2026 Big Budget Movies: 2026లో ఇండియన్ సినిమా రంగం పూర్తిగా మారబోతోంది. భారీ బడ్జెట్‌లు, రిస్కీ కథలు, కొత్త ట్రీట్మెంట్‌తో సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ ఏడాది మార్కెటింగ్ కూడా చాలా షాకింగ్‌గా ఉండబోతోంది. స్టార్ హీరోలు, టాప్ దర్శకులు కలిసి అత్యంత హై రిస్క్ ప్రాజెక్ట్‌లను పట్టాలెక్కిస్తున్నారు.
ముఖ్యంగా స్పిరిట్ సినిమా ఇండస్ట్రీలో పెద్ద చర్చగా మారింది. ఇది రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్, యూత్ ఎలిమెంట్స్ అన్నీ కలిపిన కొత్త తరహా సినిమా అని తెలుస్తోంది. పోలీస్ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో కథ నడుస్తూ, చాలా ఇంటెన్స్ సీన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేయనుందంట. భారీ బడ్జెట్‌తో తీస్తున్న ఈ సినిమా హిట్ అయితే ఇండస్ట్రీకి మరో స్థాయి తీసుకెళ్తుంది..ఫ్లాప్ అయితే భారీ నష్టమే. ముఖ్యంగా సందీప్ రెడ్డి లాంటి బోల్డ్ దర్శకుడితో .. ఎక్స్పరిమెంట్లకి కొంచెం దూరంగా ఉందే ప్రభాస్ చెయ్యి కలపడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోపక్క ఇదొక రకంగా భారీ రిస్క్ ప్రాజెక్ట్ అని కూడా చెప్పవచ్చు.
ఇంకో వైపు రజినీకాంత్ హీరోగా వస్తుందని జైలర్ 2 కూడా చాలా రిస్కీ ప్రాజెక్ట్. మొదటి భాగం బ్లాక్‌బస్టర్ కావడంతో రెండో భాగంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే ఈ సినిమాకి ఇప్పటికే బడ్జెట్ అనుకున్న దానికన్నా రెండింతలు ఎక్కువైందంట. మరి ఎన్ని అంచనాలు మధ్య వస్తున్న ఈ సినిమా ఫ్లాప్ అయితే భారీ నష్టాలు కూడా తప్పవు.
ఇక మరో భారీ రిస్క్ ప్రాజెక్ట్ ఏమిటి అంటే యాష్ హీరోగా వస్తున్న టాక్సిక్. ఈ సినిమా టీజర్ చూస్తేనే ఫ్యామిలీ ఆడియన్స్ ఆమడ దూరం పరిగెత్తేలా ఉంది. కానీ ఈ చిత్రం బడ్జెట్ మాత్రం చాలా ఎక్కువగానే ఉంది. ఈ క్రమంలో ఫ్యామిలీ ఆడియన్ థియేటర్ కి రాకుండా.. కేవలం మాస్ ఆడియన్స్ ని మాత్రమే నమ్ముకొని ఈ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా లేదా అనేది వేచి చూడాలి.
మరో పక్క బాలీవుడ్ లో కూడా అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ లాంటి హీరోలు భారీ యాక్షన్ సినిమాలతో రానన్నారు. మొత్తానికి 2026 ఇండియన్ బాక్సాఫీస్‌కు . భారీ బడ్జెట్, భారీ అంచనాలు, భారీ రిస్క్.. ప్రాజెక్టులను చవిచూపించబోతోంది. ఈ సినిమాల్లో ఏ ఒక్కటి హిట్ అయినా చరిత్ర సృష్టించడం ఖాయం అలానే ఫ్లాప్ అయితే విపత్తు తీసుకురావడం కూడా కాయం. అయినా నిర్మాతలు, దర్శకులు వెనకడుగు వేయడం లేదు. అదే 2026 సినిమా స్పెషాలిటీ.
ALSO READ: Pawan Kalyan Heroine: ‘ఇలా అయితే దేశం మారదు’… పొలిటికల్ లీడర్స్‌పై పవన్ కళ్యాణ్ హీరోయిన్ ఫైర్