E-Paper
Advertisement

8,000mAh బ్యాటరీ, అదిరిపోయే కూలింగ్ ఫ్యాన్‌తో ‘Oppo K15 Pro’ సిరీస్ లాంచ్!

8,000mAh బ్యాటరీ, అదిరిపోయే కూలింగ్ ఫ్యాన్‌తో ‘Oppo K15 Pro’ సిరీస్ లాంచ్!

Oppo K15 Pro Series: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఒప్పో ఈసారి గేమర్ల కోసం రెండు పవర్‌ఫుల్ ఫోన్లను లాంచ్ చేసింది. చైనాలో విడుదలైన ఈ Oppo K15 Pro, K15 Pro Plus మోడళ్లపై టెక్ ప్రియుల్లో ఆసక్తి పెరిగింది. ఈ ఫోన్లలో అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే.. ఇందులో ప్రత్యేకంగా ‘యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్’ ఇచ్చారు. దీంతో ఎంతసేపు గేమ్స్ ఆడినా ఫోన్ అస్సలు వేడెక్కదు. ఈ వేసవి ఎండలకు ఫోన్లు సెగలు కక్కుతుంటాయి కదా.. అలాంటి టైమ్‌లో ఈ ఫీచర్ చాలా బాగా పనికొస్తుంది.

ధర వివరాలు ఇలా..

ఈ ఒప్పో K15 ప్రో+ బేసిక్ మోడల్ ప్రారంభ ధర రూ.47,000. ఇక దీనిలో అన్నిటికంటే టాప్ మోడల్ కావాలంటే దాదాపు రూ.57,000 వరకు ఖర్చవుతుంది. అలాగే K15 ప్రో మోడల్ కొంచెం తక్కువలో రూ.41,000 నుంచే అందుబాటులో ఉంది. ఈ ఫోన్లు ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఇవి అమ్మకానికి రానున్నాయి. ఫీచర్లను చూస్తుంటే ఈ ధర వర్త్ అనేలాగే అనిపిస్తోంది.

ఆకట్టుకునేలా డిస్‌ప్లే క్వాలిటీ..

ఇక స్క్రీన్ విషయానికి వస్తే.. ఒప్పో K15 ప్రో+ లో పెద్దదైన 6.78 అంగుళాల డిస్‌ప్లే ఇచ్చారు. దీనికి 165Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల ఫోన్ వాడేటప్పుడు చాలా స్మూత్‌గా ఉంటుంది. అలాగే K15 ప్రో లో 6.59 అంగుళాల స్క్రీన్ ఉంది. అంతేకాదు.. ఎండలో నిలబడి ఫోన్ చూసినా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా మంచి బ్రైట్‌నెస్‌ను కూడా అందించారు. మూవీ లవర్స్, ఎక్కువగా ఆన్‌లైన్ గేమ్స్ ఆడేవారికి ఈ ఫోన్ బాగా నచ్చేస్తుంది.

Also Read: చైనా బ్రాండ్లకు చెక్.. భారత్‌లో ఇకపై ఈ 5 మేక్ ఇన్ ఇండియా CCTV కెమెరాలదే హవా!

ఆండ్రాయిడ్ 16 వెర్షన్‌తో..

గేమింగ్ ఫోన్ అంటే స్పీడ్ ముఖ్యం కదా. అందుకే దీనిలో మీడియాటెక్ నుంచి వచ్చిన లేటెస్ట్ చిప్‌సెట్లను వాడారు. K15 ప్రో+ మోడల్‌లో డైమెన్సిటీ 9500s అనే పవర్‌ఫుల్ చిప్ ఉంది. దీనివల్ల భారీ గ్రాఫిక్స్ ఉన్న గేమ్స్ కూడా ఎక్కడా ఆగకుండా ప్లే అవుతాయి. రెండు ఫోన్లలోనూ 12GB RAM ఉండటం వల్ల ఒకేసారి నాలుగైదు యాప్స్ వాడినా ఫోన్ హ్యాంగ్ అయ్యే ప్రసక్తే లేదు. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 వెర్షన్‌తో ఇవి పనిచేస్తాయి.

అద్భుతమైన కెమెరా సెటప్..

ఈ ఫోన్ గేమర్స్ కోసమే అయినా.. కెమెరాను ఒప్పో నెగ్లెక్ట్ చేయలేదు. వెనుక వైపు 50MP మెయిన్ కెమెరా ఇచ్చారు. అలాగే చేతులు వణికినా ఫొటోలు బ్లర్ అవ్వకుండా ఉండేందుకు OIS ఫీచర్‌ను కూడా యాడ్ చేశారు. ఇకపోతే గ్రూప్ ఫొటోల కోసం 8MP అల్ట్రావైడ్ కెమెరా, సెల్ఫీల కోసం 16MP కెమెరాను ఇచ్చారు. ఈ ఫోన్‌తో మీరు 4K వీడియోలను కూడా చాలా క్లారిటీగా తీసుకోవచ్చు.

నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్..

అన్నిటికంటే హైలైట్ ఈ ఫోన్ బ్యాటరీ. K15 ప్రో+ మోడల్‌లో ఏకంగా 8,000mAh బ్యాటరీ ఇచ్చారు. సాధారణంగా ఇలాంటి ఫోన్లలో 5,000mAh చూస్తుంటాం. కానీ ఇందులోలో అంతకంటే ఎక్కువే ఉంది. దీనికి తోడు 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో.. అంత పెద్ద బ్యాటరీ కూడా చాలా త్వరగా ఛార్జ్ అయిపోతుంది. K15 ప్రోలో కూడా 7,500mAh బ్యాటరీ ఉంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల పాటు ఇక ఛార్జింగ్ గురించి మర్చిపోవచ్చు.

Also Read: హాలీవుడ్ రేంజ్ సెటప్ ఇక ఇంట్లోనే.. ఈ చిన్న మ్యాజిక్ లైట్‌తో బెడ్‌రూమ్ లుక్కే మారిపోద్ది!

Related News

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఫ్రిజ్ రిపేర్ ఖర్చులు మిగిలినట్టే!

మీది చిన్న రూమా? 0.5 టన్ ఏసీ బెస్ట్ భయ్యా.. ఎందుకో మీరే చూడండి!

బడ్జెట్‌లో బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్ కావాలా? ట్రెండ్ అవుతున్న టాప్ 3 బ్రాండ్స్!

Big Stories

×