E-Paper
Advertisement

Sankranti Winners 2001 to 2025: 2001 నుంచి 2025 వరకు సంక్రాంతికి రికార్డులు రాసిన సినిమాలు ఇవే..!

Sankranti Winners 2001 to 2025: 2001 నుంచి 2025 వరకు సంక్రాంతికి రికార్డులు రాసిన సినిమాలు ఇవే..!
Advertisement

Sankranti Winners 2001 to 2025: సంక్రాంతి పండగ వచ్చిందంటే తెలుగు ప్రేక్షకులకు సినిమాలు గుర్తుకు వస్తాయి. ఏ పండగ వచ్చినా సరే, సంక్రాంతికి మాత్రం థియేటర్లకు వెళ్లి సినిమా చూడాల్సిందే అనే ఫీలింగ్ అందరిలో ఉంటుంది. కోడి పందాలు, గాలిపటాలు లేకుండా సంక్రాంతి పూర్తికానట్టే, కొత్త సినిమాలు చూడకుండా కూడా సంక్రాంతి పూర్తి అయినట్టు అనిపించదు. అందుకే టాలీవుడ్‌లో సంక్రాంతి సీజన్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది.

ఈ పండగను క్యాష్ చేసుకోవడానికి ప్రతి సంవత్సరం పెద్ద హీరోల నుంచి చిన్న హీరోల వరకూ అందరూ పోటీగా సినిమాలు రిలీజ్ చేస్తుంటారు. కొన్ని సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలుస్తే, మరికొన్ని భారీ అంచనాలతో వచ్చి ఫ్లాప్‌లుగా మిగిలిపోతాయి. 2001 నుంచి 2025 వరకు చూస్తే..ప్రతి సంక్రాంతికి ఒక విన్నర్ మాత్రం తప్పకుండా కనిపిస్తాడు.

Advertisement

2001లో బాలకృష్ణ నటించిన నరసింహ నాయుడు ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. 2002లో తరుణ్ నటించిన నువ్వు లేక నేను లేను పెద్ద హిట్ అయింది. 2003లో మహేష్ బాబు ఒక్కడు సినిమాతో స్టార్ హీరోగా ఎదిగాడు. 2004లో ప్రభాస్‌కు తొలి బ్లాక్‌బస్టర్‌గా వర్షం నిలిచింది. 2005లో నువ్వొస్తానంటే నేను వద్దంటానా సూపర్ హిట్ అయింది.

పండగ విజేతలు వీళ్లే..

2006లో వెంకటేష్ లక్ష్మీ, 2007లో అల్లు అర్జున్ దేశముదురు, 2008లో రవితేజ కృష్ణ, 2009లో అనుష్క అరుంధతి సినిమాలు సంక్రాంతి విన్నర్స్‌గా నిలిచాయి. 2010లో ఎన్టీఆర్ అదుర్స్, 2011లో రవితేజ మిరపకాయ, 2012లో మహేష్ బాబు బిజినెస్‌మ్యాన్ భారీ వసూళ్లు సాధించాయి.

Advertisement

2013లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, 2014లో ఎవడు, 2015లో గోపాల గోపాల, 2016లో నాన్నకు ప్రేమతో మరియు సోగ్గాడే చిన్నినాయనా విన్నర్స్‌గా నిలిచాయి. 2017లో చిరంజీవి రీఎంట్రీ మూవీ ఖైదీ నెం.150 రికార్డులు సృష్టించింది.

టాలీవుడ్ లో సంక్రాంతి సంబరాలు..

2019లో F2, 2020లో అలా వైకుంఠపురంలో, 2021లో క్రాక్, 2022లో బంగారురాజు, 2023లో వాల్తేరు వీరయ్య, 2024లో హనుమాన్, 2025లో సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు ప్రేక్షకుల మనసు గెలిచాయి.

ఇక ఈ సంవత్సరం 2026లో చిరంజీవి నటించిన మన శంకర్ వరప్రసాద్ గారు, ప్రభాస్ నటించిన డి రాజా సాబ్, రవితేజ నటించిన భర్త మహాసయులకు విజ్ఞప్తి, నవీన్ పోలిశెట్టి నటించిన అనగనగా ఒక రాజు, శర్వానంద్ నటించిన నారీ నారీ నడుమ మురారి విడుదల కాగా..‌ వీళ్ళల్లో ఈ సంక్రాంతి విన్నర్ ఎవరో తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూడక తప్పదు.

Also Read: Makara Sankranti-2026: మకర సంక్రాంతి నేడు.. కళకళలాడుతున్న పల్లెటూర్లు, నేతల శుభాకాంక్షలు

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×