టైలర్ ఒక అద్భుతమైన వీడియోను రూపొందించారు. గతంలో ఉగాది సందర్భంగా యాంకర్ సుమతో సమంత మాట్లాడిన ఒక వీడియో కాల్ క్లిప్‌ను ఆమె తీసుకున్నారు. దానికి తన వీడియోను ఎంత పర్ఫెక్ట్‌గా సింక్ చేశారంటే.. చూసే ఎవరికైనా సమంత నేరుగా ఆ టైలర్ తోనే మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తుంది. ఈ లెవల్ ఎడిటింగ్ మరియు టైమింగ్ చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. “అచ్చం హీరోయిన్‌తోనే మాట్లాడుతున్నట్లు ఉంది కదా!” అంటూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు.

పల్లెటూరి ప్రతిభకు ఇన్‌స్టా వేదిక:

Advertisement

ఒకప్పుడు టాలెంట్ ఉన్నా బయట ప్రపంచానికి తెలియాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఇన్‌స్టా రీల్స్ ప్రపంచం పచ్చని పల్లెల్లో ఉన్న అద్భుతమైన ప్రతిభను అందరికీ పరిచయం చేస్తోంది. ఈ మహిళా టైలర్ తన వృత్తిని చేసుకుంటూనే, ఇలాంటి వినూత్నమైన ఆలోచనలతో అందరినీ ఆకట్టుకోవడం విశేషం. కేవలం టైలరింగ్ పనికే పరిమితం కాకుండా, టెక్నాలజీని వాడుకుని ఆమె చేసిన ఈ ప్రమోషన్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇది చూసిన ఎవరైనా సరే ఆమె క్రియేటివిటీకి ఫిదా అవ్వాల్సిందే. వీడియో చివర ఏంటో అందరికి నేనే డిజైన్ చేసిన బట్టలే కావాలి..అనే డైలాగ్ సూపర్ గా వుంది అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

సమంత మనసు గెలుచుకున్న వీడియో:

సాధారణంగా సెలబ్రిటీలు ఇలాంటి వీడియోలను అంత త్వరగా పట్టించుకోరు. కానీ ఈ వీడియోలోని క్రియేటివిటీ సమంతకు బాగా నచ్చింది. ఆ మహిళ ప్రతిభను మెచ్చుకుంటూ సమంత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఈ వీడియోను షేర్ చేశారు. ఒక స్టార్ హీరోయిన్ ఇలా ఒక సామాన్య మహిళ చేసిన పనిని గుర్తించి అభినందించడం పట్ల ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆ మహిళా టైలర్ ఆనందానికి అవధులు లేవు. రాత్రికి రాత్రే ఆమె వీడియోకు లక్షలాది వ్యూస్ రావడంతో పాటు ఆమె కూడా ఒక సెలబ్రిటీ అయిపోయింది.

Advertisement

also read:“నీ ముఖానికి బంగారు గొలుసా?” అవమానంతో చనిపోవాలనిపించింది -బిగ్ బాస్ ఫేమ్

ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమే:

ఇక చిన్నదైనా, పెద్దదైనా మనలో ఉన్న టాలెంట్‌ను ప్రపంచానికి చూపించడానికి సరైన వేదిక దొరికితే చాలు.. అద్భుతాలు జరుగుతాయని ఈ ఘటన నిరూపిస్తోంది. ఓ మహిళా టైలర్ తనకున్న పరిమితుల్లోనే ఇంతటి గొప్ప క్రియేటివిటీని చూపించడం అందరికీ స్ఫూర్తినిస్తోంది. సమంత వంటి స్టార్ల ప్రశంసలు దక్కడం ఆమె కష్టానికి దక్కిన ప్రతిఫలమే. ఇక మీలో కూడా ఇలాంటి టాలెంట్ ఉంటే అస్సలు దాచుకోకండి.. ఏమో, రేపు మీరు కూడా ఇలాగే వైరల్ అవ్వచ్చేమో! ప్రయత్నించి చూడండి, విజయం మీకోసం ఎదురుచూస్తూ ఉంటుంది.

Related News

బీజేపీపికి నటుడు నరేష్ వార్నింగ్.. పెట్రోల్ విషయంలో ఆ తప్పు చెయ్యొద్దు.. పోస్ట్ వైరల్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Big Stories

Advertisement
×