E-Paper
Advertisement

Saraswathi Trailer: ప్రతి అమ్మాయి ‘సరస్వతి’లా ఉండదు.. మిస్టరీగా వరలక్ష్మి సినిమా ట్రైలర్!

Saraswathi Trailer: ప్రతి అమ్మాయి ‘సరస్వతి’లా ఉండదు.. మిస్టరీగా వరలక్ష్మి సినిమా ట్రైలర్!
Advertisement

Saraswathi Trailer: సినీ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఇదివరకు వెండితెరపై నటిగా తనలో ఉన్నటువంటి నటన నైపుణ్యాన్ని బయటపెడుతూ పెద్ద ఎత్తున వెండి తెరపై ప్రేక్షకులను సందడి చేశారు. ఇలా వెండితెర నటిగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ ఈసారి దర్శకురాలిగా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్(Varalakshmi Sarath Kumar) స్వీయ దర్శకత్వంలో సరస్వతి(Saraswathi) అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పనులు దాదాపు పూర్తి అయ్యాయని తెలుస్తోంది.

వరలక్ష్మి శరత్ కుమార్ సరస్వతి ట్రైలర్..

ఈ సినిమాకు వరలక్ష్మి శరత్ కుమార్ దర్శకత్వం వహించడమే కాకుండా ప్రధాన పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాలో అభినవ గోమటం, ప్రకాష్ రాజ్ , రావు రమేష్, ప్రియమణి వంటి తదితరులు కూడా కీలకపాత్రలలో కనిపించబోతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ వీడియోని నటుడు నాచురల్ స్టార్ నాని చేతుల మీదుగా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే ఒక అమ్మాయి మిస్సింగ్ కేసు నేపథ్యంలో ఈ సినిమా కొనసాగుతుందని తెలుస్తోంది. ఇందులో సరస్వతి అనే చిన్నారి వరలక్ష్మి కూతురు పాత్రలో కనిపించబోతున్నారు ఈ చిన్నారి మిస్ కావడంతో తన జాడను కనుక్కోవడం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేశారు. చివరికి కూతురు ఆచూకీ తెలియక నటి వరలక్ష్మి ఎలా మారిపోయారనే నేపథ్యంలో సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.

మిస్టరీగా సరస్వతి సినిమా..

Advertisement

ఇలా ఈ ట్రైలర్ లో వరలక్ష్మి చివరికి గన్ చేత పట్టుకొని యాక్షన్ మోడ్ లో కనిపించారు. ప్రతి అమ్మాయి సరస్వతి లాగా ఉండదు అవసరమైతే కాళిలా మారుతుంది అనే చెప్పే డైలాగ్ లు కూడా ఆకట్టుకున్నాయి. ఇక ఇందులో ప్రకాష్ రాజ్ లాయర్ పాత్రలో కనిపించారు. మొత్తానికి ఒక సస్పెన్స్ త్రిల్లర్ సినిమాగా వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఇలా నటిగా దర్శకురాలిగా ఈ సినిమా ద్వారా ఈమె ఎలాంటి సక్సెస్ అందుకుంటారనేది తెలియాల్సి ఉంది.

Advertisement

ఇక ఈ సినిమా ట్రైలర్ నాచురల్ స్టార్ నాని విడుదల చేయగా ఈ సినిమాకు సంబంధించిన పస్ట్ లు పోస్టర్ సమంత చేతుల మీదుగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయింది కానీ విడుదల తేదీ గురించి చిత్ర బృందం అధికారకంగా ప్రకటించలేదు ఇక ఈ చిత్రాన్ని వరలక్ష్మి శరత్ కుమార్ తో పాటు తన చెల్లెలు పూజ శరత్ కుమార్ కలిసి దోసా డైరీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు. వరలక్ష్మి శరత్ కుమార్ కెరియర్ మొదట్లో హీరోయిన్గా నటించారు ఇటీవల విలన్ పాత్రల ద్వారా కూడా ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ప్రస్తుతం ఈమె లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటిస్తూనే మరోవైపు దర్శకురాలిగా మారి తనలో ఉన్న మరో టాలెంట్ బయట పెడుతున్నారు. మరి దర్శకు రాలిగా మొదటి సినిమాతో వరలక్ష్మి ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది.

Also Read: Mrunal Thakur: ఆ పనిచేయడంతోనే ధనుష్ తో  పెళ్లి రూమర్లు.. ధనుష్ తో సినిమా పై మృణాళ్ క్లారిటీ!

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×