E-Paper
Advertisement

రుక్మిణికి మిస్.. సారాకి ఛాన్స్ ! ధనుష్ సినిమాలో ఊహించని ట్విస్ట్

రుక్మిణికి మిస్.. సారాకి ఛాన్స్ ! ధనుష్ సినిమాలో ఊహించని ట్విస్ట్
Advertisement

Sara Arjun : సినీ ఇండస్ట్రీ.. ఇక్కడ ఎప్పుడు ఎవరి అవకాశం ఎవరికి దక్కుతుందో తెలీదు. సరిగ్గా చెప్పాలంటే ఇదో వైకుంట పాళీ. ఎవరు నిచ్చెన ఎక్కుతారో, ఎవరు కిందపడి పోతారో చెప్పడం చాలా కష్టం. వరుస సినిమాలతో కెరీర్ జోరుగా సాగిపోతుంది అనుకున్న టైమ్ లో ఊహించని మలుపులు ఎదురవుతాయ్. ముఖ్యంగా ఒకేసారి అన్ని సినిమలాకి డేట్స్ అడ్జస్ట్ చేయలేక కొన్ని సినిమాలు వదలుకుంటే మరికొందరు అవే అవకాశాల్ని అందుకొని టాప్ లీగ్ లోకి దూసుకొచ్చేస్తారు. ఇదిగో ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీలో రుక్మిణీ వసంత్, సారా అర్జున్ ల మధ్య ఇదే జరుగుతుంది.

వరుస సినిమాలతో జోరుమీదున్న రుక్మిణీ వసంత్

Advertisement

కన్నడ సినిమా సప్త సాగరదాచే ఎల్లోలో చేసిన ప్రియా పాత్రతో మంచి నటిగా ఆడియన్స్ లో క్రేజ్ కొట్టేసింది రుక్మిణీ వసంత్. ఇక ఆతర్వాత తెలుగులో అప్పుడో ఇప్పుడో ఎప్పుడో, కన్నడలో శివరాజ్‌కుమార్ కి జోడీగా భైరతి రణగల్, శ్రీమురళికి జోడీగా బగీరా అంటూ వెనుచూసుకోకుండా వరుస ప్రాజెక్ట్స్ తో తెగ బిజీ అయిపొయింది. ఈ క్రమంలోనే హోంబలే ఫిల్మ్ బ్యానర్ పై రిషాబ్ హీరోగా నటించిన కాంతారా 2లో కనకవతి అనే యువరాణి పాత్రలో నటించి మెప్పించింది. ఇక ఈ సినిమా దాదాపు 800 కోట్ల వసూళ్ళు కొల్లగొట్టడంతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపొయింది. ఇక ఇదే జోష్ లో తారక్ సరసన డ్రాగన్ లో సెలెక్ట్ అయిన సంగతి తెల్సిందే. మరో వైపు యష్ హీరోగా వస్తున్న టాక్సిక్ లోనూ కీ రోల్ చేస్తుంది.

డ్రాగన్ షెడ్యూల్స్ డిస్టర్బ్ అవడంతో డేట్స్ గందరగోళం

Advertisement

అయితే తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం డ్రాగన్ సినిమా షెడ్యూల్స్ బాగా డిస్టర్బ్ అవడం వల్ల ఈ అమ్మడు వేరే సినిమాలకి ఇచ్చిన డేట్స్ అన్నీ గందరగోళం అయ్యాయట. అలా ఒక బడా ప్రాజెక్ట్స్ కోసం మిగతా సినిమాలని వదులుకునే పరిస్థితి. ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న కొత్త సినిమా నుంచి రుక్మిణి తప్పుకోవాల్సి వచ్చిందన్న వార్తలు ఇపుడు మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయ్. అవును… ధనుష్ హీరోగా తమిళరాసన్ పచ్చముత్తు దర్శకత్వంలో ఒక కొత్త సినిమాకి గ్రీన్ సిగన్ ఇచ్చిన సంగతి తెల్సిందే.

ఛాన్స్ కొట్టేసిన యంగ్ బ్యూటీ సారా అర్జున్

అయితే మొదట్లో ఈ సినిమాకి హీరోయిన్ గా రుక్మిణి వసంత్ నే క్యాస్ట్ చేసినప్పటికీ తారక్ డ్రాగన్ సినిమా డేట్స్ క్లాష్ అవడంతో ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోక తప్పలేదట. అయితే రుక్మిణి వదులుకున్న ఈ లక్కీ ఛాన్స్ ఇపుడు యంగ్ బ్యూటీ సారా అర్జున్ కి దక్కినట్టు కోలీవుడ్ టాక్. నాన్న సినిమాతో అందరిని ఏడిపించిన సారా తాజాగా దురంధర్ తో సాలిడ్ బ్లాక్ బాస్టర్ కొట్టింది కూడా. మరో వైపు ధనుష్ చేస్తున్న ‘కర’ ఏప్రిల్ 30న ప్రేక్షకులకు వచ్చేందుకు రెడీ అయిపొయింది. అంటే అది రిలీజ్ కాగానే ఇది పట్టాలెక్కబోతుందన్న మాట. చూడాలి మరి రుక్మిణిని కాదని ఛాన్స్ పట్టేసిన సారా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో!

also read:కాపీ కొట్టడంలో అట్లీ రికార్డు క్రియేట్ చేయబోతున్నారా? ఫ్యాన్స్‌ను భయపెడుతున్న ‘తోడేలు’ కాన్సెప్ట్!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×