E-Paper
Advertisement

Sankranti Movies 2026 : సంక్రాంతి సినిమాలకు సెన్సార్ కష్టాలు… ఇప్పుడు ఏం చేస్తారో..

Sankranti Movies 2026 : సంక్రాంతి సినిమాలకు సెన్సార్ కష్టాలు… ఇప్పుడు ఏం చేస్తారో..
Advertisement

Sankranti Movies 2026 : సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ప్రతి సంవత్సరం లాగే 2026 సంక్రాంతికి కూడా థియేటర్లు.. ఎన్నో సినిమాలతో సందడితో నిండిపోనున్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు.. తమిళ సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా భారీ సినిమాలు వరుసగా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈసారి సంక్రాంతి సందడికి సెన్సార్ సమస్యలు అడ్డంకిగా మారుతున్నాయనే వార్త ఒకటి తెగ వినిపిస్తోంది.

ముందుగా ఈ సంక్రాంతి పండగలో..తెలుగు సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే.. అన్ని సినిమాల కన్నా మొదటిగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ జనవరి 9 విడుదల.. సంక్రాంతి హడావుడి మొదలుపెట్టనుంది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అనిల్ రావిపూడి ప్రతిసారి సంక్రాంతికి వచ్చి ఒక హిట్ బొమ్మ కొడతారు అన్న సంగతి తెలిసిందే. ఇక ఈ దర్శకుడు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండడంతో.. ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. అలాగే రవితేజ.. భర్త మహాశయులకు విజ్ఞప్తి, శర్వానంద్.. నారి నారి నడుమ మురారి, నవీన్ పోలిశెట్టి .. అనగనగా ఒక రాజు సినిమాలు కూడా సంక్రాంతి రేసులో ఉన్నాయి. మొత్తం మీద తెలుగు థియేటర్లలో ఫుల్ జోష్ వాతావరణం కనిపిస్తోంది.

తమిళ సినిమాలకు కష్టాలు..!

Advertisement

ఇదే సమయంలో.. రెండు తమిళ సినిమాలు కూడా సంక్రాంతికి విడుదల కానున్నాయి. అందులో ఒకటి తమిళ స్టార్ విజయ్ హీరోగా నటిస్తున్న చివరి సినిమా జన నాయకన్. మరోది యువ హీరో శివ కార్తికేయన్ నటిస్తున్న పరాశక్తి. విజయ్.. శివ కార్తికేయన్ ఇద్దరికీ తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉండటంతో ఈ సినిమాలపై తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

బుకింగ్స్ కి పెద్ద అద్దంకి..!

అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ రెండు తమిళ సినిమాలకు సెన్సార్ సమస్యలు ఎదురవుతున్నాయంట. జన నాయకన్ సినిమాలో హింసాత్మక సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయని.. పరాశక్తి సినిమాలో సున్నితమైన అంశాలు ఉన్నాయని సెన్సార్ బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సెన్సార్ సర్టిఫికెట్ రాకపోతే.. పూర్తి స్థాయి బుకింగ్స్ మొదలయ్యే అవకాశాలు ఉండవు. దీంతో మిగతా సినిమాల కన్నా ఈ చిత్రం టికెట్ బుకింగ్లు వెనక పడవచ్చు.

Advertisement

ఇక సంక్రాంతి సినిమాల విడుదలకు కేవలం వారం రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో..ఈ సెన్సార్ సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయా? లేక సంక్రాంతి రేసులో మార్పులు వస్తాయా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సెన్సార్ అడ్డంకులు తొలగి అన్ని సినిమాలు ప్రశాంతంగా ప్రేక్షకుల ముందుకు వస్తాయా లేదా అనేది వేచి చూడాల్సిందే.

ALSO READ: Anupama Parameswaran: టాలీవుడ్ యంగ్ హీరోతో అనుపమ ‘కళ్యాణం’… పోస్టర్ వైరల్!

Related News

‘విక్రమ్ 1’ ర్యాకెట్ ప్రయోగంలో జబర్దస్త్ సత్యశ్రీ చెల్లి కీలక పాత్ర.. ఆ ఫొటోలు షేర్ చేస్తూ నటి ఎమోషనల్!

నటిగా పీవీ సింధు.. ఆసక్తిని రేకెత్తిస్తున్న పోస్ట్!

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

Big Stories

Advertisement
×