E-Paper
Advertisement

Samantha: ఉగాది స్పెషల్.. సమంత మా ఇంటి బంగారం టీమ్ తో ప్రత్యేక వీడియో!

Samantha: ఉగాది స్పెషల్.. సమంత మా ఇంటి బంగారం టీమ్ తో ప్రత్యేక వీడియో!
Advertisement

Samantha:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అగ్ర కథానాయికగా పేరు సొంతం చేసుకున్న సమంత(Samantha) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయంతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె.. తన నటనతో పాన్ ఇండియా క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఇకపోతే గత ఏడాది ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు (Raj Nidimoru)తో ఏడడుగులు వేసింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ప్రముఖ డైరెక్టర్ నందిని రెడ్డి(Nandini Reddy) దర్శకత్వంలో సమంత చేస్తున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. మే 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో అప్పుడే సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టేసింది చిత్ర బృందం.

ఉగాది పచ్చడి చేసిన సమంత..

ఇకపోతే నేడు ఉగాదిని పురస్కరించుకొని ప్రత్యేకంగా మా ఇంటి బంగారం టీం తో ఉగాది పచ్చడి చేసింది సమంత. అందుకు సంబంధించిన ప్రమోషన్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ వినూత్నమైన ఉగాది స్పెషల్ ప్రోమో విడుదల చేసింది. ఇందులో దర్శకురాలు నందిని రెడ్డి హీరోయిన్ సమంత కలిసి ఈ ప్రమోషనల్ కార్యక్రమంలో పాల్గొనగా యాంకర్ సుమ తనదైన శైలిలో సందడి చేస్తూ నవ్వులు పూయించింది. ఇకపోతే తాజాగా విడుదల చేసిన ఈ వీడియోలో సమంత స్వయంగా ఉగాది పచ్చడి తయారు చేస్తూ.. మామిడికాయలు కోస్తూ.. కనిపించడం అభిమానులను విశేషంగా అలరిస్తోంది.. ఇకపోతే సమంత పచ్చడి కలిపే విధానం పై చర్చ, వారి మధ్య జరిగిన సరదా సంభాషణలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి..

హ్యాట్రిక్ అందుకుంటారా?

Advertisement

ఇదివరకే సమంత, నందిని రెడ్డి కాంబినేషన్లో ‘జబర్దస్త్’ సినిమా వచ్చి డిజాస్టర్ గా నిలిచింది. కానీ ఆ తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో ‘ఓ బేబీ’ సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది . ఇక ఇప్పుడు మళ్లీ సమంత, నందిని రెడ్డి కాంబినేషన్లో వస్తున్న సినిమా మా ఇంటి బంగారం. ఇంటెన్స్ క్రైమ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. సమంత తన సొంత బ్యానర్ అయిన ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం. ఇకపోతే ఈ చిత్రానికి సమంత భర్త ప్రముఖ ఫిలిం మేకర్ రాజ్ నిడిమోరు ఈ చిత్రానికి కథను అందించడంతోపాటు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు.

మే 15న రిలీజ్..

ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ లో సమంత చీర కట్టులో పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ చేస్తూ కనిపించడంతో సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ముఖ్యంగా జీవితంలోని షడ్రుచులను ప్రతిబింబించే ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను వివరిస్తూ సాగిన ఈ ప్రత్యేక ప్రమోషనల్ కార్యక్రమం సినిమా ప్రమోషన్లకు కొత్త జోరును అందించింది అనే చెప్పాలి. త్వరలోనే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని మే 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది.. మరి భారీ అంచనాల మధ్య సమంత చాలా రోజుల తర్వాత మళ్లీ తెలుగులో చేస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Advertisement

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Related News

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

రూ.200 కోట్ల క్లబ్ లోకి ఇరుముడి.. అయ్యప్పగా మణెమ్మ!

టాక్సిక్ vs ఇరుముడి.. భారీ బడ్జెట్ సినిమాలకు ఇదో గుణపాఠమా?

సాహో ప్రపంచంలోకి ఓజీ..? ఏం ప్లాన్ చేస్తున్నావ్ సుజిత్ ?

మీరే నాకు స్ఫూర్తి… బాబాయ్ కు అబ్బాయ్ విషెస్!

ఒంటిమీద బట్టలు లాగేసి ఘోరంగా అవమానించారు – స్టార్ కమెడియన్ ఎమోషనల్!

పవన్ అభిమాని మృతి..గొప్ప మనసు చాటుకున్న ఎస్కేఎన్!

Big Stories

Advertisement
×