E-Paper
Advertisement

Geethu Royal: తిరుమలలో రీల్స్.. వివాదంలో బిగ్ బాస్ గీతూ రాయల్…

Geethu Royal: తిరుమలలో రీల్స్.. వివాదంలో బిగ్ బాస్ గీతూ రాయల్…
Advertisement

Geethu Royal: బిగ్ బాస్ కంటెస్టెంట్ గా అందరికీ ఎంతో సుపరిచితమైన గీతూ రాయల్(Geethu Royal) ప్రస్తుతం వివాదంలో నిలిచారు. ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్న గీతూ తాజాగా తన టీం తో కలిసి ఈమె తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఇలా దర్శనం తర్వాత తిరుమలలో కొన్ని రీల్స్ చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. దీంతో ఈమె కాస్త వివాదంలో నిలవడమే కాకుండా గీతూ వీరుపై విమర్శలు కురిపిస్తున్నారు.

తిరుమల ఆలయం ఎదుట రీల్స్..

తన టీమ్ తో కలిసి తిరుమలకు చేరుకున్న గీతు అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలను ఉల్లంఘిస్తూ ఆలయం ఎదుట, పుష్కరిని ఘాట్ రోడ్, లడ్డు కౌంటర్ వద్ద రీల్స్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక ఈ వీడియోలపై భక్తులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వామివారి సన్నిధిలో నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇలా రీల్స్ చేయడం ఏంటి ? ఇలాంటి వారిపై టీటీడీ కఠినమైన చర్యలు తీసుకోవాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇలా నిషేధితం ప్రాంతాలలో కూడా రీల్స్ చేస్తున్నారు అంటే ఆలయ భద్రతా వైఫల్యం పై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఆరు నెలలు శిక్ష అనుభవించాను..

Advertisement

ఇటీవల కాలంలో యూట్యూబర్స్ కేవలం వారి వ్యూస్ కోసం తిరుమల ఆలయంలో రీల్స్ చేస్తూ టీటీడీ నిబంధనలను తుంగలో తొక్కేస్తున్నారు. ఇలాంటి వాటిపై టీటీడీ ప్రత్యేక చర్యలు తీసుకోవాలి అంటూ భక్తులు వారి అభిప్రాయాలను తెలియపరుస్తున్నారు. ఇలా సోషల్ మీడియాలో తన గురించి వస్తున్నటువంటి విమర్శలపై కూడా గీతూ స్పందిస్తూ ఒక వీడియోని షేర్ చేశారు. తాను గతంలో దేవుడిపై నమ్మకం లేకుండా ఉండేదాన్ని ఒకసారి భవాని మాల వేసిన భక్తులను దూషించినందుకు విజయవాడ దుర్గమ్మ ఆరు నెలలు నాకు శిక్ష విధించిందని అప్పటినుంచి సనాతన ధర్మాన్ని నా రక్తంలోకి ఎక్కించుకున్నానని తెలిపారు.

?igsh=MWFscWJzb2xob2J2MQ%3D%3D

Advertisement

ఇక తిరుమల వీడియో గురించి కూడా ఈమె మాట్లాడుతూ తమ టీం లో ఒకరికి టోకెన్ రాని నేపథ్యంలో ఎదురుచూస్తున్నాము ఆ సమయంలోనే స్వామివారి పాటకు రీల్స్ చేసాము అయితే అది సోషల్ మీడియాలో షేర్ చేయడంతో చాలామంది వారి అభిప్రాయాలు తెలియజేశారు . దీంతో ఆ వీడియోని తాను డిలీట్ చేశానని తెలిపారు. అయితే కామెంట్లకు భయపడి తాను ఆ వీడియోలు డిలీట్ చేయలేదని కర్మకు భయపడి డిలీట్ చేశానని తెలిపారు. తనను ఎంతో మంది ఫాలో అవుతున్నారు వారు కూడా ఇలాంటి రీల్స్ చేసి వారికి ఏదైనా జరగరానిది జరిగితే ఈ జన్మలో నన్ను నేను క్షమించుకోలేనని తెలిపారు. ఇలా రీల్స్ చేయడం వల్ల నాకు దేవుడి మీద భక్తి లేదని కాదు అంటూ ఈమె వివరణ కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.

Also Read: Puri jagannadh: సూర్య పూరి జగన్నాథ్ కాంబోలో మిస్సైన సూపర్ హిట్ మూవీ.. మళ్ళీ ఇన్నాళ్ళకు?

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×