E-Paper
Advertisement

Sankranti 2026 Movies : నవ్వులను నమ్ముకుని నవ్వుల పాలయ్యారు… సంక్రాంతి డైరెక్టర్ల ‘కథ’ అస్సలు బాలేదు

Sankranti 2026 Movies : నవ్వులను నమ్ముకుని నవ్వుల పాలయ్యారు… సంక్రాంతి డైరెక్టర్ల ‘కథ’ అస్సలు బాలేదు
Advertisement

Sankranti 2026 Movies : సంక్రాంతి అంటే తెలుగులో ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా థియేటర్లకు వచ్చే పండుగ సీజన్‌. అందుకే ఈ సమయంలో విడుదలయ్యే సినిమాల్లో కామెడీ చాలా కీలకం. కానీ కామెడీ మాత్రమే ఉంటే సరిపోదు. కొత్తదనం ఉన్న కథ..ఆసక్తిగా నడిచే స్క్రీన్‌ప్లే కూడా ఉండాలి. ఈ సంక్రాంతికి వచ్చిన కొన్ని సినిమాల్లో అదే పెద్ద లోపంగా మారింది.

ఇప్పటివరకు విడుదలైన మూడు సినిమాలు.. ది రాజా సాబ్, మన శంకర వరప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి .. అన్నింటిలో ఒకే సమస్య కనిపిస్తోంది. కామెడీ మీద మాత్రమే ఫుల్ ఫోకస్ పెట్టి, కథను.. కథనాన్ని దర్శకులు పక్కన పెట్టేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Advertisement

ఈ సినిమాల దర్శకులు మారుతి, అనిల్ రావిపూడి, కిషోర్ తిరుమల. మారుతి గతంలో కొంచెం బీ-గ్రేడ్ టచ్ ఉన్న సినిమాలు తీసిన సంగతి తెలిసిందే. అందుకే ది రాజా సాబ్ సినిమాలో కూడా మూడు హీరోయిన్లు ఉండట.. హీరో ఒకరిని ప్రేమిస్తూ ఇంకొకరితో కమిట్ అయినట్టు చూపించడం చూసి ..ఇది మారుతి స్టైల్.. అనుకునే వాళ్లు ఉన్నారు.

ఆఖరికి వీళ్లు కూడానా..!

కానీ ఆశ్చర్యం ఏంటంటే… ఇలాంటి కాన్సెప్ట్‌లను కేవలం మారుతి మాత్రమే కాదు.. కిషోర్ తిరుమల..అనిల్ రావిపూడి లాంటి దర్శకులు కూడా ఫాలో అవడం. గతంలో అమ్మాయిలను గౌరవంగా.. బలమైన పాత్రలుగా చూపించిన ఈ ఇద్దరు దర్శకులు కూడా ఈసారి పాత ఆలోచనల కథలను తీసుకురావడం ప్రేక్షకులను నిరాశపరిచింది.

హీరోయిన్స్ కి విలువ ఎక్కడ..?

Advertisement

ముఖ్యంగా మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో భార్యను భర్త కొట్టడం.. విడిపోవడం..చివరికి భార్యే అర్థం చేసుకుని భర్త దగ్గరికి రావడం చూపించారు. ఇవన్నీ ఇప్పటి జనరేషన్‌కు అస్సలు కనెక్ట్ కావు. అలాగే భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలో భర్త మరో అమ్మాయితో కమిట్ అయినా.. కూడా చివరికి భార్య అతనితోనే కలవడం చూపించడం కూడా విమర్శలకు దారి తీస్తోంది.

ఈ లోపాలన్నింటిని కప్పిపుచ్చేందుకు దర్శకులు కామెడీని ఆయుధంగా వాడారు. హీరోల ఎనర్జీ, పంచ్ డైలాగ్స్‌తో సినిమాలను నడిపించే ప్రయత్నం చేశారు. కానీ బలమైన కథ లేకపోతే కామెడీ కూడా ఎక్కువ కాలం పనిచేయదు.

సంక్రాంతి సినిమాలకు నవ్వు అవసరం… కానీ ఆ నవ్వుకు అర్థం ఉన్న కథ..ప్రస్తుత జనరేషన్ ఆలోచనలకు సరిపోయే కంటెంట్ తోడైతేనే నిజమైన విజయం సాధ్యమవుతుంది.

ఇక ఈ సంక్రాంతికి రెండు సినిమాలు మిగిలి ఉన్నాయి. ఒకటి అనగనగా ఒక రాజు కాగా మరొకటి నారీ నారీ నడుమ మురారి.. మరి కనీసం ఈ రెండు చిత్రాలైన కామెడీతో పాటు కథని కూడా నమ్ముకుంటాయా.. లేదా ఈ మూడు చిత్రాల లానే నవ్వులు పండిస్తూ నవ్వుల పాలవుతాయా చూడాలి.

ALSO READ: 2026 Big Budget Movies: భారీ బడ్జెట్… భారీ రిస్క్…2026 ఇండియన్ సినిమాల్లో నెక్ట్స్ లెవల్ యుద్ధం..!

Related News

బీజేపీపికి నటుడు నరేష్ వార్నింగ్.. పెట్రోల్ విషయంలో ఆ తప్పు చెయ్యొద్దు.. పోస్ట్ వైరల్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Big Stories

Advertisement
×