E-Paper
Advertisement

Sangeetha Vijay: హీరో విజయ్ పై సంగీత పెట్టిన సెక్షన్లు ఇవే… చిక్కుల్లో నటుడు!

Sangeetha Vijay: హీరో విజయ్ పై సంగీత పెట్టిన సెక్షన్లు ఇవే… చిక్కుల్లో నటుడు!
Advertisement

Sangeetha Vijay:  కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో నటుడు విజయ్(Vijay), భార్య సంగీత (Sangeetha) విషయం కాస్త పెద్ద ఎత్తున చర్చలకు కారణమైన సంగతి తెలిసిందే. నటుడిగా తమిళ చిత్ర పరిశ్రమలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న విజయ్ రాజకీయాలలోకి అడుగుపెట్టి టీవీకే పార్టీని స్థాపించి ప్రస్తుతం రాజకీయ పనులలో బిజీగా ఉన్నారు. ఇలాంటి సమయంలోనే తన భార్య సంగీత తన నుంచి విడాకులు కోరుతూ చంగల్ పట్టు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ లో భాగంగా ఈమె విజయ్ గురించి పలు ఆరోపణలు కూడా చేసినట్టు తెలుస్తోంది. అదేవిధంగా ప్రత్యేక వివాహ చట్టం కింద పలు సెక్షన్లను ఆమె ఈ పిటీషన్ లో ప్రస్తావించినట్టు వార్తలు వస్తున్నాయి.

26 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి..

విజయ్ సంగీత దంపతులకు పెళ్లి జరిగి 26 సంవత్సరాలు అవుతోంది. ఇలా 26 ఏళ్ల తర్వాత వీరు తమ వైవాహిక జీవితానికి స్వస్తి పలకడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే సంగీత కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ లో భాగంగా ఈమె పలు సెక్షన్ లపై కేసు నమోదు చేయడంతో ఇది కాస్త విజయ్ వ్యక్తిగత జీవితాన్ని మాత్రమే కాకుండా రాజకీయ భవిష్యత్తుపై కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందని తెలుస్తోంది. మరి సంగీత విజయ్ పై మోపిన అభియోగాలు ఏంటి అనే విషయానికి వస్తే…

ప్రస్తావించిన సెక్షన్లు ఇవే..

Advertisement

సంగీత విజయ్ పై సెక్షన్ 27(1)(A) వివాహేతర సంబంధం, సెక్షన్ 27(1)(B) మానసిక వేధింపులు, సెక్షన్ 27(1)(D) నిర్లక్ష్యం ఆర్థికం ఆంక్షలు సెక్షన్ల కింద ఆయనపై కేసును నమోదు చేసినట్టు తెలుస్తుంది. ఇలా సంగీత విజయ్ పై ఇలాంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేయడంతో ఇది కాస్త ఆయన రాజకీయ ప్రయాణానికి పెద్ద ఎత్తున ఆటంకాన్ని కలిగిస్తుందని విజయ్ రాజకీయ భవిష్యత్తు చిక్కుల్లో పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. విజయ్ భార్య సంగీత కోర్టును ఆశ్రయించి విడాకులు కోరుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు విజయ్ మాత్రం ఈ విషయంపై ఎక్కడ స్పందించలేదు.

నటి త్రిషతో రిలేషన్ నిజమేనా?

Advertisement

ఇక విజయ్ సంగీత 26 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత విడిపోవాలని నిర్ణయించుకోవడానికి కారణం లేకపోలేదు. గత కొంతకాలంగా విజయ్ నటి త్రిషతో చాలా చనువుగా ఉంటున్నారని వీరి మధ్య రిలేషన్ కొనసాగుతోందంటూ వార్తలు బయటకు వచ్చాయి ఈ నేపథ్యంలోనే సంగీత విజయ్ నుంచి విడాకులు తీసుకుని విడిపోతున్నారు అంటూ గత ఏడాది కాలం పాటు వార్తలు వస్తున్నప్పటికీ ఎక్కడ ఈ జంట స్పందించలేదు కానీ సంగీత స్వయంగా విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించడంతో విజయ్ త్రిష గురించి వచ్చిన రూమర్లు నిజమేనని భావిస్తున్నారు. ఇక ఈ విషయంపై త్రిష కూడా ఎక్కడ స్పందించకపోవడం గమనార్హం. సంగీత దాఖలు చేసిన విడాకుల పిటిషన్ త్వరలోనే విచారణకు రానుంది.

Also Read: Geethu Royal: తిరుమలలో రీల్స్.. వివాదంలో బిగ్ బాస్ గీతూ రాయల్…

Related News

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

హైదరాబాద్‌లో ‘ఒడిస్సీ’ మూవీని ఎంజాయ్ చేయడానికి పెర్ఫెక్ట్ థియేటర్లు ఇవే, స్క్రీన్.. సౌండ్ అదుర్స్!

సెన్సార్ పూర్తి చేసుకున్న నయనతార ‘హాయ్’.. రిలీజ్ డేట్ లాక్!

చెప్పినట్టే వచ్చాడు.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న జననాయగన్ షార్ట్ వీడియో వైరల్!

‘గాడ్ ఆఫ్ వార్’లో ఎన్టీఆర్‌తో నటించే హీరోయిన్ ఎవరో తెలుసా ?

ఐశ్వర్య రాజేష్ మొరను ఆలకించిన డైరెక్టర్.. బాలయ్య మూవీలో క్రేజీ రోల్!

‘విక్రమ్ 1’ ర్యాకెట్ ప్రయోగంలో జబర్దస్త్ సత్యశ్రీ చెల్లి కీలక పాత్ర.. ఆ ఫొటోలు షేర్ చేస్తూ నటి ఎమోషనల్!

నటిగా పీవీ సింధు.. ఆసక్తిని రేకెత్తిస్తున్న పోస్ట్!

Big Stories

Advertisement
×