E-Paper
Advertisement

కాపీ కొట్టడంలో అట్లీ రికార్డు క్రియేట్ చేయబోతున్నారా? ఫ్యాన్స్‌ను భయపెడుతున్న ‘తోడేలు’ కాన్సెప్ట్!

కాపీ కొట్టడంలో అట్లీ రికార్డు క్రియేట్ చేయబోతున్నారా? ఫ్యాన్స్‌ను భయపెడుతున్న ‘తోడేలు’ కాన్సెప్ట్!
Advertisement

Raka Movie :సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న టెక్నికల్ వండర్ ‘రాకా’. ఇక ఈ సినిమా నుండి బన్నీ బర్త్ డే సందర్భంగా వదిలిన పోస్టర్ కాస్త మిక్స్డ్ టాక్ నే తెచ్చుకోగా, ప్రస్తుతం వినిపిస్తున్న ఇన్‌సైడ్ టాక్ మాత్రం ఫ్యాన్స్‌ను మరీ టెన్షన్ పెట్టేస్తుంది. అసలే అట్లీ సినిమాలంటేనే పాత సినిమాలని మిక్సీలో వేసి రుబ్బెస్తాడు అన్న రూమర్ ఉంది. ఇప్పుడు ‘రాకా’ విషయంలో కూడా ఆయన అదే పాత పద్ధతిని ఫాలో అవుతున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న వార్త.

సైన్స్ ఫిక్షన్ మరియు మైథాలజీని కలిపి

Advertisement

ముఖ్యంగా ఈ సినిమాలో సైన్స్ ఫిక్షన్ మరియు మైథాలజీని కలిపి ‘తోడేళ్ల’ (Werewolves) కాన్సెప్ట్‌ను తీసుకుంటున్నారనే లీక్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. హాలీవుడ్‌లో దశాబ్దాల క్రితమే వాడి వదిలేసిన ‘ట్వైలైట్’, ‘అండర్ వరల్డ్’ వంటి సినిమాల ఛాయలు ఇందులో కనిపిస్తాయేమోనని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. అసలు మన పురాణాలకు, తోడేళ్ల కాన్సెప్ట్‌కు అట్లీ ముడిపెట్టే విధానం ఎంతవరకు లాజికల్‌గా ఉంటుందనేది ఫ్యాన్స్ ని వేధిస్తున్న ప్రశ్న.

also read:బతికున్నప్పుడు 5000 కోట్ల అప్పు.. చనిపోయాక 18000 కోట్ల ఆస్తి! ‘కింగ్ ఆఫ్ పాప్’ ఫైనాన్షియల్ గ్రాఫ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!

Advertisement

సినిమాని రిస్క్ లో పడేసినట్టే

గతంలో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ‘భేడియా’తో ఇదే తరహా ప్రయత్నం చేసి బాక్సాఫీస్ దగ్గర దారుణంగా దెబ్బతిన్నాడు కూడా. మరి ఇప్పుడు బన్నీ లాంటి గ్లోబల్ స్టార్‌ను పెట్టుకొని అట్లీ ఇలాంటి ప్రయోగం చేయడం అంటే సినిమాని రిస్క్ లో పడేసినట్టే అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయ్. ఇక దీపికా పదుకోన్ హీరోయిన్ అనగానే గ్లామర్ పరంగా హైప్ పెరిగినా, స్టోరీలో కంటెంట్ లేకపోతే మాత్రం స్టార్ కాస్టింగ్ సినిమాను కాపాడలేదని ఎన్నో సినిమాలు ప్రూవ్ చేశాయ్ కూడా.ఇక ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే, బన్నీ మేకోవర్ వింతగా ఉందే తప్ప కమర్షియల్ గా ఎంతవరకు వర్కవుట్ అవుతుందో అన్న డౌట్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ అవుతున్నాయ్. అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే ఎంతో కష్టపడి ‘పుష్ప’ లాంటి మాస్ ఇమేజ్‌ను సంపాదించుకుంటే, ఇప్పుడు గ్రాఫిక్స్ మరియు మేకప్ వెనుక ఆయన నటనను ఇలా కప్పిపుచ్చడం ఏంటన్నది కొందరి ఆర్గ్యుమెంట్.

కొత్త వ్యక్తిని ఎంచుకోవడం అంటే ఒకరకంగా రిస్క్

ఇక సన్ పిక్చర్స్ లాంటి పెద్ద సంస్థ వందల కోట్లు కుమ్మరిస్తున్నా, మ్యూజిక్ డైరెక్టర్ గా సాయి అభ్యంకర్ వంటి కొత్త వ్యక్తిని ఎంచుకోవడం అంటే ఒకరకంగా రిస్క్ అనే చెప్పాలి. అనిరుధ్ లేదా ఏఆర్ రెహమాన్ లాంటి దిగ్గజాలు ఉండగా, కేవలం ఒక్క వైరల్ సాంగ్ క్రేజ్ చూసి ఇంత భారీ ప్రాజెక్ట్‌ను ఒక కొత్త సంగీత దర్శకుడి చేతిలో పెట్టడం అంటే అట్లీని మెచ్చుకొని తీరాల్సిందే. కానీ ఏమాత్రం తేడా కొట్టినా పోలికలతో అట్లీ ని చెడుగుడు ఆడటం ఖాయం.ఇకపోతే అట్లీ తన గత సినిమాల్లో లాగే ఎమోషన్స్ పేరుతో పాత సీన్లను రీమేక్ చేస్తే, ‘రాకా’ బాక్సాఫీస్ దగ్గర గర్జించడం అటుంచండి.. కనీసం ఫ్యాన్స్‌ను కూడా మెప్పించడమే చాలా కష్టం. ఈ ట్రెండ్ లో పాన్ ఇండియా సినిమా అంటే కేవలం భారీ బడ్జెట్, గ్రాఫిక్స్ మాత్రమే కాదు, కథలో కొత్తదనం ఉండాలన్నది ఆడియన్స్ మాట. చూడాలి మరి ఈ ‘తోడేలు’ కాన్సెప్ట్ అట్లీ బన్నీని ఎక్కడిదాకా తీసుకెళ్తుందో!

also read:‘ధురంధర్’ ధాటికి బాహుబలి, పుష్ప రికార్డులు క్లీన్ స్వీప్.. ఫస్ట్ టైమ్ 3 వేల కోట్లు!

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×