E-Paper
Advertisement

UBS Movie: పవన్ మ్యానరిజాన్ని డీకోడ్ చేయబోతున్నాం – హరీష్ శంకర్ 

UBS Movie: పవన్ మ్యానరిజాన్ని డీకోడ్ చేయబోతున్నాం – హరీష్ శంకర్ 
Advertisement

UBS Movie: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలు.. మరొకవైపు రాజకీయాలు అంటూ రెండు పడవల మీద ప్రయాణాన్ని చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ దూసుకుపోతున్నారు. అందులో భాగంగానే చివరిగా సుజీత్ దర్శకత్వంలో ఓజీ సినిమా చేసి ప్రేక్షకులను పలకరించిన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).. ప్రస్తుతం హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా చేస్తున్నారు. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో గబ్బర్ సింగ్ సినిమా వచ్చి మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

ఉస్తాద్ భగత్ సింగ్ సెకండ్ సింగిల్ పై డైరెక్టర్ అప్డేట్..

మళ్లీ వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా అనడంతోనే అంచనాలు పెరిగిపోయాయి. దీనికి తోడు ఈ సినిమా నుంచి విడుదల చేస్తున్న చిన్న చిన్న అప్డేట్స్ కూడా అభిమానులకు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి అనడంలో సందేహం లేదు. ఇది ఇలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి ఇప్పటికే మొదటి సాంగు వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు రెండవ పాట కూడా రాబోతోంది. ఫిబ్రవరి 22 ఆదివారం రోజు ఈ సినిమా నుండి “ఆరా ఆఫ్ ఉస్తాద్” పేరిట రెండవ పాటను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ విషయంపై మరో అప్డేట్ వదులుతూ అంచనాలు పెంచేశారు డైరెక్టర్ హరీష్ శంకర్.

“ఆరా ఆఫ్ ఉస్తాద్” ఈవెంట్ అక్కడే..

Advertisement

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి “ఆరా ఆఫ్ ఉస్తాద్” అనే సెకండ్ సింగిల్ రిలీజ్ కార్యక్రమాన్ని రేపు సాయంత్రం 4:00 గంటలకు మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠంలో నిర్వహిస్తున్నట్లు హరీష్ శంకర్ ఎక్స్ వేదికగా అధికారికంగా తెలిపారు. ఈ క్రమంలోనే పవన్ మ్యానరిజం అయిన “మెడపై చేయి పెట్టుకోవడాన్ని ” డీ కోడ్ చేయనున్నట్లు హరీష్ శంకర్ తెలిపారు. ఇక ప్రస్తుతం హరీష్ శంకర్ ఈ మాట చెప్పడంతో అభిమానులు కూడా పవన్ మ్యానరిజం వెనుక ఉన్న అసలు కథ తెలుసుకోవడానికి తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. ఇకపోతే ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా పంచుకుంటూ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు హరీష్ శంకర్.

పవన్ కళ్యాణ్ మ్యానరిజాన్ని డీకోడ్ చేయబోతున్నాము..

“పైగా పవన్ కళ్యాణ్ మ్యానరిజాన్ని ఆయన రిపీట్ చేయడం వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ మ్యానరిజాన్ని కొన్ని లక్షల మంది చేశారు. ఈ మ్యానరిజాన్ని మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠంలో ఫిబ్రవరి 22న డీకోడ్ చేయబోతున్నాము. ఈ మ్యానరిజం అర్థం ఏమిటి ? దీని కథ ఏంటి? దీని యవ్వారం ఏంటి ? ఇవన్నీ ఆరోజు చూద్దాం” అంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు. మొత్తానికైతే ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ తన మ్యానరిజంతో అందరినీ ఆకట్టుకున్నారు. మరి ఈ మ్యానరిజం వెనుక అసలు కథ ఏమిటో చెబుతానంటూ సస్పెన్స్ క్రియేట్ చేశారు హరీష్ శంకర్. ఈ సినిమా 2026 మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని పవన్ కళ్యాణ్ కు అందిస్తుంది ? అసలు గబ్బర్ సింగ్ మ్యాజిక్ రిపీట్ అవుతుందా అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×