Tollywood:సాధారణంగా ఎవరైనా సరే డబ్బు సంపాదించడానికి సినిమాలలోకి, రాజకీయాలలోకి వెళ్తారు అనే మాట అందరికీ తెలిసిందే. కానీ ఎవరు ఈ నిజాన్ని బయటపెట్టరు. అయితే ఇక్కడ ఒక నటుడు మాత్రం సినిమాల ద్వారా సంపాదించిన మొత్తాన్ని రాజకీయాలలోకి వెళ్లి పోగొట్టుకున్నాను అంటూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. హీరోగా సినిమాలలో సత్తా చాటి సంపాదించిన డబ్బు మొత్తాన్ని రాజకీయాల్లోకి వెళ్లి పోగొట్టుకున్నాను అంటూ చేసిన కామెంట్లు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. మరి ఆయన ఎవరు? అసలేం జరిగింది? అనే విషయం ఇప్పుడు చూద్దాం.
ఆయన ఎవరో కాదు చిత్రసీమలో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ యాక్టర్ నరేష్. ఒకప్పుడు కామెడీ హీరోగా వరుస చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన.. ఇప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలతో దూసుకుపోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా.. పాత్రతో పట్టింపు లేకుండా తనదైన నటనతో మెప్పిస్తున్న నరేష్ తాజాగా ఒక సినిమా ఈవెంట్లో తన గత రాజకీయ జీవితంపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ.. “నేను రాజకీయాల్లోకి డబ్బు సంపాదించాలనే ఆలోచనతో వెళ్లలేదు. ప్రజాసేవ కోసమే వెళ్లాను. అయినా సరే సొంత జేబు నుంచి నిధులు చెల్లించాను. పార్టీ వ్యవహారాలు, సామాజిక కార్యక్రమాల కోసం విపరీతంగా ఖర్చు చేయడంతో పాటు ప్రత్యామ్నాయ ఆదాయం కోసం ప్రారంభించిన అడ్వర్టైజింగ్ ఏజెన్సీ వంటి వ్యాపారాలు కూడా దెబ్బతిన్నాయి. ఫలితంగా నష్టాలు తీర్చుకోవడానికి కొన్ని ఆస్తులు కూడా అమ్ముకున్నాను. అప్పట్లో సంపాదించిన డబ్బుతో స్థిరాస్తులు కొనడం, భూములపై పెట్టుబడులు పెట్టడం వంటి దూర దృష్టి లేకపోవడం కూడా నన్ను ఆర్థికంగా దెబ్బతీసింది.
ముఖ్యంగా ఎవరైనా కష్టాల్లో ఉన్నామని వస్తే నా స్థాయికి మించి సహాయం చేసే వాడిని.. జేబులో 10,000 ఉంటే మరోచోట నుండి 15000 తీసుకువచ్చి ఇచ్చే మనస్తత్వం నాది. ఇతరులకు అండగా నిలవాలనే ఉత్సాహంతోనే పరిమితికి మంచి ఖర్చు చేయడం వల్ల ఒకానొక స్థాయిలో ఆర్థికంగా అటు కెరియర్ పరంగా దీనస్థితిని ఎదుర్కొన్నాను అంటూ నరేష్ తెలిపారు.అయితే ఇతరులకు ఖర్చు పెట్టడం మంచిదే కానీ అవసరానికి మించి ఖర్చు పెట్టడం నష్టాన్ని మిగులుస్తుందని తాను నేర్చుకున్నానని తెలిపారు నరేష్.. ఇక ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
also read:“వయలెంట్ మ్యాన్” ప్రభాస్ కి ‘సలార్ 2’ టీమ్ స్పెషల్ బర్తడే విషెస్.. క్రేజీ అప్డేట్ వైరల్!
1998 మధ్యకాలంలో రాజకీయాలలో చురుకుగా పాల్గొన్న నరేష్.. సుమారుగా 15 ఏళ్ల పాటు సినీ రంగానికి దూరంగా ఉండిపోయారు. ఇంట్లో సూపర్ స్టార్ కృష్ణ కాంగ్రెస్ భావజాలంతో ఉండగా.. తల్లి విజయనిర్మల టీడీపీ తరఫున ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు కూడా.. అయితే తాను మాత్రం రెండు పార్టీల వైపు కాకుండా బాల్యం నుండే చదివిన హిందూ హైస్కూల్, రామకృష్ణ మిషన్ స్కూల్ ఆలోచన విధానాల ప్రభావంతో భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల వైపు మొగ్గు చూపినట్లు వెల్లడించారు. ఇక పూర్తిస్థాయి కార్యకర్తలా గ్రౌండ్ లెవెల్ లో పనిచేస్తూ హిందూపురం లోక్సభ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన సందర్భాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. తాను రాజకీయాల్లో బిజీ అవడం వల్లే సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయాయి అని, ఆ పరిస్థితికి తాను ఎవరిని నిందించనని కూడా స్పష్టం చేశారు.