E-Paper
Advertisement

Mana ShankarVaraPrasad Garu: చిరంజీవి మౌనం వెనుక పెద్ద ప్లాన్ ఏమన్నా ఉందా?

Mana ShankarVaraPrasad Garu: చిరంజీవి మౌనం వెనుక పెద్ద ప్లాన్ ఏమన్నా ఉందా?
Advertisement

Mana Shankara Vara Prasad Garu Release Date: ఎన్నో దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న చిరు, ఈ మధ్య కొంత గ్యాప్ తీసుకున్నా కూడా ఇప్పుడు మాత్రం మళ్లీ తన అసలైన ఫామ్‌లోకి వచ్చారని ఫ్యాన్స్ చాలా సంతోషిస్తున్నారు. తాజాగా విడుదలైన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా ట్రైలర్ అదే విషయాన్ని స్పష్టంగా చెప్పేస్తోంది. ట్రైలర్ రిలీజైనప్పటి నుంచే సోషల్ మీడియాలో హడావుడి మొదలైంది. యూట్యూబ్‌లో నెంబర్ వన్ ట్రెండింగ్‌కు వెళ్లడం, 24 గంటల్లోనే రికార్డ్ వ్యూస్ రావడం చూసి ఇండస్ట్రీ కూడా షాక్ అయింది. సీనియర్ హీరోల్లో ఇంతటి భారీ రెస్పాన్స్ రావడం నిజంగా పెద్ద విషయం. చిరంజీవి కామిక్ టైమింగ్, బాడీ లాంగ్వేజ్, స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీటికీ ఫ్యాన్స్ మళ్ళీ ఫిదా అయిపోయారు.

ఈ సినిమాలో చిరంజీవి ఫుల్ ఫన్ మోడ్‌లో కనిపిస్తున్నారు. చాలా రోజుల తర్వాత ఆయనను ఇలా లైట్ హార్ట్‌డ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అవతార్‌లో చూడటం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతోంది. ముఖ్యంగా వింటేజ్ స్వాగ్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెరిగిపోయాయి. చిరు స్టైలింగ్, మేకోవర్, ఎనర్జీ ఇవన్నీ ఫ్యాన్స్ కి నాస్టాల్జియా ఇస్తున్నాయి. ఇక మరో హైలైట్ అంటే వెంకటేష్ స్పెషల్ అపియరెన్స్. విక్టరీ వెంకటేష్ కనిపించే సన్నివేశాలు ట్రైలర్‌కే నెక్స్ట్ లెవెల్ బజ్ తెచ్చాయి.

Advertisement

మెగాస్టార్ తో విక్టరీ కాంబో మామూలుగా ఉండదు..

చిరంజీవి వెంకటేష్ కాంబినేషన్ అంటే ఫ్యాన్స్‌కి పండగే. ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ సినిమాకి పెద్ద ప్లస్ అవుతాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే చిరంజీవి నయనతార జోడీకి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా నేచురల్‌గా ఉందని, స్క్రీన్‌పై చూడటానికి బాగా అనిపిస్తోందని ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు మాస్ మోమెంట్స్ కూడా బాగానే బ్యాలెన్స్ చేసినట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

Advertisement

చిరంజీవి నిజంగా పెద్ద ప్లాన్ వేశారా..

ఇప్పుడు అసలు విషయానికి వస్తే ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవి వస్తారా లేదా? అనే విషయం చర్చకి దారి తీసింది. షూటింగ్ పూర్తయ్యాక చిరంజీవి చిన్న సర్జరీ చేయించుకున్నారన్న వార్తలు బయటకు వచ్చాయి. కొందరు ఇది మోకాలి సర్జరీ అంటుంటే, మరికొందరు వెన్నుకు సంబంధించిన సమస్య అంటున్నారు. గత రెండు వారాలుగా ఆయన పూర్తి విశ్రాంతి తీసుకుంటున్నారని సమాచారం. అందుకే ప్రమోషన్లలో చిరు పెద్దగా కనిపించలేదని టాక్. కొందరు కావాలని చిరంజీవి ప్రమోషన్స్ కి రావడం లేదు అని ఇది ఒక ప్లాన్ కూడా అయి ఉండొచ్చు అని అంటున్నారు కానీ అందులో నిజం లేదు.

అయితే అభిమానులు మాత్రం చిరు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చి రెండు మాటలు మాట్లాడి వెళ్లినా చాలు అంటున్నారు. సాధారణంగా అనిల్ రావిపూడి సినిమాలకు ఫుల్ లెన్త్ ఫన్ ప్రమోషన్స్ ఉంటాయి. సంక్రాంతికి వస్తున్న సినిమాలకు ఇది ఇంకా ముఖ్యం. కానీ ఈసారి ఆరోగ్య కారణాల వల్ల చిరంజీవి కొంచెం బ్రేక్ తీసుకోవాల్సి వచ్చిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

ఏదేమైనా, ట్రైలర్‌తో మాత్రం సినిమా మీద అంచనాలు నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లిపోయాయి. పాటలు ఇప్పటికే చార్ట్‌బస్టర్స్ అవుతుండగా, ట్రైలర్ హైప్ ను మరింత పెంచింది. జనవరి 12న థియేటర్లలోకి రానున్న ఈ సినిమా ఒక ఫుల్ ఫ్యామిలీ ఫెస్టివ్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుందని మేకర్స్ తో పాటు ఫ్యాన్స్ కూడా ధీమాగా ఉన్నారు.

ALSO READ:MSVPG Pre Release: మన శంకర వరప్రసాద్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్.. వెన్యూ ఫిక్స్!

Related News

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

Big Stories

Advertisement
×